Anushka Shetty: మళ్లీ వెండితెరపై అలరించనున్న దేవసేన.. ఇంతకీ అనుష్కకు మనుపటి ఫాలోయింగ్ ఉందా.. అసలు జేజమ్మ రేంజ్ ఏంటి..?

Rajitha Chanti

Rajitha Chanti |

Updated on: Nov 11, 2022 | 1:08 PM

విజయశాంతి తర్వాత టాలీవుడ్‌‌లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు మార్కెట్ తీసుకొచ్చిన ఘనత మాత్రం స్వీటీ సొంతం. అరుంధతి నుంచి మొదలుపెడితే.. భాగమతి వరకు చాలా మాయ చేసారు జేజమ్మ.

Anushka Shetty: మళ్లీ వెండితెరపై అలరించనున్న దేవసేన.. ఇంతకీ అనుష్కకు మనుపటి ఫాలోయింగ్ ఉందా.. అసలు జేజమ్మ రేంజ్ ఏంటి..?
Anushka

టాలీవుడ్ జేజమ్మ అనుష్కకు తెలుగులో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందం, అభినయంతో ఎంతో మంది అభిమాలను సొంతం చేసుకుంది. సూపర్ సినిమాతో వెండితెరకు పరిచయమైన స్వీట్.. ఆ తర్వాత హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. అరుంధతి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు జేజమ్మగా మారింది.. అలాగే.. జక్కన్న తెరకెక్కించిన బాహుబలి చిత్రంలో దేవసేనగా అనుష్క నటన అద్భుతం. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అనుష్క.. బాహుబలి 2 తర్వాత వెండితెరపై కనిపించలేదు. చాలాకాలంగా సినీ పరిశ్రమకు దూరంగా ఉంటున్న స్వీట్.. ప్రస్తుతం యంగ్ హీరో నవీన్ పోలీశెట్టి సరసన నటిస్తోంది. ఇటీవల ఆమె పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటుంది. తాజాగా విడుదైలన పోస్టర్ లో అనుష్క.. బొద్దుగా కాకుండా సన్నజాజిలా మారి కనిపిస్తోంది. దీంతో జేజమ్మ కంబ్యాక్ అంటూ ట్వీట్స్ చేస్తున్నారు అభిమానులు. మరి ఇంతకీ జేజమ్మ రీఎంట్రీ ఎలా ఉంటుందో..

అనుష్క శెట్టికి మునపటి ఫాలోయింగ్ కంటిన్యూ అవుతుందా..? ఒకప్పట్లా ఈమెకు మార్కెట్ ఉందా..? అప్పుడు వచ్చినట్లుగానే.. ఇప్పుడు జేజమ్మ సినిమాకు ప్రేక్షకులు క్యూ కడతారా..? నాలుగేళ్ళ తర్వాత ఆడియన్స్ ముందుకొస్తున్న స్వీటీ.. ఆ రేంజ్‌లో మ్యాజిక్ చేయగలరా..? కొత్త సినిమాలో చెఫ్‌గా మారిపోయి.. మాయ చేయడానికి వచ్చేస్తున్నారు అనుష్క. మరి అదెంత వరకు వర్కవుట్ అవ్వనుంది..? కమర్షియల్ హీరోయిన్ అనే పదానికి నిలువెత్తు నిదర్శనం అనుష్క శెట్టి. కేవలం హీరోయిన్‌గానే కాకుండా.. సినిమాకు తానే హీరోగా కూడా మారిపోయి విజయాలు అందుకున్నారు ఈమె. విజయశాంతి తర్వాత టాలీవుడ్‌‌లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు మార్కెట్ తీసుకొచ్చిన ఘనత మాత్రం స్వీటీ సొంతం. అరుంధతి నుంచి మొదలుపెడితే.. భాగమతి వరకు చాలా మాయ చేసారు జేజమ్మ.

అరుంధతి తర్వాత ఓ వైపు హీరోయిన్‌గా గ్లామర్ షో చేస్తూనే.. మరోవైపు హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేసి మెప్పించారు అనుష్క. అయితే కొన్నాళ్ళుగా ఈమె స్క్రీన్ మీద కనిపించడం లేదు. బాహుబలి 2 తర్వాత సినిమాలకే దూరమయ్యారు. భాగమతి కూడా ఎప్పుడో ఒప్పుకున్న సినిమా. ఇది వచ్చి కూడా నాలుగేళ్లైపోయింది. మధ్యలో నిశ్శబ్ధం చేసినా.. అది ఓటిటి సినిమా.. పైగా వచ్చినట్లు కూడా ఆడియన్స్‌కు ఐడియా లేదు. అనుష్క ఈజ్ బ్యాక్ అని అభిమానులు చెప్పుకోవాలంటే.. నవీన్ పొలిశెట్టితో చేస్తున్న సినిమా కచ్చితంగా హిట్ కొట్టాల్సిందే. ఆమెకు మరో ఆప్షన్ కూడా లేదు. రారా కృష్ణయ్య ఫేమ్ మహేష్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్నారు. నవంబర్ 7న అనుష్క బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల చేసారు మేకర్స్. ఇందులో చెఫ్ అన్విత రవళి శెట్టిగా నటిస్తున్నారు జేజమ్మ. చూడాలిక.. ఈ చిత్రంతో ఏం మాయ చేయబోతున్నారో..?

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu