AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lavanya Tripathi: మళ్లీ టాలీవుడ్‏లో స్పీడ్ పెంచిన అందాల రాక్షసి.. మరో రెండు ప్రాజెక్ట్స్‏కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బ్యూటీ..

ప్రస్తుతం లావణ్య.. హ్యాపీ బర్త్ డే చిత్రంలో నటిస్తుంది. లేడీ ఓరియెంటెడ్ నేపథ్యంలో రాబోతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్, సాంగ్స్ ఆకట్టుకుంటున్నాయి.

Lavanya Tripathi: మళ్లీ టాలీవుడ్‏లో స్పీడ్ పెంచిన అందాల రాక్షసి.. మరో రెండు ప్రాజెక్ట్స్‏కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బ్యూటీ..
Lavanya
Rajitha Chanti
|

Updated on: Nov 11, 2022 | 7:00 AM

Share

అందాల రాక్షసిగా తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది హీరోయిన్ లావణ్య త్రిపాఠి. మొదటి సినిమాతోనే.. అందం, అభినయంతోనే ప్రేక్షకులకు చేరువయ్యింది. ఈ ముద్దుగుమ్మ నటనకు ఎన్నో ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత తెలుగులో భలే భలే మగాడివోయ్.. మనం.. సొగ్గాడే చిన్ని నాయన.. ఉన్నది ఒక్కటే జిందగీ.. అర్జున్ సురవరమ్ వంటి హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. అయితే కొద్ది నెలలగా వెండితెరపై ఈ అమ్మడి సందడి కనిపించడం లేదు. అలాగే మరో సినిమా అనౌన్స్మెంట్ కూడా రాలేదు. ప్రస్తుతం లావణ్య.. హ్యాపీ బర్త్ డే చిత్రంలో నటిస్తుంది. లేడీ ఓరియెంటెడ్ నేపథ్యంలో రాబోతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్, సాంగ్స్ ఆకట్టుకుంటున్నాయి.

అయితే లేటేస్ట్ అప్డేట్ ప్రకారం ఈముద్దుగుమ్మ వరుస ఆఫర్లతో బిజీగా మారిపోతుందట. ఇప్పటికే సౌత్ ఇండస్ట్రీలో అనేక అవకాశాలు అందుకుందట. తెలుగులో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో మంజునాథ దర్శకత్వంలో లావణ్య సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రంలో నటిస్తోంది. అలాగే తమిళంలో హీరో అధర్వతో నటిస్తున్న సినిమా రెండు పాటలు మినహా పూర్తయింది. కేవలం వెండితెరపైనే కాకుండా ఓటీటీలోనూ తనదైన ముద్ర వేసుకునేందుకు ప్రయత్నిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఆమె నటించిన జీ5 పులి మేక థ్రిల్లర్ వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. దీనికి కొన వెంకట్ దర్శకత్వం వహించారు. త్వరలోనే ఈ సిరీస్ విడుదల కానుంది. ఇక మరోవైపు తెలుగులో ఓ ప్రాజెక్ట్.. తమిళంలో ఓ సినిమా.. వెబ్ సిరీస్ లతో దూసుకెళ్తున్న లావణ్య.. త్వరలోనే మరో రెండు ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేయనుందట.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
పాక్ స్పిన్నర్ వివాదంపై బీసీసీఐ సెన్సేషనల్ క్లారిటీ
పాక్ స్పిన్నర్ వివాదంపై బీసీసీఐ సెన్సేషనల్ క్లారిటీ
డిస్కౌంట్‌ చీరల కోసం ఎగబడిన మహిళలు.. కట్ చేస్తే..
డిస్కౌంట్‌ చీరల కోసం ఎగబడిన మహిళలు.. కట్ చేస్తే..
కొత్త ఏడాది ముందు గ్యాస్ కష్టాలు.. ఉగాది తర్వాత ధరల విలయతాండవమేనా
కొత్త ఏడాది ముందు గ్యాస్ కష్టాలు.. ఉగాది తర్వాత ధరల విలయతాండవమేనా
గూగుల్ మ్యాప్స్‌ నుంచి ఆదిరిపోయే అప్‌డేట్.. ఫీచర్స్ తెలిస్తే..
గూగుల్ మ్యాప్స్‌ నుంచి ఆదిరిపోయే అప్‌డేట్.. ఫీచర్స్ తెలిస్తే..
చెంచాడు చెక్కరతో మీ స్కిన్ ను ముడతలు పడకుండా ఆపొచ్చని తెలుసా?
చెంచాడు చెక్కరతో మీ స్కిన్ ను ముడతలు పడకుండా ఆపొచ్చని తెలుసా?
పిల్లలు స్మార్ట్ ఫోన్‌కు బానిసయ్యారా?.. AIIMS వైద్యుల టిప్స్ ఇవి
పిల్లలు స్మార్ట్ ఫోన్‌కు బానిసయ్యారా?.. AIIMS వైద్యుల టిప్స్ ఇవి
సకల శుభాలు కలగాలంటే.. ఉగాది ముందే ఇంటి నుంచి వీటిని తొలగించండి
సకల శుభాలు కలగాలంటే.. ఉగాది ముందే ఇంటి నుంచి వీటిని తొలగించండి
అబ్రార్ అహ్మద్‎కు రూ.2.3 కోట్లు ఇచ్చి కావ్య కొనడానికి కారణం ఇదే
అబ్రార్ అహ్మద్‎కు రూ.2.3 కోట్లు ఇచ్చి కావ్య కొనడానికి కారణం ఇదే
గ్యాస్ సిలిండర్ల డెలివరీపై కేంద్రం మరో కఠిన రూల్..
గ్యాస్ సిలిండర్ల డెలివరీపై కేంద్రం మరో కఠిన రూల్..
యుద్ధంతో పర్యావరణ విధ్వంసం.. ప్రకృతి చెల్లిస్తున్న భారీ మూల్యం..
యుద్ధంతో పర్యావరణ విధ్వంసం.. ప్రకృతి చెల్లిస్తున్న భారీ మూల్యం..