PM Modi: ‘మోదీ’ నినాదాలతో మారుమోగిన బెంగళూరు.. అభిమానుల కోసం మధ్యలోనే కాన్వాయ్ ఆపిన ప్రధాని..

ప్రధాని నరేంద్ర మోదీ దక్షిణాది టూర్ కొనసాగుతోంది. కర్ణాకటలోని బెంగళూరులో పర్యటిస్తున్న మోదీ.. KSR రైల్వే స్టేషన్‌లో వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌, భారత్ గౌరవ్ కాశీ దర్శన్ రైలును..

PM Modi: ‘మోదీ’ నినాదాలతో మారుమోగిన బెంగళూరు.. అభిమానుల కోసం మధ్యలోనే కాన్వాయ్ ఆపిన ప్రధాని..
Pm Modi In Bengaluru
Follow us
Shiva Prajapati

|

Updated on: Nov 11, 2022 | 4:12 PM

ప్రధాని నరేంద్ర మోదీ దక్షిణాది టూర్ కొనసాగుతోంది. కర్ణాకటలోని బెంగళూరులో పర్యటిస్తున్న మోదీ.. KSR రైల్వే స్టేషన్‌లో వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌, భారత్ గౌరవ్ కాశీ దర్శన్ రైలును ప్రారంభించారు. కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో రెండో టెర్మినల్‌ను ప్రారంభించారు. బెంగళూరులో 108 అడుగుల నాదప్రభు కెంపెగౌడ విగ్రహాన్ని ఆవిష్కరించారాయన. అయితే దీనికి ముందు బెంగళూరులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తనకు మద్ధతుగా, తనను చూడటానికి భారీగా తరలి వచ్చిన అభిమానులు, బీజేపీ కార్యకర్తలు, మద్దతుదారులను చూసి మురిసిపోయారు మోదీ. కర్ణాటక ‘విధాన సౌద’కు సమీపంలో, పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం వద్ద కీలకమైన ట్రాఫిక్ జంక్షన్ వద్ద ప్రధాని మోదీ తన కాన్వాయ్‌ని ఆపారు. పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులకు అభివాదం చేశారు. నమస్కరిస్తూ, చేతులు ఊపుతు అభివాదం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ.

‘వందే భారత్’ ఎక్స్‌ప్రెస్, ‘భారత్ గౌరవ్ కాశీ దర్శన్’ రైళ్లను ప్రారంభించడానికి కేఎస్ఆర్(క్రాంతివీర సంగొల్లి రాయన్న) స్టేషన్‌కు వెళ్తున్న సందర్భంలో మోదీ ఇలా తన అభిమానులను పలకరించారు. మొదట నిలిపిన చోట రన్నింగ్ బోర్డ్‌పై నిలబడి ప్రజలకు అభివాదం చేశారు ప్రధాని మోదీ. దాంతో ఆ ప్రాంగాణం అంతా ‘మోదీ మోదీ’ నినాదాలతో మారుమ్రోగింది. అనంతరం కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం(కేఐఏ) టెర్నినల్ 2 ను ప్రారంభించేందుకు వెళ్తుండగా కేసఎస్ఆర్ రైల్వే స్టేషన్ సమీపంలోని ప్రధాన ట్రాఫిక్ జంక్షన్ వద్ద వాహనం దిగారు ప్రధాని మోదీ. నలువైపులా గుమిగూడిన జనం వద్దకు వెళ్లి, వారితో కరచాలనం చేశారు.

తొలుత ట్రైన్స్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ.. ఆ తరువాత కేఐఏ టెర్మినల్ – 2 ని ప్రారంభించారు. అనంతరం 600 సంవత్సరాల క్రితం బెంగళూరును స్థాపించిన విజయనగరర సామ్రాజ్యాధిపతి అయిన ‘నాడప్రభు’ కెంపేగౌడ 108 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఆవిష్కరించారు ప్రధాని మోదీ. కాగా, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు మరో ఆరు నెలల కంటే తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ బెంగళూరు పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇవి కూడా చదవండి

కాగా, బెంగళూరులోని అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్-2ను రూ. 5000 కోట్లతో నిర్మించారు. మొత్తం 2,55,645 చదరపు మీటర్ల విస్తీర్ణం కలిగిన ఈ టెర్మినల్- 2 మొదటి దశలో 22 కాంటాక్ట్ గేట్లు, 15 బస్ గేట్లు, 95 చెక్-ఇన్ సొల్యూషన్‌లు, 17 సెక్యూరిటీ చెక్ లేన్‌లను కలిగి ఉంటుంది. 9 కస్టమ్స్ హ్యాండ్ బ్యాగేజీ స్క్రీనింగ్ కూడా ఉంది. గేట్ లాంజ్ 5,932 మంది సీటింగ్ కెపాసిటీని కలిగి ఉంది. T-2 మొదటి దశ నిర్మాణం.. సంవత్సరానికి 25 మిలియన్ల మంది ప్రయాణీకుల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ టెర్మినల్ – 2 ని నాలుగు సూత్రాల ఆధారంగా నిర్మించినట్లు కర్ణాటక అధికారులు చెబుతున్నారు.

ప్రధాని మోదీ పర్యటనలో కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్, ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, కర్ణాటక మంత్రివర్గం సభ్యులు, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు నళిన్ కుమార్ కటీల్, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు బీఎస్ యడ్యూరప్ప, పార్టీ శాసనసభ్యులు, అధికారులు ఉన్నారు.

Pm Modi In Bengaluru

Pm Modi In Bengaluru

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..