Traffic Rules: డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఈ తప్పులు చేసి దొరికితే.. రూ. 40 వేల వరకు జరిమానా కట్టాల్సిందే!
Traffic Rules India: జాగ్రత్తగా వాహనాన్ని నడిపితేనే ఈరోజుల్లో మనం ఇంటికి సురక్షితంగా చేరుకోగలం. చాలామంది వ్యక్తులు రాంగ్ సైడ్ డ్రైవింగ్, సిగ్నల్స్ బ్రేక్ చేయడం
రోడ్డుపైకి బండి తీసుకొచ్చామంటే.. దాన్ని బాధ్యతగా నడపడం మన వంతు. ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ.. జాగ్రత్తగా వాహనాన్ని నడిపితేనే ఈరోజుల్లో మనం ఇంటికి సురక్షితంగా చేరుకోగలం. చాలామంది వ్యక్తులు రాంగ్ సైడ్ డ్రైవింగ్, సిగ్నల్స్ బ్రేక్ చేయడం, స్పీడ్‌గా వెళ్లడం లాంటివి చేస్తున్నారు. ఇలా ట్రాఫిక్ రూల్స్‌ను బ్రేక్ చేయడం వల్ల రోడ్డు ప్రమాదాలు సంభవించడమే కాదు.. ఇతరులకు కూడా ఇబ్బంది కలుగుతుంది. అలాంటివారికి చెక్ పెట్టేందుకు ట్రాఫిక్ పోలీసులు ఎన్ని చర్యలు చేపడుతున్నప్పటికీ.. పలువురి జనాల్లో మాత్రం ఎలాంటి మార్పు రావట్లేదు. ఇదిలా ఉంటే.. మోటర్ వెహికిల్ యాక్ట్ ప్రకారం.. కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘనకు పలు రకాల భారీ జరిమానాలను అమలు చేస్తోన్న విషయం తెలిసిందే.
భారీ ఫైన్స్ అమలు చేస్తున్నా కూడా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. అలాంటివారి కోసం ఓ బిగ్ అలెర్ట్. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే.. మీకు జరిమానా ఒకటే కాదు.. జైలు శిక్ష కూడా పడే ఛాన్స్ ఉంది. అంతేకాదు మీరు ఒకే సమయంలో అనేక ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే.. అనేక ట్రాఫిక్ నిబంధనలను ఏకకాలంలో ఉల్లంఘించినందుకు భారీగా జరిమానా విధించవచ్చు.(Source)
ఉదాహరణకు, మీరు కారును అనర్హత డ్రైవింగ్ లైసెన్స్, డ్రంక్ చేసి ఉంటే, అలాగే ఇన్సూరెన్స్ కూడా లేకుండా ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ.. పోలీసులకు దొరికితే.. ఒక్క ఉల్లంఘనకు కాదు.. మొత్తం అతిక్రమించిన రూల్స్‌కు జరిమానా విధిస్తారు. మద్యం తాగి వాహనాన్ని నడిపితే.. మొదటిసారి రూ. 10 వేలు, రెండోసారి రూ.15 వేలు జరిమానా, అనర్హత డ్రైవింగ్ లైసెన్స్‌తో నడిపితే రూ.10 వేలు, ఇన్సూరెన్స్ లేకుండా వాహనాలు నడిపితే రూ2 వేల నుంచి .రూ. 4 వేల వరకు. అలాగే ర్యాష్ డ్రైవింగ్‌కు మొదటిసారి రూ. 5000, రెండోసారి రూ. 10 వేలు.. ఒక్కోసారి జరిమానాతో కూడా జైలుకు వెళ్లే ఛాన్స్ ఉండొచ్చు. ఇవన్నీ కలుపుకుంటే.. మీకు పడే ఫైన్ తడిసిమోపెడవుతుంది. మరి భారీ జరిమానాలు పడకుండా ఉండాలంటే.. ఎల్లప్పుడూ ట్రాఫిక్ నియమాలను పాటించాలి. ఆపై సురక్షితంగా ఇంటికి చేరుకోండి.(Traffic Fines)