AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Loans: గోల్డ్ లోన్ తీసుకోవాలని భావిస్తున్నారా? వడ్డీ రేట్లను ప్రభావితం చేసే అంశాలివే.. తప్పక తెలుసుకోండి..

గత కొంతకాలంగా బంగారు ఆభరణాలపై రుణాలు తీసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. బంగారు రుణాలతో నష్టం లేకపోగా లాభమే ఉండటం, తక్కువ వడ్డీకే

Gold Loans: గోల్డ్ లోన్ తీసుకోవాలని భావిస్తున్నారా? వడ్డీ రేట్లను ప్రభావితం చేసే అంశాలివే.. తప్పక తెలుసుకోండి..
Gold Loan
Shiva Prajapati
|

Updated on: Nov 12, 2022 | 10:36 PM

Share

గత కొంతకాలంగా బంగారు ఆభరణాలపై రుణాలు తీసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. బంగారు రుణాలతో నష్టం లేకపోగా లాభమే ఉండటం, తక్కువ వడ్డీకే రుణాలు లభించడం ఇందుకు కారణం. బంగారు ఆభరణాలతో లోన్ చాలా త్వరగా వస్తుంది. అత్యవసర సమయంలో గోల్డ్ లోన్ అనేది చాలా ఉపయుక్తం అవుతుంది. ఎలాంటి అవసరాలకైనా వినియోగించుకోవచ్చు. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు వంటి రుణదాతలు దేశీయ మార్కెట్‌లోని బంగారు ఆభరణాల మొత్తం విలువలో నిర్ణీత విలువ ప్రకారం రుణాలు అందజేస్తున్నాయి.

అయితే, ప్రతి గోల్డ్ లోన్ గోల్డ్ లోన్ వడ్డీ రేట్లను కలిగి ఉంటుంది. ఇది రుణ సేవలను అందించడానికి బ్యాంకులు, వెండర్స్ వసూలు చేస్తారు. రుణ గ్రహీత రుణ కాల వ్యవధిలో ప్రధాన రుణ మొత్తాన్ని వడ్డీతో సహా తిరిగి చెల్లించడానికి చట్టబద్ధంగా బాధ్యత వహిస్తాడు. తద్వారా తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలను కస్టమర్ తీసుకోవడానికి వీలుంటుంది. అయితే, వివిధ బ్యాంకులు, గోల్డ్ లోన్ అందించే సంస్థలు వేర్వేరు వడ్డీ రేట్లను వసూలు చేస్తాయి. కానీ, కస్టమర్లు ఎంచుకున్న గోల్డ్ లోన్ వడ్డీ రేట్లు అతి తక్కువగా ఉండేలా చూసుకోవడం చాలా అవసరం. లేదంటే వడ్డీ భారం మీద పడటం ఖాయం.

గోల్డ్ లోన్ వడ్డీ రేట్లను ప్రభావితం చేసే అంశాలు..

బంగారు రుణం తీసుకునేటప్పుడు, రుణగ్రహీతలు తక్కువ వడ్డీకి బంగారు రుణాన్ని ఇష్టపడతారు. అయితే, గోల్డ్ లోన్ వడ్డీ రేట్లను ప్రభావితం చేసే అంశాలను అర్థం చేసుకోకుండా అటువంటి రుణాలను ఎంచుకోవడం సవాలుగా మారుతుంది. గోల్డ్ లోన్ వడ్డీ రేట్లను ప్రభావితం చేసే కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇవి కూడా చదవండి

1. డిమాండ్, సరఫరా..

సరఫరా కంటే బంగారానికి డిమాండ్ ఎక్కువగా ఉంటే, ఆటోమాటిక్‌గా బంగారం ధర పెరుగుతుంది. అలాకాకుండా డిమాండ్ కంటే సరఫరా ఎక్కువగా ఉంటే, బంగారం ధర తగ్గుతుంది. మారుతున్న బంగారం ధరలకు అనుగుణంగా వెండర్స్ బంగారం రుణాలపై వడ్డీ రేట్లను సవరిస్తారు.

2. ఆర్థిక పరిస్థితి..

భారతదేశ ఆర్థిక పరిస్థితి దేశీయ బంగారం ధర, బంగారు రుణాలపై వచ్చే వడ్డీ రేట్లను ప్రభావితం చేస్తుంది. ఆర్థిక వ్యవస్థ ప్రతికూల దశలో ఉన్నప్పుడు పెట్టుబడిదారులు భౌతికంగా లేదా ఆన్‌లైన్‌లో ఎక్కువ బంగారాన్ని కొనుగోలు చేస్తారు.

3. ద్రవ్యోల్బణం, ఈక్విటీలు..

బంగారం వడ్డీ రేట్లను ద్రవ్యోల్బణం, ఈక్విటీలు కూడా ప్రభావితం చేస్తాయి. బంగారానికి ఎక్కువగా డిమాండ్ ఉన్నందున రుణ గ్రహీతలు అతి తక్కువ వడ్డీ రేటును పొందేందుకు అవకాశం ఉంటుంది.

4. రుణ కాల వ్యవధి..

గోల్డ్ లోన్‌ను తిరిగి చెల్లించడానికి ఎక్కువ సమయం ఉంటుంది. కాబట్టి, రుణ కాల వ్యవధి ఎక్కువ, వడ్డీ రేట్లు తక్కువగా ఉంటాయి. అందువల్ల, నెలవారీ EMIల ఆధారంగా సహేతుకమైన ఆర్థిక బాధ్యతలను సృష్టించే రుణ కాల వ్యవధిని ఎంచుకోవడం చాలా అవసరం.

5. దేశీయ బంగారం ధర..

దేశీయ బంగారం ధర బంగారు రుణాల వడ్డీ రేట్లకు విలోమానుపాతంలో ఉంటుంది. బంగారం ధర ఎక్కువ, వడ్డీ రేటు తక్కువగా ఉంటుంది. ఎందుకంటే మీరు తాకట్టు పెట్టిన బంగారం విలువ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. అందువల్ల, తక్కువ వడ్డీతో బంగారు రుణం పొందేందుకు బంగారం ధరలను నిరంతరం పర్యవేక్షించడం చాలా అవసరం.

IIFL ఫైనాన్స్‌తో ఆదర్శవంతమైన గోల్డ్ లోన్ పొందండి..

IIFL వినియోగదారులకు మంచి సేవలను అందిస్తోంది. గోల్డ్ లోన్‌ కోసం దరఖాస్తు చేసిన 30 నిమిషాలలోపు బంగారం విలువ ఆధారంగా ఇన్‌స్టంట్ ఫండ్‌లను అందిస్తుంది. తద్వారా కస్టమర్లు ఉత్తమ ప్రయోజనాలను పొందుతారు. IIFL ఫైనాన్స్ గోల్డ్ లోన్‌లు అతి తక్కువ రుసుము, ఛార్జీలతో ఇవ్వడం జరుగుతుంది. అందుబాటులో ఉన్న అత్యంత సరసమైన రుణ పథకం ఇది. IIFL ఫైనాన్స్‌లో లోన్ కోసం దరఖాస్తు చేసిన తర్వాత కస్టమర్లు భరించాల్సిన అదనపు ఖర్చులు ఏమీ ఉండవు. మరింత సమాచారం కోసం, http://www.iifl.comని సందర్శించవచ్చు.

తరచుగా అడిగే ప్రశ్నలు:

Q.1: IIFL ఫైనాన్స్ గోల్డ్ లోన్‌లపై వడ్డీ రేట్లు ఏమిటి? జ: IIFL ఫైనాన్స్ గోల్డ్ లోన్‌లపై వడ్డీ రేట్లు 6.48% – 27%.

Q.2: IIFL ఫైనాన్స్ గోల్డ్ లోన్‌తో నేను ఎంత గోల్డ్ లోన్ మొత్తాన్ని పొందగలను? జవాబు: గోల్డ్ లోన్ మొత్తంపై గరిష్ట పరిమితి లేదు మరియు ఇది బంగారు ఆభరణాల మొత్తం విలువపై ఆధారపడి ఉంటుంది.

Q.3: IIFL ఫైనాన్స్ గోల్డ్ లోన్ కోసం లోన్ వ్యవధి ఎంత? జ: లోన్ కాలపరిమితి 24 నెలల వరకు ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..