Dera Premi Murder Case: డేరా సచ్ఛా సౌదా అనుచరుడి దారుణ హత్య.. ముగ్గురు నిందితుల అరెస్ట్.. పాక్ ఉగ్రవాదుల ప్రమేయం ఉన్నట్లు గుర్తింపు

గురువారం పంజాబ్‌లోని ఫరీద్‌కోట్‌లో ఆరుగురు గుర్తుతెలియని దుండగులు డేరా సచ్చా సౌదా అనుచరుడిని కాల్చి చంపారు. ఫరీద్‌కోట్‌లోని కొట్కాపురాలో ఉన్న పాల దుకాణంలో ఉదయం 7.15 గంటల ప్రాంతంలో ప్రదీప్ సింగ్‌పై కాల్పులు జరిపినట్లు ఆయన తెలిపారు.

Dera Premi Murder Case: డేరా సచ్ఛా సౌదా అనుచరుడి దారుణ హత్య.. ముగ్గురు నిందితుల అరెస్ట్.. పాక్ ఉగ్రవాదుల ప్రమేయం ఉన్నట్లు గుర్తింపు
Punjab Dera Premi Pradeep Singh murder
Follow us

|

Updated on: Nov 11, 2022 | 4:04 PM

పంజాబ్ రాష్ట్రంలోని ఫరీద్‌కోట్‌లో డేరా సచ్చాసౌదా అనుచరుడు ప్రదీప్ సింగ్ హత్య కేసులో ముగ్గురు షూటర్లను పోలీసులు అరెస్టు చేశారు . ఢిల్లీ పోలీస్ స్పెషల్ ఇంటెలిజెన్స్ యూనిట్ అరెస్టు చేసింది. ఈ కేసులో పట్టుబడిన షూటర్లకు ఖలిస్థానీ సంబంధం ఉన్నట్లు తెరపైకి వచ్చింది. ఈ షూటర్లకు  పాకిస్థాన్‌లోని  ఖలిస్తానీ ఉగ్రవాది హర్విందర్ రిండాతో సంబంధం ఉన్నట్లు చెబుతున్నారు. అంతే కాదు ఈ హత్యలో గ్యాంగ్‌స్టర్‌ గోల్డీ బ్రార్‌, లారెన్స్ బిష్ణోయ్ ల సంబంధం కూడా తెరపైకి వస్తోంది. ప్రదీప్ సింగ్‌ను హతమార్చేందుకు వచ్చిన దుండగులు 60 బుల్లెట్లను వినియోగించారని పోలీసులు తెలిపారు. ఈ కాల్పుల్లో దాడి చేసిన నిందితుల్లో ఒకరికి గాయం అయింది.

రాష్ట్రంలోని అమృత్‌సర్‌లో శివసేన తక్సలీ నాయకుడు సుధీర్ సూరి హత్యకేసులో పోలీసులకు ఖలిస్తానీ సంబంధం ఉందని తెలిపారు. ఖలిస్తానీ ఉగ్రవాదులు ఇలాంటి ఘటనల ద్వారా హిందూ-సిక్కుల అల్లర్లను రెచ్చగొట్టాలనుకుంటున్నారని తేలింది. అయితే ప్రస్తుతం నిందితులను ఫరీద్‌కోట్ కేసులో పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

గురువారం పంజాబ్‌లోని ఫరీద్‌కోట్‌లో ఆరుగురు గుర్తుతెలియని దుండగులు డేరా సచ్చా సౌదా అనుచరుడిని కాల్చి చంపారు. ఫరీద్‌కోట్‌లోని కొట్కాపురాలో ఉన్న పాల దుకాణంలో ఉదయం 7.15 గంటల ప్రాంతంలో ప్రదీప్ సింగ్‌పై కాల్పులు జరిపినట్లు ఆయన తెలిపారు. ఈ దాడిలో ప్రదీప్ అంగరక్షకుడు, మరో వ్యక్తి కూడా బుల్లెట్ గాయాలు అయ్యాయి.

గ్యాంగ్‌స్టర్ గోల్డీ బాధ్యత తీసుకున్నాడు! కెనడాకు చెందిన గ్యాంగ్‌స్టర్‌ గోల్డీ బ్రార్‌ తాము ఈ హత్యకు బాధత్య వహిస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మే నెలలో పంజాబీ గాయకుడు సిద్ధూ ముసేవాలా హత్య కేసులో బ్రార్ ప్రధాన నిందితుడు. సింగ్ హత్యకు సంబంధించిన ఈ ఘటన సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. మోటార్‌సైకిల్‌పై వచ్చిన ఆరుగురిలో ఇద్దరు దుండగులు ప్రదీప్ సింగ్ దుకాణంలోకి ప్రవేశించి అతనిపై కాల్పులు జరిపినట్లు సీసీటీవీ ఫుటేజీలో తేలింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ప్రదీప్ సింగ్ బాడీగార్డు కూడా దుండగులపై ఎదురు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఒక నిందితుడి కాలికి గాయం అయింది. ఈ ఘటన అనంతరం మూడో మోటార్‌సైకిల్‌ను అక్కడే వదిలివేసి.. దుండగులు రెండు మోటార్ సైకిల్స్ పై పరారయ్యారు.

కోట్కాపురాకు 20 కిలోమీటర్ల దూరంలోని బజఖానా ప్రాంతంలో రెండు ద్విచక్రవాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుడు ప్రదీప్‌ సింగ్‌ 2015లో సిక్కుల పవిత్ర గ్రంథం గురు గ్రంథ్‌ సాహిబ్‌ ప్రతిని చోరీ చేసి చించివేసిన కేసులో నిందితుడి. ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నాడు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..