Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వంటిల్లు మరమ్మతులు చేస్తుండగా 300ఏళ్ల నాటి నిధి లభ్యం.. వేలం పాటతో ధనవంతులైన దంపతులు..

ఈ అరుదైన నాణేలను వంటగది నేల కింద పాతిపెట్టారు. దంపతులు తమ ఇంట్లో మరమ్మతులు చేస్తుండగా, వారికి ఈ నాణేలు దొరికాయి. కాగా, నాణేలు ఇటీవల వేలంలో విక్రయించారు.

వంటిల్లు మరమ్మతులు చేస్తుండగా 300ఏళ్ల నాటి నిధి లభ్యం.. వేలం పాటతో ధనవంతులైన దంపతులు..
Gold Coins
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 17, 2022 | 6:49 PM

ఇల్లు మరమ్మతులు చేయించుకుంటున్న దంపతులకు పురాతన నిధి లభించింది. దాంతో ఉన్నఫళ్లంగా ఆ దంపతులు వెలకట్టలేని ధనవంతులయ్యారు. వారి ఇంట్లో 300 ఏళ్ల కాలం నాటి 264 అరుదైన బంగారు నాణేలు లభించాయి. వాటిని చూసిన దంపతులు తొలుత వారి కళ్లను వారే నమ్మలేకపోయారు. బంగారు నాణేలు చూసి ఒక్కసారి నమ్మలేకపోయారు. స్థానిక అధికారులకు సమాచారం అందించారు. దాంతో ఈ నాణేలను ఇటీవల వేలం వేశారు. 1610- 1727 మధ్య కాలంలో వాడిన అరుదైన బంగారు నాణేలుగా పురావస్తు నిపుణులు గుర్తించారు. బ్రిటన్‌లోని ఓ ధనిక కుటుంబానికి చెందిన వ్యక్తి అప్పట్లో ఈ నిధిని భూమిలోపల భద్రపరిచినట్టుగా గుర్తించారు. కాగా, ఆ ఇంట్లో లభించిన నిధి విలువ దాదాపు రూ.7 కోట్లకు పైగా ఉంటుందని తెలిపారు. ఈ అరుదైన నాణేలను వంటగది నేల కింద పాతిపెట్టారు. దంపతులు తమ ఇంట్లో మరమ్మతులు చేస్తుండగా, వారికి ఈ నాణేలు దొరికాయి. కాగా, నాణేలు ఇటీవల వేలంలో విక్రయించారు. మరింత లోతుగా విశ్లేషిస్తే..

యూకేలోని నార్త్ యార్క్‌షైర్‌లోని ఓ ఇంట్లో దంపతులకు 264 బంగారు నాణేలు లభించాయి. నాణేలు ఇంటి కప్పులో నింపిపెట్టారు. ఇంకా వంటగది లోపల 6 అంగుళాల మద్దంలో భూమిలో పాతిపెట్టారు. ఏదో మెరుస్తున్నట్టుగా గమనించిన ఆ దంపతులు.. భూమి లోపల కరెంటు తీగ ఉందని అనుకున్నారు. అయితే కప్పును సరిగ్గా పరిశీలించి చూడగా.. అందులో 1610- 1727 మధ్య కాలం నాటి నాణేలు బయటపడ్డాయి. నాణేలను స్వాధీనం చేసుకున్న వెంటనే ఈ జంట లండన్‌లోని వేలం కంపెనీని సంప్రదించారు. ఆ తర్వాత కంపెనీకి సంబంధించిన వ్యక్తులు దంపతుల ఇంటికి వచ్చారు. ఈ నాణేలు దాదాపు 300 ఏళ్ల నాటివని తేల్చి చెప్పారు.

ఈ నాణేలు ఫియర్న్లీ-మీస్టర్స్ అనే సంపన్న కుటుంబానికి చెందినవారివని నివేదికలో చెప్పబడింది. ఈ కుటుంబం ఆ రోజుల్లో పేరున్న వ్యాపారవేత్తలు. ఈ కుటుంబ సభ్యులు తరువాత పార్లమెంటు సభ్యులు, 17వ శతాబ్దం ప్రారంభంలో విగ్ పార్టీ ప్రసిద్ధ నాయకులుగా పేరుగాంచారు.

ఇవి కూడా చదవండి

కాగా, ఇటీవల ఈ నాణాలను వేలంలో సుమారు 7 కోట్ల రూపాయలకు విక్రయించినట్లు సమాచారం. ఈ నాణేల విక్రయం అనేక రకాలుగా విభిన్నంగా ఉందని వేలం నిర్వాహకుడు గ్రెగరీ ఎడ్మండ్ తెలిపారు. ఈ జంట వారి వివరాలను బయటపెట్టేందుకు అంగీకరించలేదు. కానీ, వారు 10 సంవత్సరాలుగా అదే ఇంట్లో నివసిస్తున్నారని, రెండేళ్ల క్రితం ఈ నాణేలను కనుగొన్నారని చెప్పారు. ఈ నాణేల కథ, అవి దొరికిన తీరు విచిత్రంగా ఉన్నప్పటికీ,ఈ నాణేలు మాత్రం చాలా అరుదు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి