AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రేమికుడి రూపంలో రాక్షసుడు.. పెళ్లి కోసం గొడవ.. ప్రియురాలిని అత్యంత దారుణంగా చంపి 35 ముక్కలు చేసి..

ఫ్రిజ్‌లో శ్రద్ధ మృతదేహం ముక్కలను ఉంచాడు. 18 రోజుల పాటు మెహ్రౌలీ అడవుల్లో శ్రద్ధా మృతదేహం ముక్కలను ఒక్కొక్కటిగా విసిరాడు. అఫ్తాబ్ ప్రతిరోజూ రాత్రి ఒక బ్యాగ్‌లో శ్రద్ధా మృతదేహ ముక్కలను ఉంచేవాడు.

ప్రేమికుడి రూపంలో రాక్షసుడు.. పెళ్లి కోసం గొడవ.. ప్రియురాలిని అత్యంత దారుణంగా చంపి 35 ముక్కలు చేసి..
Delhi Mehrauli Case
Surya Kala
| Edited By: Janardhan Veluru|

Updated on: Nov 14, 2022 | 1:36 PM

Share

యువతి యువకుడికి ముంబయిలోని కాల్ సెంటర్‌లో ఏర్పడిన స్నేహం ఆ తర్వాత ప్రేమగా మారింది. ప్రేమ ఎంత గాఢంగా ఏర్పడిందంటే..  కుటుంబసభ్యులు వీరి ప్రేమకు అడ్డు చెప్పడంతో ఢిల్లీకి పారిపోయారు. ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు.. ఇంట్లోంచి పారిపోయి మరీ సహజీవనం చేస్తున్నారు. అయితే ఒకరోజు పెళ్లి విషయంలో గొడవ జరిగింది. దీంతో ఆ యువకుడికి పట్టరాని కోపం వచ్చింది. వెంటనే ఆ యువతిని చంపి.. శవాన్ని 35 ముక్కలుగా నరికేశాడు. ఇది సినిమా స్టోరీ కాదు నిజ జీవితంలోనే చోటు చేసుకుంది. ఢిల్లీలోని మెహ్రౌలీ ప్రాంతంలో ఈ సంచలన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. ఈ హత్య  6 నెలల క్రితం జరిగింది. ఈ కేసులో నిందితుడైన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ యువకుడి పేరు అఫ్తాబ్. ముంబయిలోని మాయా నగరంలో ప్రేమ కథ మొదలైంది..  అక్కడ కాల్ సెంటర్‌లో పనిచేస్తున్నప్పుడు అఫ్తాబ్,  శ్రద్ధ అనే అమ్మాయి తో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ స్నేహితులయ్యారు.. క్రమంగా వీరిద్దరి స్నేహం ప్రేమగా మారింది. అయితే మతాలు వేరుకావడంతో  కుటుంబ సభ్యులు వీరి ప్రేమని వ్యతిరేకించారు. దీంతో ఇద్దరూ ఢిల్లీకి పారిపోయారు.

పోలీసుల కథనం ప్రకారం.. నవంబర్ నెలలో శ్రద్ధ తండ్రి ఢిల్లీలోని మెహ్రౌలీ పోలీస్ స్టేషన్‌లో తన కుమార్తె కిడ్నాప్‌ అయిందని ఫిర్యాదు చేశారు. ఎఫ్‌ఐఆర్ లో తన కుమార్తె ముంబైలోని కాల్ సెంటర్‌లో పనిచేసేదని, అక్కడ అఫ్తాబ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడిందని.. ప్రేమ పేరుతో తన కూతుర్ని ఢిల్లీ తీసుకుని వచ్చాడంటూ శ్రద్ధ తండ్రి పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

కుటుంబ సభ్యుల వ్యతిరేకత: శ్రద్ధ , అఫ్తాబ్ లు ముంబై వదిలి ఢిల్లీకి వచ్చి ఇక్కడ ఛతర్‌పూర్ ప్రాంతంలో నివసించడం ప్రారంభించారు. కూతురి ఫోటో లను తండ్రి సోషల్ మీడియా ద్వారా చూస్తూ ఉండేవాడు. అయితే చాలా రోజులుగా సోషల్ మీడియాలో ఎలాంటి అప్ డేట్ రాకపోవడంతో కూతురు గురించి ఆందోళన చెందిన తండ్రి..  సంప్రదించేందుకు ప్రయత్నించాడు. అయినా శ్రద్ధ ఫోన్ కాంటాక్ట్ కాలేదు.దీంతో కూతురు గురించి ఆందోళన తో తన కుమార్తె నివసించే ఛతర్‌పూర్ ప్రాంతంలోని ఫ్లాట్‌కు చేరుకొని శ్రద్ధ కోసం తండ్రి ఎంక్వైరీ చేశాడు. అయితే అక్కడ కూతురు గురించి ఏ విధమైన సమాచారం తెలియలేదు ఆ తండ్రికి.  అంతేకాదు ఇంటి గేటుకు తాళం వేసి ఉండడంతో పోలీసులకు సమాచారం అందించాడు.

మే నెలలో హత్య శ్రద్ధ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇన్‌ఫార్మర్, సాంకేతిక నిఘా సహాయంతో పోలీసులు అఫ్తాబ్ కోసం వెతకడం ప్రారంభించారు. ఆ తర్వాత రహస్య సమాచారం ఆధారంగా అఫ్తాబ్‌ను పట్టుకున్నారు. పోలీసుల విచారణలో, తమ మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవని.. పెళ్లి కోసం శ్రద్ధ తనపై ఒత్తిడి తెస్తోందని నిందితుడు చెప్పాడు. దీంతో విసిగి వేసారిన తాను శ్రద్ధను మే నెలలో దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి అడవిలో వివిధ ప్రాంతాల్లో పడేసినట్లు పేర్కొన్నాడు. నిందితుడు అఫ్తాబ్‌ను పోలీసులు అదుపులోకి  తీసుకున్నారు.

పోలీసు వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. మే 18న నిందితుడు అఫ్తాబ్, శ్రద్ధ మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో శ్రద్ధా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు ఆమె గొంతు వినకుండా..  నిందితుడు అఫ్తాబ్ శ్రద్ధా నోరు నొక్కాడు. అప్పుడు ఊపిరి ఆడక శ్రద్ధ చనిపోయింది. దీంతో షాక్ తిన్న అఫ్తాబ్  మృతదేహాన్ని ఎలా వదిలించుకోవాలని ఆలోచించాడు. దీంతో శ్రద్ధ మృతదేహాన్ని రంపంతో 35 ముక్కలుగా నరికాడు.

18 రోజుల పాటు శరీర భాగాలను అడవిలో విసిరేస్తూనే ఉన్న ప్రేమికుడు:

అఫ్తాబ్ మార్కెట్ నుండి పెద్ద ఫ్రిజ్‌ను కొనుగోలు చేశాడు. ఆ ఫ్రిజ్‌లో శ్రద్ధ మృతదేహం ముక్కలను ఉంచాడు. 18 రోజుల పాటు మెహ్రౌలీ అడవుల్లో శ్రద్ధా మృతదేహం ముక్కలను ఒక్కొక్కటిగా విసిరాడు. అఫ్తాబ్ ప్రతిరోజూ రాత్రి ఒక బ్యాగ్‌లో శ్రద్ధా మృతదేహ ముక్కలను ఉంచేవాడు. అడవులకు వెళ్లి అక్కడ  బ్యాగ్ నుండి ముక్కలను విసిరేవాడు. తద్వారా జంతువులు ఆమె మృతదేహం ముక్కలను తింటాయి.. తాను పట్టుబడను అని భావించినట్లు పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలను చెప్పాడు అఫ్తాబ్.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..