AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kantara: కాంతార దారిలోనే తెలుగులోకి మరో బ్లాక్ బస్టర్ హిట్.. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బాలీవుడ్ మూవీ..

సెప్టెంబర్ 30న కన్నడలో రిలీజైన కాంతార చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ చిత్రం తెలుగులో అక్టోబర్ 15 న రిలీజై ఇక్కడ కూడా మంచి విజయాన్ని అందుకుంది.

Kantara: కాంతార దారిలోనే తెలుగులోకి మరో బ్లాక్ బస్టర్ హిట్.. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బాలీవుడ్ మూవీ..
Bediya
Rajitha Chanti
|

Updated on: Nov 11, 2022 | 11:37 AM

Share

ఒక మంచి సినిమాను ప్రేక్షకులు వద్దకు తీసుకెళ్లాలి అనే సంకల్పంతో “ఆహా” ఓటిటి ప్లాట్ ఫ్రామ్ తీసుకువచ్చారు. ఇతర భాషల్లో సూపర్ హిట్ అయిన సినిమాలను తెలుగులో అందిస్తూ తెలుగు ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నారు.. కేవలం ఓటిటిలోనే కాకుండా థియేటర్స్‏లో కూడా డబ్బింగ్ సినిమాలను రిలీజ్ చేస్తూ మరో ట్రెండ్ కి శ్రీకారం చుట్టారు. సెప్టెంబర్ 30న కన్నడలో రిలీజైన కాంతార చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ చిత్రం తెలుగులో అక్టోబర్ 15 న రిలీజై ఇక్కడ కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రాన్ని తెలుగులో మెగా నిర్మాత అల్లు అరవింద్ “గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్” ద్వారా రిలీజ్ చేసారు. రిలీజ్ అయిన మొదటిరోజు నుంచే ఈ చిత్రం ఊపందుకుంది. విడుదలైన అన్ని చోట్ల భారీ రెస్పాన్స్ వచ్చింది. కాంతార చిత్రం విడుదలైన 2 వారాల్లోనే రూ.45 కోట్లు వసూళ్లు సాధించి దాదాపుగా ఇప్పుడు రూ.60 కోట్ల వసూళ్లను సాధించింది. ఒక డబ్బింగ్ సినిమా ఈ స్థాయిలో హిట్ అవుతుందనేది ఊహాతీతం.

అదే తరహాలో “గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్” ఇప్పుడు వరుణ్ ధావన్, కృతి సనన్ నటిస్తున్న “భేదియా” చిత్రంతో మరో హారర్-కామెడీ యూనివర్స్‌ సినిమాను తెలుగు ప్రేక్షకులుకు అందించడానికి సిద్దమవుతుంది. తెలుగులో “తోడేలు” పేరుతో ఈ సినిమాను నవంబర్ 25న భారీ స్థాయిలో తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తుంది. ఇది వరకే ఈ చిత్రం నుండి విడుదలైన ట్రైలర్ కు సాంగ్స్ కు అనూహ్య స్పందన లభిస్తోంది.

ఇవి కూడా చదవండి

ఇప్పటికే ఈ చిత్ర ప్రొమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. త్వరలోనే వరుణ్ ధావన్, కృతిసనన్ కూడా నేరుగా హైదరాబాద్ విచ్చేసి ఈ సినిమా ప్రొమోషన్స్ లో పాల్గొననున్నారు. కాంతారతో సూపర్ సక్సెస్ అందుకున్న “గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్” ఇప్పుడు తోడేలు చిత్రంతో కూడా అదే స్థాయి విజయాన్ని సాధించుకుంటుంది అనే పరిణామాలు కనిపిస్తున్నాయి.

Follow Us
శని సంచారం.. ఏలినాటి శని ఉన్న రాశులపై ఎలాంటి ప్రభావం ఉంటుందంటే
శని సంచారం.. ఏలినాటి శని ఉన్న రాశులపై ఎలాంటి ప్రభావం ఉంటుందంటే
మూడ్రోజులే టైమ్.. అమల్లోకి కొత్త యూపీఐ ఛార్జీలు..
మూడ్రోజులే టైమ్.. అమల్లోకి కొత్త యూపీఐ ఛార్జీలు..
ఓటీటీలో వణుకుపుట్టిస్తోన్న తెలుగు హారర్ థ్రిల్లర్.
ఓటీటీలో వణుకుపుట్టిస్తోన్న తెలుగు హారర్ థ్రిల్లర్.
సస్పెండైన ఉద్యోగులే టార్గెట్‌గా వసూళ్ల దందా..
సస్పెండైన ఉద్యోగులే టార్గెట్‌గా వసూళ్ల దందా..
ఎంత కుమిలిపోయిందో పాపం.. పిల్లలో కలిసి బావిలో దూకి తల్లి ఆత్మహత్య
ఎంత కుమిలిపోయిందో పాపం.. పిల్లలో కలిసి బావిలో దూకి తల్లి ఆత్మహత్య
హోటల్‌లో వెయిటర్ గా పని చేశాడు..ఇప్పుడేమో తెలుగులో తోపు నటుడిగా..
హోటల్‌లో వెయిటర్ గా పని చేశాడు..ఇప్పుడేమో తెలుగులో తోపు నటుడిగా..
దారుణం.. కన్నతల్లిపై డీజిల్ పోసి సజీవ దహనం చేసిన కుమారుడు!
దారుణం.. కన్నతల్లిపై డీజిల్ పోసి సజీవ దహనం చేసిన కుమారుడు!
పీఎఫ్ విత్ డ్రా చేసేవారికి కొత్త రూల్స్.. ఇది మర్చిపోతే నో రీఫండ్
పీఎఫ్ విత్ డ్రా చేసేవారికి కొత్త రూల్స్.. ఇది మర్చిపోతే నో రీఫండ్
Video: నేడు భూమిని తాకనున్న సౌర తుపాను.. సిగ్నల్స్‌ పై ప్రభావం
Video: నేడు భూమిని తాకనున్న సౌర తుపాను.. సిగ్నల్స్‌ పై ప్రభావం
పవర్‌ఫుల్.. కోడి కాళ్లను తిన్నారంటే ఆ రోగాల మాటే ఉండదు..
పవర్‌ఫుల్.. కోడి కాళ్లను తిన్నారంటే ఆ రోగాల మాటే ఉండదు..