AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రియురాలిని 35 ముక్కలు చేసిన ఘటన.. క్రైమ్ వెబ్ సిరీస్, గూగుల్ చూసి హత్య.. పోలీసుల దర్యాప్తులో మరెన్నో షాకింగ్ నిజాలు

అమెరికన్ క్రైమ్ సిరీస్ ఒక సీరియల్ కిల్లర్ కథ. అందులో ఒక వ్యక్తి.. తన ఖాళీ సమయంలో నేరస్థులను చంపేవాడు.ఇక తాను శరీరాన్ని ముక్కలుగా చేయడం కోసం మానవ శరీర నిర్మాణ శాస్త్రం గురించి చదివానని.. దీని సహాయంతో తాను శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసినట్లు నిందితుడు పోలీసులకు చెప్పాడు.

ప్రియురాలిని 35 ముక్కలు చేసిన ఘటన.. క్రైమ్ వెబ్ సిరీస్, గూగుల్ చూసి హత్య.. పోలీసుల దర్యాప్తులో మరెన్నో షాకింగ్ నిజాలు
Aaftab Love To Several Women
Surya Kala
|

Updated on: Nov 15, 2022 | 11:10 AM

Share

ఢిల్లీలోని మెహ్రౌలీ హత్య కేసులో మరో భయంకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడు అఫ్తాబ్ అమీన్ పూనావాలా తాను సహజీవం చేస్తోన్న శ్రద్ధా వాకర్‌ను దారుణంగా హత్య చేయడానికి అమెరికన్ క్రైమ్ షో ‘డెక్స్టర్’ నుండి ప్రేరణ పొందాడని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. నిందితుడు గూగుల్  సెర్చ్ హిస్టరీ పరిశీలిస్తే.. హత్య చేసిన తర్వాత రక్తాన్ని శుభ్రపరిచే పద్ధతిని వెతికి, హ్యూమన్ అనాటమీ గురించి పూర్తి సేకరించినట్లు తెలిసిందని పోలీసులు చెప్పారు.

అఫ్తాబ్ అమీన్ తన భాగస్వామి శ్రద్ధ ను హత్య చేసి, ఆమె శరీరాన్ని 35 భాగాలుగా నరికాడు. అయితే ఇలా చేయడానికి ముందు ‘డెక్స్టర్’ క్రైమ్ షో తో పాటు అనేక ఇతర క్రైమ్ సిరీస్‌లను కూడా పరిశీలించాడని ANI  ఓ నీవేదికలో ప్రకటించింది. అమెరికన్ క్రైమ్ సిరీస్ ఒక సీరియల్ కిల్లర్ కథ. అందులో ఒక వ్యక్తి.. తన ఖాళీ సమయంలో నేరస్థులను చంపేవాడు.ఇక తాను శరీరాన్ని ముక్కలుగా చేయడం కోసం మానవ శరీర నిర్మాణ శాస్త్రం గురించి చదివానని.. దీని సహాయంతో తాను శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసినట్లు నిందితుడు పోలీసులకు చెప్పాడు. అఫ్తాబ్ ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లను స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.

28 ఏళ్ల శ్రద్ధ ఆరు నెలల క్రితం హత్య చేయబడింది. ఆమె మృతదేహం ముక్కలు దేశ రాజధానిలోని కొన్ని ప్రాంతాలలో నిందితుడు 18 రోజుల పాటు విసిరివేశాడు. శ్రద్ధ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఢిల్లీ పోలీసులు ఈ దారుణ హత్య కేసును ఛేదించారు. అఫ్తాబ్ కు 5 రోజుల పోలీసు రిమాండ్‌కు పంపారు.

ఇవి కూడా చదవండి

ఐదు నెలల క్రితం మే 18న పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టడంతో గొడవపడి శ్రద్ధను గొంతు కోసి హత్య చేశాడని తమ విచారణలో తెలిసిందని ఢిల్లీ పోలీసులు చెప్పారు. మృతదేహాన్ని ముక్కలుగా కట్ చేసి నిల్వ చేయడానికి కొత్త ఫ్రిజ్‌ని కొనుగోలు చేశాడు. దుర్వాసన రాకుండా ‘అగర్బత్తి’ని ఉపయోగించినట్లు నిందుతుడు అంగీకరించాడని పోలీసులు చెప్పారు. ఢిల్లీకి వెళ్లేముందు, డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన ఈ జంట ముంబైలో మూడేళ్ల పాటు లైవ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్నారు. “ఇద్దరు ఢిల్లీకి మారిన వెంటనే, శ్రద్ధా తనను వివాహం చేసుకోవాలని  అఫ్తాబ్ ని ఒత్తిడి తేవడంతో ప్రాణాలు కోల్పోయిందని పోలీసులు చెప్పారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చా? నిజం ఏంటి తెలుసుకోండి!
గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చా? నిజం ఏంటి తెలుసుకోండి!
రూ.10 లక్షల లోపు బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే!
రూ.10 లక్షల లోపు బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే!
నాగబాబు చేతుల మీదుగా 'సిరివెన్నెల స్మృతివనం'కు శంకుస్థాపన
నాగబాబు చేతుల మీదుగా 'సిరివెన్నెల స్మృతివనం'కు శంకుస్థాపన
ఐపీఎల్ మ్యాచ్ టికెట్ల పేరుతో భారీ స్కామ్..సైబర్ పోలీసుల వార్నింగ్
ఐపీఎల్ మ్యాచ్ టికెట్ల పేరుతో భారీ స్కామ్..సైబర్ పోలీసుల వార్నింగ్
రైళ్లలో ఆదమరిచినిద్రపోతున్నారా?ఇలాంటి రైల్వే దొంగలుంటారు జాగ్రత్త
రైళ్లలో ఆదమరిచినిద్రపోతున్నారా?ఇలాంటి రైల్వే దొంగలుంటారు జాగ్రత్త
ఇల్లు కొనడం తెలివితక్కువ పని.. అద్దెకు ఉండటమే తెలివైన పనా?
ఇల్లు కొనడం తెలివితక్కువ పని.. అద్దెకు ఉండటమే తెలివైన పనా?
మహానటి సావిత్రికి మద్యం అలవాటు చేసింది ఆ నటుడేనని తెలుసా?
మహానటి సావిత్రికి మద్యం అలవాటు చేసింది ఆ నటుడేనని తెలుసా?
మీ గోళ్లు ఇలా ఉన్నాయా? అయితే మీ భవిష్యత్ గురించి ఈ నిజం..
మీ గోళ్లు ఇలా ఉన్నాయా? అయితే మీ భవిష్యత్ గురించి ఈ నిజం..