Facts: పాము తనను తాను కరుచుకుంటే చనిపోతుందా.? విషం ఎలాంటి ప్రభావం చూపుతుంది.?

పాము అనగానే ఒక్కసారిగా భయపడుతుంటాం. దీనికి కారణం దాని విషమే. విష సర్పం కాటేస్తే మనిషి క్షణాల్లో మరణిస్తాడు. అందుకే పాము విషం చాలా ప్రమాదకరమైంది. కొన్ని రకాల పాములు విషాన్ని బయటకు కూడా చిమ్మి ఇతర జీవులపై అటాక్‌ చేస్తాయి. అయితే పాము తనను తాను కరుచుకుంటే..

Facts: పాము తనను తాను కరుచుకుంటే చనిపోతుందా.? విషం ఎలాంటి ప్రభావం చూపుతుంది.?
Snake Facts
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 13, 2022 | 9:16 PM

పాము అనగానే ఒక్కసారిగా భయపడుతుంటాం. దీనికి కారణం దాని విషమే. విష సర్పం కాటేస్తే మనిషి క్షణాల్లో మరణిస్తాడు. అందుకే పాము విషం చాలా ప్రమాదకరమైంది. కొన్ని రకాల పాములు విషాన్ని బయటకు కూడా చిమ్మి ఇతర జీవులపై అటాక్‌ చేస్తాయి. అయితే పాము తనను తాను కరుచుకుంటే ఏమవుతుంది.? పాము విషం పాముపై ప్రభావం చూపుతుందా అని ఎప్పుడైనా ఆలోచించారా.? ఇంతకీ పాము తనను తాను కరుచుకోవడం వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

పాము విషం దాని నోటిలోని విష గ్రంధుల్లోనే ఉంటాయి. తనకు ఇతర జీవుల నుంచి ఏదైనా అపాయం ఉందన్నగానే వెంటనే కాటేస్తుంది. దీంతో విషం శరీరంలోకి ప్రవేశించి జీవి మరణిస్తుంది. ఉదాహరణకు పాము ఎలుకను కాటేసి మింగేసింది అనుకుందాం.. అప్పుడు పాము వదిలిన విషం ఎలుకతో పాటు దాని కడుపులోకి వెళ్తుంది. అయితే ఇలా విషం కడుపులోకి వెళ్లినా దానికి ఏం జరగదు. దీనికి కారణం పాము పొట్టలో ఉండే యాసిడ్స్‌ విషాన్ని విచ్చిన్నం చేస్తాయి. దీంతో దానిపై ఆ విషం ఎలాంటి ప్రభావం చూపదు.

ఒకవేళ పాము తనను తాను కరుచుకుంటే విషం దాని రక్తంలోకి వెళుతుంది. అయితే ఈ సమయంలో కూడా దానికి ఎలాంటి హాని జరగదు. దీనికి కారణం.. పాము నోట్లో నుంచి విషం అడపాదడపా కడుపులోకి వెళుతుంది. దీంతో పాములో ఉండే సహజ రోగ నిరోధక శక్తి క్రమంగా ఆ విషాన్ని తట్టుకునే శక్తిని ఇస్తుంది. ఆ విషానికి విరుడుగా యాంటీ డోట్‌ని తయారు చేసుకుంటుంది. దీంతో పాము రక్తంలో అప్పటికే విషానికి విరుడుగా యాంటీ టాక్సిల్స్‌ తయారవుతాయి కాబట్టి పాముకు విషయంతో ఎలాంటి ప్రభావం ఉండదు. అయితే ఒక జాతికి చెందిన పామును మరో జాతికి చెందిన పాము కరిస్తే మాత్రం చనిపోయే ప్రమాదం ఉండే అవకాశాలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..