AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Salto de Castro: గ్రామానికి యజమానికి కావాలని అనుకుంటున్నారా.. అందుబాటు ధరలో అమ్మకానికో గ్రామం.. ఎక్కడంటే

స్పెయిన్‌లోని ఓ గ్రామాన్ని ప్రస్తుతం అమ్మకానికి పెట్టారు. ధర కూడా అందుబాటులోనే. కేవలం 2,27,000 యూరోలకే అంటే భారత కరెన్సీలో సుమారు 2కోట్ల 16లక్షల రూపాయలు మాత్రమే చెల్లిస్తే గ్రామం మొత్తం సొంతం చేసుకోవచ్చు.

Salto de Castro: గ్రామానికి యజమానికి కావాలని అనుకుంటున్నారా.. అందుబాటు ధరలో అమ్మకానికో గ్రామం.. ఎక్కడంటే
Spanish Village
Surya Kala
|

Updated on: Nov 13, 2022 | 6:48 PM

Share

సొంతంగా ఓ ఇల్లు లేదా ఖరీదైన విల్లా కొనుగోలు చేయాలనే కోరిక ఎవరికైనా ఉంటుంది. అందుకోసం ఎన్ని లక్షల రూపాయలైనా ఖర్చు పెట్టి తమ స్వప్నాన్ని సాకారం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలో అదే డబ్బుతో ఏకంగా ఓ గ్రామాన్నే కొనొచ్చంటే.. ఇది నిజం.. అవును.. స్పెయిన్‌లోని ఓ గ్రామాన్ని ప్రస్తుతం అమ్మకానికి పెట్టారు. ధర కూడా అందుబాటులోనే. కేవలం 2,27,000 యూరోలకే అంటే భారత కరెన్సీలో సుమారు 2కోట్ల 16లక్షల రూపాయలు మాత్రమే చెల్లిస్తే గ్రామం మొత్తం సొంతం చేసుకోవచ్చు.

సాల్టో డే కాస్ట్రో అనే గ్రామం పోర్చుగల్‌ సరిహద్దులో ఉంది. రాజధాని మాడ్రిడ్‌ నుంచి మూడు గంటల్లో అక్కడికి చేరుకోవచ్చు. 1950ల్లో ఆ ప్రాంతంలో ఓ రిజర్వాయర్‌ నిర్మాణాన్ని చేపట్టారు. ఆ సమయంలో కార్మికుల కోసం విద్యుత్‌ ఉత్పత్తి సంస్థ నివాసాలు ఏర్పాటు చేసింది. అయితే, ఆ ప్రాజెక్టు పూర్తైన తర్వాత అక్కడివారంతా సమీప పట్టణాలకు తరలిపోయారు. ఇలా 1990 చివరి నాటికి ఆ ఊరు మొత్తం ఖాళీ అయ్యింది. అక్కడ 44 ఇల్లు, ఓ హోటల్‌, చర్చి, పాఠశాల, స్విమ్మింగ్‌ పూల్‌తోపాటు ఇతర సదుపాయాలున్నాయి. అయితే, ఆ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో 2000ల్లో ఆ గ్రామాన్ని ఓ కుటుంబం కొనుగోలు చేసింది. కానీ కొన్ని ఆర్థిక సమస్యల వల్ల ఆ ప్రణాళికను విజయవంతం చేయలేకపోయింది. దీంతో చివరకు ఆ గ్రామాన్ని విక్రయించాలని నిర్ణయించిన కుటుంబం.. స్పెయిన్‌కి చెందిన ప్రముఖ ప్రాపర్టీ వెబ్‌సైట్‌లో వివరాలను పొందుపరిచింది. నవంబర్‌ తొలివారంలో ఆ ప్రకటన పోస్టు చేయగా.. భారీ స్పందన వస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 50వేల మంది ఆ ప్రాపర్టీ వివరాలను చూడగా.. రష్యా, ఫ్రాన్స్‌, బెల్జియంతోపాటు బ్రిటన్‌కు చెందిన 300 మంది ఆ గ్రామాన్ని కొనేందుకు ముందుకు వచ్చినట్లు విక్రయానికి ఉంచిన సంస్థ ప్రతినిధి రోడ్రిగజ్‌ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..