AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరో దారుణం.. ట్యూషన్‌ నుంచి ఇంటికి వస్తున్న బాలికపై లైంగిక దాడి.. వేగంగా వెళ్తున్న ఆటోలోంచి దూకిన బాలిక

దీంతో భయాందోళనకు గురైన సదరు బాలిక కదులుతున్న ఆటోలో నుంచి ఒక్కసారిగా రోడ్డుపైకి దూకేసింది. ఆ సమయంలో వెనుక వైపు నుంచి వచ్చిన కారు..

మరో దారుణం.. ట్యూషన్‌ నుంచి ఇంటికి వస్తున్న బాలికపై లైంగిక దాడి.. వేగంగా వెళ్తున్న ఆటోలోంచి దూకిన బాలిక
Girl Jumps Out
Jyothi Gadda
|

Updated on: Nov 17, 2022 | 3:35 PM

Share

అమ్మాయిలు, మైనర్‌ బాలికలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. స్కూల్‌ పిల్లలు, ట్యూషన్‌కి వెళ్తున్న చిన్నారులపై జరుగుతున్న దారుణాలు ఎక్కడో ఓ చోట వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా, డ్రైవర్‌ లైంగిక వేధింపులు తట్టుకోలేక ఓ మైనర్‌ బాలిక ఆటోలోంచి బయటకు దూకేసింది. ఈ ప్రమాదంలో బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. షాకింగ్‌ ఘటన మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ జిల్లాలో చోటు చేసుకుంది. ఆ ప్రాంతంలో అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో ఘటనా దృశ్యాలు రికార్డయ్యాయి. బాలిక ఆటో దిగిన వెంటనే ఆమెకు సహాయం చేసేందుకు పలువురు పరిగెత్తుకుంటూ రావటం ఫుటేజీలో రికార్డైంది. రోడ్డుపై పడి ఉన్న బాలికకు సహాయం చేసేందుకు ఇతర వాహనాలు కూడా నిలిచిపోయాయి. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌ అవుతోంది. ఘటనకు సంబంధించి స్థానిక పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

17 ఏళ్ల బాలిక ట్యూషన్‌ ముగించుకుని ఆటోలో ఇంటికి బయలు దేరింది. కొంత దూరం వెళ్లాకా ఆటో డ్రైవర్ సయ్యద్‌ అక్బర్‌ హమీద్‌ బాలికకు పలు ప్రశ్నలు వేయడం మొదలు పెట్టాడు. ఇదే సమయంలో అసభ్యంగా మాట్లాడి బాలికను వేధించసాగాడు. దీంతో భయాందోళనకు గురైన సదరు బాలిక కదులుతున్న ఆటోలో నుంచి ఒక్కసారిగా రోడ్డుపైకి దూకేసింది. ఆ సమయంలో వెనుక వైపు నుంచి వచ్చిన కారు సెడెన్‌ బ్రేక్‌ వేయడంతో బాలిక ప్రాణాపాయస్థితి నుంచి తప్పించుకుంది.

ఇవి కూడా చదవండి

అంతలోనే బైక్‌పై అక్కడికి వచ్చిన ఓ వ్యక్తి స్థానికుల సాయంతో బాలికను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. నిందితుడు డ్రైవర్ సయ్యద్ అక్బర్ హమీద్‌ను అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. కాగా, తలకు గాయమైన బాధిత బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనలో బాలిక తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టరారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి