AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ori Devuda: అర్ధరాత్రి నుంచి ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ ఓరి దేవుడా.. ఎక్కడ చూడొచ్చు తెలుసా ..

విక్టరీ వెంకటేష్, విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్, ఆశా భట్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని పరల్ వి.పొట్లూరి నిర్మించారు. థియేటర్స్‌లో ప్రేక్షకులకు వినోదాన్ని పంచిన ఈ చిత్రం

Ori Devuda: అర్ధరాత్రి నుంచి ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ ఓరి దేవుడా.. ఎక్కడ చూడొచ్చు తెలుసా ..
Ori Devuda
Rajitha Chanti
|

Updated on: Nov 11, 2022 | 6:35 AM

Share

అన్‌లిమిటెడ్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో నిరంతంర ప్రేక్షకులను ఆకట్టుకుంటోన్న హండ్రెడ్ పర్సెంట్ తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహా తన ఎంటర్‌టైన్‌మెంట్ కిట్టీలో మరో క్రేజీ ప్రాజెక్టును యాడ్ చేసుకుంది. ఆ సినిమాయే ‘ఓరి దేవుడా’. విక్టరీ వెంకటేష్, విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్, ఆశా భట్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని పరల్ వి.పొట్లూరి నిర్మించారు. థియేటర్స్‌లో ప్రేక్షకులకు వినోదాన్ని పంచిన ఈ చిత్రం ఆహాలో నవంబర్ 10 అర్థరాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు థియేటర్లలో ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ మిస్ అయినవాళ్లు ఇప్పుడు ఆహా ఓటీటీలో ఎంజాయ్ చేయోచ్చు.. ఈ చిత్రాన్ని అశ్వత్ మారిముత్తు డైరెక్ట్ చేశారు.

మైఖేలాంజెలో ఫ్రెస్కో పెయింటింగ్, ఆడమ్ యొక్క సృష్టిని గుర్తుచేస్తూ, ఓ మిస్టరీయస్ మ్యాన్ (వెంకటేష్ దగ్గుబాటి) మన కథానాయకుడు అర్జున్ (విశ్వక్ సేన్)కి ఓ గోల్డెన్ టికెట్‌ను ఇస్తాడు. దాని ద్వారా అర్జున్ తన సమస్యను పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది. జీవితంలో సెకండ్ ఛాన్స్ అనే విషయంపై ఈ రొమ్ కామ్ రూపొందింది. ఇందులో ప్రేక్షకులు కోరుకునే అంశాలన్నీ ఉంటాయి. విభిన్న దృక్కోణాలను సినిమాలో చూస్తున్నప్పుడు అవి మన విషయాలను విభిన్నంగా చూసే విధానం ఫలితాన్ని ఎలా మార్చగలదు.. అదే సంబంధంలో మొత్తం కథనాన్ని ఎలా మార్చగలదు అనేది చిత్రం యొక్క ప్రధాన కథాంశం.

ఓరిదేవుడా సక్సెస్‌పై సంతోషంగా ఉన్నారు చిత్రయూనిట్. అలాగే ఈ మూవీలో మహిళా పాత్రలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని తెలుస్తోంది. ఈ సినిమా ఇప్పుడు ఆహాలో మన తెలుగు ప్రేక్షకులను మెప్పించనుంది. దీంతో సినిమా మరింత విస్తృతంగా ప్రేక్షకులను రీచ్ అవుతుందని భావిస్తున్నట్లు తెలిపింది చిత్రబృందం.

వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..