AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bharat Jodo Yatra: సావర్కర్ రాసిన ఆ లేఖ ఉంది.. చదవండి అంటూ బీజేపీ నేతలకు రాహుల్ గాంధీ సవాల్

సార్, నేను మీ సేవకునిగా ఉండాలనుకుంటున్నాను అని సావర్కర్‌ ఆ లేఖలో రాశారని.. కావాలంటే ఈ ఉత్తరం మీరు ఇది చదవండి.. అంతేకాదు ఫడ్నవీస్ దీనిని చూడగలరు. మోహన్ భగవత్ కి కూడా తన వద్ద ఉన్న ఉత్తరాన్ని చూపించండి..

Bharat Jodo Yatra:  సావర్కర్  రాసిన ఆ లేఖ ఉంది.. చదవండి అంటూ బీజేపీ నేతలకు రాహుల్ గాంధీ సవాల్
Bharat Jodo Yatra In Maharashtra
Follow us
Surya Kala

|

Updated on: Nov 17, 2022 | 5:16 PM

మహారాష్ట్రలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర 11వ రోజు కొనసాగింది. ఈ యాత్రలో భాగంగా మధ్యాహ్నం 1 గంటలకు రాహుల్ గాంధీ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన వినాయక్ దామోదర్ సావర్కర్‌పై చేసిన ప్రకటనను పునరుద్ఘాటించారు. సావర్కర్‌ బ్రిటీష్‌ అధికారికి రాసిన లేఖ తన వద్ద ఉందని, దానిని తాను చదివానని రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు.  సార్, నేను మీ సేవకునిగా ఉండాలనుకుంటున్నాను అని సావర్కర్‌ ఆ లేఖలో రాశారని.. కావాలంటే ఈ ఉత్తరం మీరు ఇది చదవండి.. అంతేకాదు ఫడ్నవీస్ దీనిని చూడగలరు. మోహన్ భగవత్ కి  కూడా తన వద్ద ఉన్న ఉత్తరాన్ని చూపించండి.. సావర్కర్ ..  బ్రిటీష్ వారికి సహాయం చేశాడని ఈ ఉత్తరం స్పష్టం చేస్తుందని రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

సావర్కర్ బ్రిటీష్ వారికి క్షమాపణలు చెప్పారని.. వారి నుంచి పింఛన్ తీసుకునేవారని నిరూపించేందుకు కావాల్సిన సాక్ష్యం ఇదిగో అంటూ కొన్ని పత్రాలను రాహుల్ గాంధీ చూపించారు. సావర్కర్‌ను అవమానించే ఆలోచనలను మానుకోవాలని నిన్న బీజేపీ నేత, ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ రాహుల్ కు సూచించారు. అంతేకాదు  సావర్కర్‌పై రాహుల్ గాంధీ చేసిన ప్రకటన కారణంగా మహారాష్ట్రలో ఆయన భారత్ జోడో యాత్రను నిలిపివేయాలని సీఎం ఏక్‌నాథ్ షిండే వర్గం నాయకుడు రాహుల్ షెవాలే డిమాండ్ చేశారు. దీనిపై రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఎవరైనా తన ప్రయాణాన్ని ఆపాలనుకుంటే ఆపేయాలని అన్నారు.

బ్రిటిష్ ప్రభుత్వ అధికారులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా  ‘గాంధీ, నెహ్రూ, పటేల్ తలవంచలేదు.. అయితే సావర్కర్ క్షమాపణలు చెప్పాడు.. బ్రిటిష్ పెన్షన్‌ను తీసుకున్నాడు అని పేర్కొన్నారు రాహుల్.

ఇవి కూడా చదవండి

రాహుల్ గాంధీ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘సావర్కర్ ఈ లేఖపై సంతకం చేశారు. గాంధీ, నెహ్రూ, పటేల్  కూడా జైలులో ఉన్నారు.. అయితే అలాంటి లేఖపై ఎవరూ సంతకం చేయలేదు. మహారాష్ట్రలో అధికారంలో ఉన్న నేతలు రాహుల్ యాత్రను నిలిపివేయాలని అంటున్నారు.. అసలు ఓ నాయకుడు ఇలా మాట్లాడనివ్వండి.. అలా మాట్లాడాలి  ఇలా అనేది ప్రభుత్వమే నిర్ణయిస్తుందా అని ప్రశ్నించారు.

‘భారత్ జోడో యాత్రను ఆపమని సవాల్: తన యాత్ర వల్ల దేశానికి నష్టం వాటిల్లుతుందని భావిస్తే యాత్రను ఆపండి అని రాహుల్ గాంధీ అన్నారు. మాతో లక్షలాది మంది కార్మికులు ఉన్నారు. మీకు ధైర్యం ఉంటే ఆపండి. ఇదే మన రాజకీయాలకు, బీజేపీ రాజకీయాలకు తేడా. మీకు భిన్నమైన అభిప్రాయాలు ఉండవచ్చు, మాకు భిన్నంగా ఉండవచ్చు. మేము అటువంటి విభిన్న అభిప్రాయాలను అంగీకరిస్తూ జీవించగలము.

‘బీజేపీ పని తీరు నియంతృత్వం, మా పని తీరు ప్రజాస్వామ్యం’ తాను స్వార్థంతోనూ భారత్ జోడో యాత్ర చేయడం లేదని రాహుల్ గాంధీ అన్నారు. మేము ఈ ప్రయాణాన్ని సెప్టెంబర్‌లో ప్రారంభించాము. ఈ ప్రయాణంలో మేము కన్యాకుమారి నుండి శ్రీనగర్‌కు వెళ్తాము. ఈ యాత్ర వెనుక ఎన్నికల్లో  గెలవాలన్నా మరేదైనా కోరిక తమకు ఎలాంటి ఉద్దేశ్యం లేదు. తాను ప్రయాణించే మార్గంలో.. బీజేపీ విధానమైన ద్వేషం, భయాందోళనలు, హింస నుంచి భారతదేశానికి విముక్తి కలిగించాలని తన కోరికని చెప్పారు. తన అభిప్రాయాన్ని తెలియజేయడానికి బీజేపీ విధానం సరైన మార్గం కాదని దేశానికి చెప్పడమే యాత్ర ప్రయత్నం మాత్రమే అని చెప్పారు.

కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు మాట్లాడుతూ, ‘ప్రతిపక్షాల ప్రక్షాళన కూడా బీజేపీ చేస్తోందని పేర్కొన్నారు. కాంగ్రెస్ తో పాటు శివసేన నాయకుడు (ఠాక్రే వర్గం) కలిసి నడుస్తున్నాడు. అయితే ఠాక్రే కి  కూడా బీజేపీ 50 కోట్ల ఆఫర్ ఇచ్చిందని సంచలన ఆరోపణలు చేశారు. అయితే ఠాక్రే గ్రూపు తమను వీడలేదని పేర్కొన్నారు. అయితే భారతదేశంలో స్వచ్ఛమైన వ్యక్తులకు కొదవలేదు. వీరందరితోనూ.. కలిసి తాను రాజకీయాలను శుభ్రం చేయాలనీ భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

భారతదేశం విచ్ఛిన్నం కాకపోతే భారతదేశాన్ని ఏకం చేయాల్సిన అవసరం ఏమిటని ఒక విలేకరి అడిగాడు. దీనిపై రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ‘బీజేపీ నేతలు రైతులు, యువతతో విషయాలపై మాట్లాడటం లేదు. నిరుద్యోగం పెరుగుతోంది. రైతులకు సరైన ధర లభించడం లేదు. అందుకే భారత్ జోడో యాత్ర ప్రారంభించాం. ఈ ప్రయాణం కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు సాగనుంది. ఈ యాత్ర అవసరమని ప్రజలు భావించకపోతే.. ఈ యాత్రలో చేరడానికి లక్షల మంది ఇంటి నుండి బయటకు ఎందుకు వస్తున్నారని ప్రశ్నించారు.

‘దేశంలో రెండు సమస్యలు చాలా ఉన్నాయి.  నేటి  యువత, రైతులకు ఉపశమనం లేదు’ యువతకు ఉపాధి లభిస్తుందనే నమ్మకం లేదు. ఏ ఇనిస్టిట్యూట్‌కి వెళ్లినా.. ఇంజినీరింగ్ చదివితే అదే ఉద్యోగం వస్తుందో, లేక కూలి పని చేయాల్సి వస్తుందో అని అనుమానం.. అతని తల్లిదండ్రులు కష్టపడి సంపాదించిన డబ్బును అతని ఖరీదైన చదువు కోసం ఖర్చు పెడుతున్నారు. చదువుకుని వచ్చాక ఉద్యోగం దొరకదు. రెండో సమస్య రైతులది. అన్నదాత ఇన్సూరెన్స్ కట్టాడు కానీ తుపాను వచ్చినా డబ్బులు రావడం లేదు. ప్రభుత్వ ఆసుపత్రులను వదిలిపెట్టలేదు, పాఠశాలలను వదలలేదు. మనం పన్నుగా చెల్లిస్తున్న డబ్బులు ఎక్కడికి పోతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలను అడగండి.. దీనికి సమాధానం కూడా అందరికి తెలుసన్నారు రాహుల్ గాంధీ.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..