Raw Milk: పచ్చిపాలతో అందానికి మెరుగులు.. మెరిసే చర్మం కోసం ఈ పాల ఫేస్ మాస్క్ ఒకసారి ట్రై చేయండి

Jyothi Gadda

Jyothi Gadda |

Updated on: Dec 06, 2022 | 1:01 PM

మీ వంటగదిలో ఉండే పచ్చి పాలతో మీ ముఖానికి మెరుపు, మృదుత్వం తీసుకురావొచ్చు. చంద్ర బింబంలాంటి చర్మం కోసం ప్రతిరోజూ కేవలం ఒక చెంచా పచ్చి పాలను ఉపయోగించడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు.

Raw Milk: పచ్చిపాలతో అందానికి మెరుగులు.. మెరిసే చర్మం కోసం ఈ పాల ఫేస్ మాస్క్ ఒకసారి ట్రై చేయండి
Milk Face Pack

చలికాలంలో చర్మ సంరక్షణ చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ సీజన్‌లో చర్మం పొడిబారి నిర్జీవంగా మారుతుంది. అలాంటి పరిస్థితుల్లో చాలా మంది మహిళలు ఇంట్లోనే లభించే బ్యూటీ ఉత్పత్తులపై ఆధారపడతారు. మార్కెట్‌లో ఖరీదైనవి. రసాయనాలు అధికంగా ఉండే ఉత్పత్తులు కూడా చర్మంపై ప్రత్యేకంగా ఎలాంటి ప్రభావం చూపించవు. అందువల్ల మీరు కూడా మీ వంటగదిలో ఉండే పచ్చి పాలను ఉపయోగించవచ్చు. ఇది మీ ముఖ సౌందర్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని నిరూపించబడింది. ప్రతిరోజూ కేవలం ఒక చెంచా పచ్చి పాలను ఉపయోగించడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు.

పచ్చి పాలను ముఖానికి రాసుకుంటే ముఖంపై ఉన్న మృతకణాలు త్వరగా తొలగిపోతాయి. పచ్చి పాలను చర్మానికి పట్టించడం వల్ల ముఖం తాజాగా మారుతుంది. దీంతో పాటు పాలు చర్మాన్ని లోతుగా శుభ్రపరుస్తుంది. లాక్టిక్ యాసిడ్ పచ్చి పాలలో అధికంగా ఉంటుంది. దీని సహాయంతో మీరు చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయవచ్చు. రాత్రి పడుకునేటప్పుడు పచ్చి పాలను ముఖానికి రాసుకున్నట్లయితే మెరిసే చర్మం మీ సొంతమవుతుంది. పాలలో లాక్టిక్ యాసిడ్ ఉండటం వల్ల ఇది చర్మం బిగుతుగా మారుతుంది. అలాగే టానింగ్ తగ్గించి, ముఖ ఛాయను కాంతివంతంగా మారుస్తుంది. మీరు పచ్చి పాలను మాయిశ్చరైజర్‌గా కూడా ఉపయోగించవచ్చు. రోజూ పచ్చి పాలతో ముఖానికి మసాజ్ చేయడం వల్ల ముడతలు తగ్గుతాయి, వృద్ధాప్య సమస్య కూడా దూరమవుతుంది.

పచ్చి పాలను అప్లై చేయడం వల్ల మొటిమల సమస్య కూడా తొలగిపోతుంది. దానికి ఉప్పు కలిపితే మొటిమలు నయమవుతాయి. తక్షణ మెరుపు కోసం మీరు పచ్చి పాలను కూడా ఉపయోగించవచ్చు. నల్లటి వలయాలు తగ్గాలంటే పచ్చి పాలను కాటన్ ప్యాడ్‌లో తీసుకుని కళ్ల చుట్టూ రాసుకుంటే నల్లటి వలయాలు తగ్గుతాయి. పచ్చి పాలతో ఫేషియల్ టోనింగ్ చేయడం వల్ల ముఖంపై గడ్డకట్టిన డెడ్ స్కిన్ పొర తొలగిపోతుంది.

ఇవి కూడా చదవండి

పచ్చి పాల ఫేస్ ప్యాక్: మీరు పచ్చి పాలతో ఫేస్ ప్యాక్ సిద్ధం చేసుకోవచ్చు. మీ పాలలో శెనగపిండి, తేనె కలిపి ముఖానికి అప్లై చేసి 10 నుండి 20 నిమిషాల తర్వాత ముఖం నుండి తొలగించండి. దీన్ని రెగ్యులర్ గా అప్లై చేస్తే ముఖంలో గ్లో రావడంతో పాటు మచ్చలు కూడా తేలికవుతాయి.

పచ్చి పాలను ఎవరు వాడకూడదు:  మీ చర్మం జిడ్డుగా ఉంటే, మీరు పచ్చి పాలను ముఖానికి పూయకూడదు. బదులుగా మీరు ఉడికించిన తర్వాత ముఖానికి పాలు రాసుకోవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu