Vastu plant : ఈ చిన్న మొక్కను మీ ఇంటికి సరైన దిశలో పెంచుకోండి.. ధన వర్షం కురుస్తుంది..! ఆర్థిక కష్టాలు తొలగిపోతాయ్..

వాస్తు శాస్త్రం ప్రకారం తులసి మొక్క కాకుండా ఇంటి వాస్తును నయం చేసి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందేలా చేసే మొక్కలు కూడా కొన్ని ఉన్నాయి. అలాంటి వాటిని మీ ఇంట్లో సరైన దిశలో నాటితే మీ ఆర్థిక కష్టాలు తొలగిపోయి, డబ్బు ఎప్పుడు మీ చేతిలో ఉంటుంది.

Vastu plant : ఈ చిన్న మొక్కను మీ ఇంటికి సరైన దిశలో పెంచుకోండి.. ధన వర్షం కురుస్తుంది..! ఆర్థిక కష్టాలు తొలగిపోతాయ్..
Vastu Plant
Follow us

|

Updated on: Dec 07, 2022 | 8:30 AM

వాస్తు శాస్త్రంలో చెట్లు, మొక్కల ప్రాముఖ్యత గురించి ప్రస్తావించారు. ఇంట్లో నాటిన చెట్లు, మొక్కలు ఆనందం, శ్రేయస్సు, పురోగతిని కలిగిస్తాయని నమ్ముతారు. ఇంట్లో ప్రతికూల శక్తిని నాశనం చేయడానికి, సరైన దిశలో, సరైన స్థలంలో మొక్కలను నాటడం అవసరం. వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇంటి లోపల కొన్ని మొక్కలు, ఇంటి బయట కొన్ని మొక్కలు నాటాలి. అలాగే వాస్తు శాస్త్రంలో తులసి మొక్క ప్రత్యేక ప్రాముఖ్యత గురించి ప్రస్తావించబడింది. తులసి మొక్క కాకుండా ఇంటి వాస్తును నయం చేసి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందేలా చేసే మొక్కలు కూడా కొన్ని ఉన్నాయి.. అలాంటిదే వెదురు మొక్క. దీన్ని ఇంట్లో పెడితే నెగటివ్ ఎనర్జీ నశించిపోతుందని వాస్తు నిపుణులు అంటున్నారు. ఇంట్లో వెదురు మొక్కను నాటడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకోండి.

ఇంటికి ఈ దిశలో వెదురు మొక్కను నాటండి.. వాస్తు శాస్త్రం ప్రకారం.. ఏదైనా సరైన దిశలో ఉంచినప్పుడే ప్రయోజనకరంగా ఉంటుంది. ఇంట్లో కుటుంబ సభ్యులంతా కలిసి కూర్చునే చోట వెదురు మొక్కను నాటాలి. ఇంట్లోని డ్రాయింగ్ రూం, హాలు తదితర ప్రాంతాల్లో వెదురు మొక్కను ఉంచడం మంచిదంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. దీనిని ఉంచడానికి ఉత్తమ దిశ ఉత్తరం అని చెబుతున్నారు.

వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంట్లో వెదురు మొక్కను నాటడం వల్ల ఆనందం, శ్రేయస్సు లభిస్తుంది. ఇది ఇంటి సభ్యుల ఆరోగ్యంపై మంచి ప్రభావం చూపుతుందని నమ్ముతారు. మనిషి జీవితంలో ఏవైనా అడ్డంకులు ఎదురైతే, వెదురు కాడను ఎరుపు రంగు గుడ్డలో చుట్టి గాజు పాత్రలో ఉంచడం వల్ల ప్రయోజనం ఉంటుంది. కానీ ఈ వెదురు కొమ్మ పొడిగా ఉండకూడదు.

ఇవి కూడా చదవండి

ఎవరికైనా ఆర్థిక పరిస్థితి మెరుగుపడకపోతే ఇంట్లో వెదురు మొక్కను నాటాలి. ఇంట్లో వెదురు మొక్కను నాటితే ధనలాభం కలుగుతుంది. విద్యార్థులు చదువుపై దృష్టి సారించేందుకు ఇంట్లో వెదురు మొక్కను పెంచుకోవాలని సూచిస్తున్నారు. చదువుకునే పిల్లల గదిలో 4 చిన్న మొక్కలు నాటితే పిల్లల మనసు చదువుపై మల్లుతుంది.

ఇంటికి సరైన దిశలో వెదురు మొక్కను నాటడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. సానుకూల శక్తిని వదిలించుకోవడంతో పాటు మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

మరిన్ని వాస్తు సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)