Minister Nitin Gadkari: బెంగాల్ పర్యటనలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి అస్వస్థత.. చికిత్స అందిస్తున్న వైద్యులు

Sanjay Kasula

Sanjay Kasula |

Updated on: Nov 17, 2022 | 3:23 PM

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి అస్వస్థత.. బెంగాల్ పర్యటనలో ఉన్న సమంయలో ఒక్కసారిగా అనారోగ్యానికి గురయ్యారు. సిలిగురిలో స్టేజ్‌పై ఉండగానే షుగర్ లెవల్ తగ్గినట్లుగా గుర్తించిన డాక్టర్లు. గడ్కరీకి వైద్యం అందిస్తున్నారు డాక్టర్లు.

Minister Nitin Gadkari: బెంగాల్ పర్యటనలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి అస్వస్థత.. చికిత్స అందిస్తున్న వైద్యులు
Union Minister Nitin Gadkari

కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గురువారం (నవంబర్ 17) అస్వస్థతకు గురయ్యారు. ఒక కార్యక్రమంలో వేదికపై అకస్మాత్తుగా ఆయన ఆరోగ్యం క్షీణించింది. పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రసంగించారు. స్టేజ్‌పై ఉండగానే షుగర్ లెవెల్ పడిపోవడంతో అకస్మాత్తుగా ఆయన ఆరోగ్యం క్షీణించింది. అనంతరం ఆసుపత్రి నుంచి వైద్యుల బృందం ఘటనాస్థలికి చేరుకుని కేంద్ర మంత్రికి ప్రథమ చికిత్స అందించారు.  గడ్కరీ ఆరోగ్య పరిస్థితిపై ప్రధాని మోదీ, బెంగల్ సీఎం మమత ఆరా తీశారు. వైద్యులకు ఫోన్‌ చేశారు. వైద్యం అదిస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు.

పరిస్థితిని చక్కదిద్దాలని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అధికారులను ఆదేశించారు. అనంతరం నితిన్ గడ్కరీని వేదిక నుంచి బయటకు తీసుకెళ్లారు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం.. బర్సానాలోని రాజు బిష్త్ నివాసానికి వెళ్లి విశ్రాంతి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. కేంద్రమంత్రికి మతిగర నివాసంలో చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అతనితో పాటు ఒక వైద్యుడు కూడా ఉన్నారు.

వేదికపైనే అకస్మాత్తుగా..

నితిన్ గడ్కరీ సిలిగురిలోని శివ మందిర్ నుంచి సేవక్ కంటోన్మెంట్ వరకు రహదారికి శంకుస్థాపన చేయడానికి వెళ్లారు నితిన్ గడ్కారీ. డార్జిలింగ్ జంక్షన్ సమీపంలోని దగాపూర్ మైదానంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వేదికపైనే కేంద్ర మంత్రి అస్వస్థతకు గురికావడంతో వెంటనే కార్యక్రమాన్ని నిలిపివేశారు. సిలిగురిలో వేడుక ముగిసిన తర్వాత నితిన్ గడ్కరీని దల్ఖోలాకు తీసుకెళ్లాల్సి ఉంది.

అంతకు ముందు..

అంతకుముందు రోజు, నితిన్ గడ్కరీ ఒక హైవేని ప్రారంభించారు. ఇది ఢిల్లీ నుండి బీహార్ మధ్య ప్రయాణ సమయాన్ని కనీసం 10-15 గంటలు తగ్గిస్తుంది. 92 కిలోమీటర్ల పొడవైన 4-లేన్ హైవే ఉత్తరప్రదేశ్‌లోని పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వే ద్వారా దక్షిణ బీహార్‌ను దేశ రాజధాని ఢిల్లీకి కలుపుతుంది.

ఈ సందర్భంగా నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. ఢిల్లీ చేరుకోవడానికి పట్టే సమయాన్ని 15 గంటల నుంచి 10 గంటలకు తగ్గిస్తున్నట్లు తెలిపారు. దీంతో బీహార్ నుంచి లక్నో మీదుగా ఢిల్లీకి చేరుకోవడం సులువవుతుంది. ఈమేరకు సోమవారం బక్సర్‌లో రూ.3,390 కోట్ల విలువైన రెండు జాతీయ రహదారుల ప్రాజెక్టులను గడ్కరీ ప్రారంభించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu