మహిళా ఆర్మీ అధికారి కుమార్తెపై లైంగికదాడి.. క్రెడిట్‌, డబ్బు దోచుకుని పరారైన దుండగులు..

అక్కడ తన కూతురు అచేతనంగా, ఆందోళనకర స్థితిలో కనిపించింది. కూతుర్ని అలా చూసిన ఆ తల్లి కంగారుపడింది. కాళ్లకు చెప్పులు కూడా లేవు.. చుట్టూ పక్కల కూడా కనిపించలేదు. జుట్టు చిందరవందరగా ఉంది. తనను చూడగానే ఏడుపు తన్నుకు వచ్చింది.

మహిళా ఆర్మీ అధికారి కుమార్తెపై లైంగికదాడి.. క్రెడిట్‌, డబ్బు దోచుకుని పరారైన దుండగులు..
Lucknow Police Car
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 17, 2022 | 6:21 PM

ఆర్మీ మెడికల్ సీనియర్ మహిళా అధికారి కుమార్తెపై లైంగిక వేధింపుల ఘటన వెలుగు చూసింది. ఓ అధికారి కుమార్తె ఇంటికి తిరిగి వస్తుండగా కారులో వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని దుండగులు ఆమెపై వేధింపులకు పాల్పడ్డారు. ఆమె వద్ద ఉన్న క్రెడిట్ కార్డు, రూ.500 దోచుకుని పారిపోయారు. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నోలో చోటు చేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఈ ఘటన నవంబర్ 8న జరగ్గా, బుధవారం ఎఫ్ఐఆర్ నమోదుచేశారు పోలీసులు. ఎఫ్‌ఐఆర్‌ ప్రకారం.. 22 ఏళ్ల బాధితురాలు లక్నోలోని SGPGI ప్రాంతంలోని రిటైల్ స్టోర్ నుండి వస్తువులను కొనుగోలు చేయడానికి తన ఇంటి నుండి బయటకు వెళ్లింది. అయితే, గంటలు గడిచినా కూడా ఆమె ఇంటికి రాలేదు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ కావడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. చివరకు ఆమె తల్లి స్వయంగా షాపింగ్ మాల్‌కు వెళ్లింది. యువతి అక్కడికి వచ్చినట్లు మాల్ సిబ్బంది నిర్ధారించారు. కానీ, తిరిగి ఇంటికి రాకపోవటంతో ఆమె..పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు టెలిబాగ్ పోలీస్ అవుట్‌పోస్టుకు చేరుకుంది.

అంతలోనే ఆమెకు గుర్తు తెలియని వ్యక్తి నుంచి కాల్ వచ్చింది. గోమతి నగర్‌లోని ఫన్‌ రిపబ్లిక్‌ పోలీస్‌ ఔట్‌పోస్ట్‌లో తన కూతురు ఉందని ఫోన్‌ చేసిన వ్యక్తి చెప్పాడు. దాంతో హుటాహుటినా ఆ తల్లి ఫన్ రిపబ్లిక్ పోలీస్ ఔట్ పోస్ట్ చేరుకుంది.. అక్కడ తన కూతురు అచేతనంగా, ఆందోళనకర స్థితిలో కనిపించింది. కూతుర్ని అలా చూసిన ఆ తల్లి కంగారుపడింది. కాళ్లకు చెప్పులు కూడా లేవు.. చుట్టూ పక్కల కూడా కనిపించలేదు. జుట్టు చిందరవందరగా ఉంది. తనను చూడగానే ఏడుపు తన్నుకు వచ్చిందని బాధితురాలి తల్లి దీనంగా చెప్పుకుంది.

ఈ మేరకు బాధిత యువతి తెలిపిన వివరాల మేరకు…ఆ రోజు ఉదయం నుంచి ఓ యువకుడు తనను వెంబడించినట్టుగా చెప్పింది. తాను టెలీబాగ్ వైపు వెళ్తున్నప్పుడు మార్గ మధ్యలో బైక్‌పై కూర్చున్నాడు. ఇంతకు ముందు వెళ్లిన మాల్ లో కావాల్సినవి దొరకకపోవడంతో ఆటో ఎక్కి టెలిబ్యాగ్ కు వెళ్లాను. టెలిబాగ్‌లో ఆటో దిగుతుండగా, నా పక్కనే ఓ తెల్లటి కారు వచ్చింది. ఆ కారులో అదే యువకుడు ఉన్నాడు. తనను జుట్టు పట్టుకుని కారులోకి ఎక్కించినట్టుగా చెప్పింది.. మరొకరు డ్రైవింగ్ చేశారని, అతడు తనతో నోటికి వచ్చినట్టుగా, అసభ్యకరంగా మాట్లాడుతూ,..తన బట్టలు కూడా చింపివేసినట్టుగా చెప్పింది. చివరకు నిర్మానుష్య ప్రాంతంలో కారును ఆపాడు. అదేదో చెత్త డంపింగ్‌ యార్డుగా అనిపించిందని, ఆ తర్వాత వారిద్దరూ తన క్రెడిట్ కార్డు, డబ్బు తీసుకుని పారిపోయారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.

ఇవి కూడా చదవండి

తరువాత, ఆమె ఒక బాటసారి సహాయంతో ఫన్ రిపబ్లిక్ పోలీస్ అవుట్‌పోస్ట్‌కు చేరుకుంది. ఈ ఘటనపై తగు విచారణ జరిపించాలని బాలిక తల్లి డిమాండ్‌ చేశారు. దోపిడీ, లైంగిక వేధింపులు,కిడ్నాప్‌ తదితర అభియోగాల కింద కేసు నమోదు చేసినట్టుగా పోలీసులు తెలిపారు. యువతిని కిడ్నాప్‌ చేసిన కారు నంబర్‌ ప్లేట్‌ గుర్తించేందుకు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్