Health Benefits: వీటితో చేసిన బ్రేక్‌ఫాస్ట్ తింటే మహదానందం.. ఆరోగ్యానికి, పర్యావరణానికి..
ఈ పిండిలో ఐరన్, ప్రొటీన్, ఫైబర్ వంటి అనేక ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇందులో గ్లూటెన్ ఫ్రీ మూలకాలుంటాయి కాబట్టి ఒకసారి మిల్లెట్ రోటీని తింటే.. ఎక్కువసేపు ఆకలి అనుభూతి ఉండదు. తక్కువ ఆహారం తీసుకోవడం వల్ల కొన్ని రోజుల్లోనే బరువు తగ్గుతారని నిపుణులు అంటున్నారు.
జొన్న రొట్టెలు, గోధుమ రొట్టెలు, బియ్యం పిండితో కూడా రొట్టెలు తయారు చేస్తారు. మన దేశంలో చాలా ప్రాంతాల్లో ప్రజలు ఈ రొట్టెలను ప్రధాన ఆహారంగా తీసుకుంటారు. ఒక్కొ రాష్ట్రం వారు ఒక్కొ ధాన్యంతో రొట్టేలను చేస్తారు. వీటిలో ఉండే గుణాలు శరీర బరువును నియంత్రించేందుకు దోహదపడతాయి. ప్రస్తుతం చాలా మంది గోధుమలు, జొన్నలతో చేసిన రొట్టెలను ఎక్కువగా తింటున్నారు. అయితే ఇతర తృణధాన్యాల పిండితో కూడా రోటీలు తయారు చేస్తే ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇవి మంచి రుచితో పాటు మంచి పోషక విలువలను అందిస్తుంది. మిల్లెట్ పిండిలో ఐరన్, ప్రొటీన్, ఫైబర్ వంటి అనేక ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇందులో గ్లూటెన్ ఫ్రీ మూలకాలుంటాయి కాబట్టి ఒకసారి మిల్లెట్ రోటీని తింటే.. ఎక్కువసేపు ఆకలి అనుభూతి ఉండదు. తక్కువ ఆహారం తీసుకోవడం వల్ల కొన్ని రోజుల్లోనే బరువు తగ్గుతారని నిపుణులు అంటున్నారు.
ముఖ్యంగా ఈ శీతాకాలంలో ప్రజలు ఎక్కువగా వేడి వేడి ఘన పదార్థాలను తినేందుకు ఇష్టపడుతుంటారు. అదే సమయంలో అనేక రకాల వ్యాధులు కూడా చుట్టుముడుతుంటాయి. శీతాకాలంలో ఫంగస్, బ్యాక్టీరియా కారణంగా ప్రజలు అనేక సమస్యలను ఎదుర్కొంటారు. అటువంటి పరిస్థితిలో మిల్లెట్స్‌తో తయారు చేసిన రోటీలు తినడం చాలా ప్రయోజనాలను ఇస్తుంది. మిల్లెట్‌లో ఉండే పోషకాల వల్ల అనేక వ్యాధులను దూరం చేసుకోవచ్చు. మిల్లెట్ రోటీలు తినటం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసా?
మిల్లెట్ రోటీలతో ప్రయోజనాలు 1. మిల్లెట్ లో సోడియం, ప్రొటీన్, ఫైబర్, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా లభిస్తాయి.
2. జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది. మిల్లెట్స్ రోటీ కడుపులో సులభంగా జీర్ణమవుతుంది. అలాగే, దీని వల్ల ఇతర పదార్థాలు కూడా సులభంగా జీర్ణమవుతాయి.
3. కడుపు నొప్పి, గ్యాస్ వంటి సమస్యలను దూరం చేస్తుంది.
4. మిల్లెట్‌లో ఉండే ఐరన్ రక్తహీనతను కూడా నయం చేస్తుంది. రక్తం తక్కువగా ఉందే కంప్లైట్ ఉన్నవారు మిల్లెట్ రోటీలు తినడం ప్రయోజనకరంగా ఉంటుంది.
5. ఇది రక్తహీనతకు ఉపయోగపడుతుంది. గర్భధారణ సమయంలో కూడా వైద్యులు తరచుగా మిల్లెట్ బ్రెడ్ తినమని సలహా ఇస్తారు. మిల్లెట్ బ్రెడ్‌లో ఉండే ఐరన్ వల్ల రక్తహీనతను చాలా వరకు అధిగమించవచ్చు.
6. పిల్లల శారీరక మరియు మానసిక అభివృద్ధికి కూడా సహాయపడుతుంది.