Copper Vessel Water: రాగి పాత్రల్లో నిల్వచేసిన నీరు తాగుతున్నారా..? అయితే, ఇలాంటి పొరపాట్లు చేస్తే అంతే సంగతి..

కాపర్‌ వాటర్‌ తాగే విధానంలో కొందరు తెలిసి తెలియక పొరబాట్లు, తప్పులు చేస్తుంటారు. ఇవి అనారోగ్య సమస్యలకు దారి తీస్తాయి. అందుకే రాగి నీటిని తాగేవాళ్లు ముందుగా తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి.

Copper Vessel Water: రాగి పాత్రల్లో నిల్వచేసిన నీరు తాగుతున్నారా..? అయితే, ఇలాంటి పొరపాట్లు చేస్తే అంతే సంగతి..
Copper Water
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 07, 2022 | 7:28 AM

రాగి పాత్రలో నిల్వ చేసిన నీటిని తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుందని అందరికీ తెలిసిందే. ఇది మన పూర్వీకుల కాలం నుంచి వస్తున్న అలవాటు కూడా. అయితే,రాగి పాత్రలో ఉంచిన నీటిని తాగడం వల్ల అనేక వ్యాధులు దూరమవుతాయి. రాగి నీటిని తాగడం వల్ల శరీరంలో కాపర్ లోపం పోతుంది. ముఖ్యంగా రాగి పాత్రల్లో నీటి పోయడం వల్ల నీరు శుద్ధవుతాయి. దీంతో పాటు అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి.అదేవిధంగా కాపర్‌ వాటర్‌ తాగే విధానంలో కొందరు తెలిసి తెలియక పొరబాట్లు, తప్పులు చేస్తుంటారు. ఇవి అనారోగ్య సమస్యలకు దారి తీస్తాయి. అందుకే రాగి నీటిని తాగేవాళ్లు ముందుగా తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. మరి అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

ఉదయం ఖాళీ కడుపుతో త్రాగాలి: ఉదయం పూట ఖాళీ కడుపుతో రాగిపాత్రలో నిల్వచేసిన నీళ్లు తాగాలి. ఖాళీ కడుపుతో రాగి నీటిని తాగడం వల్ల జీర్ణక్రియకు చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా జీర్ణ క్రియ సమస్యలు కూడా తగ్గుతాయి. అన్నం తిన్న తర్వాత రాగి పాత్రల్లో ఉంచిన నీటిని తాగడం వల్ల హాని కలుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

రాగిపాత్రల్లో నీటిని ఎలా నిల్వ ఉంచాలి: రాగి నీటిని క్రమం తప్పకుండా తాగితే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అయితే రాగి పాత్రల్లో ఆ నీటిని కనీసం 8 గంటలపాటు ఉంచాల్సి ఉంటుంది. రాగి పాత్రలో 48 గంటల పాటు నీటిని నిల్వ చేసిన నీటిని తాగితే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి.

ఇవి కూడా చదవండి

నేలపై పెట్టవద్దు: చాలా మంది నిద్రపోయే ముందు నేలపై రాగి పాత్రను ఉంచుతారు. ఉదయం నిద్రలేచిన తర్వాత ఆ నీటిని తాగుతారు. ఇలా తాగడం హానికరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రాగి నీటిని నేలపై పెట్టి తాగడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయంటున్నారు.

ఆమ్లత్వం హానికరం: రాగిపాత్రలో నీరు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి. అయితే అసిడిటీ ఉన్నవారు రాగి నీటిని తాగడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. వీటిని అనుసరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవటం మంచిది.)