Watch Video: ఇన్నాళ్లూ మనుషులే తెలివైనవారని అనుకుంటున్నారా..? అయితే ఈ వీడియో చూడండి.. మీ అభిప్రాయం వెంటనే మారిపోతుంది..
అడవి జంతువులకు సంబంధించిన వీడియోలను మీరు ప్రతిరోజూ సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటారు. వాటిలో చాలా వీడియోలు వైరల్ అవుతుంటాయి. అడవిలో జీవించే ఏనుగుల భారీ జంతువుల నుంచి..
అడవి జంతువులకు సంబంధించిన వీడియోలను మీరు ప్రతిరోజూ సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటారు. వాటిలో చాలా వీడియోలు వైరల్ అవుతుంటాయి. అడవిలో జీవించే ఏనుగుల భారీ జంతువుల నుంచి సింహం వంటి క్రూర మృగాల వరకూ ఎన్నో వీడియోలు మనం నేడు చూస్తున్నాం. అడవి జంతువులలో ఏనుగు కూడా చాలా తెలివైన జంతువు అంటే ఒప్పుకోక తప్పదు. అవి కూడా తరచూ మనలాగానే ప్రవర్తిస్తాయి. మన ఇంట్లో ఉండే కుక్క, పిల్లి లాగానే వాటిని కూడా తేలికగా మచ్చిక చేసుకోవచ్చు. బహుశా అందుకేనేమో.. అందరూ ఏనుగుల వీడియోలను ఇష్టంగా చూస్తారు. ఇంకా ఏనుగులకు సంబంధించిన అనేక వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ప్రస్తుతం కూడా ఓ ఏనుగుకు సంబంధించిన వీడియో ఒకటి బాగా వైరల్ అవుతోంది. దాని తెలివిని చూసి నెటిజన్లు ఫిదా అవడమే కాక సరదాగా నవ్వుకుంటున్నారు.
నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోలో భారీగా ఉన్న ఓ ఏనుగు రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన ఇనుప తీగ(ఫెన్సింగ్ వైర్)ను దాటేందుకు ప్రయత్నిస్తోంది. అయితే ఆ తీగను ఒక్క సారిగా దాటకుండా దానిని పరీక్షిస్తూ ఉంటాడు ఈ గజరాజు. అలా ఎందుకు చేసిందంటే సాధారణంగా వన్య మృగాల నుంచి అడవి గుండా వెళ్లే వారిని రక్షించేందుకు.. అటవీ అధికారులు రోడ్డుకు ఇరువైపులా కరెంట్ తీగలను ఏర్పాటు చేస్తారు. తాను దాటబోయే తీగలో కూడా కరెంట్ ప్రసరిస్తోందేమోననే అనుమానంతో ఈ ఏనుగు కూడా అలా పదే పదే కాలు వేసి పరీక్షించింది. చివరకు ఆ తీగలో కరెంట్ వెళ్లడంలేదని నిర్ధారించుకున్న ఏనుగు తీగలు కట్టి ఉన్న చిన్న స్థంభాన్ని నెట్టి దాని మీదుగా రోడ్డు దాటుకుని అవతలి వైపుకు చేరుకుంటుంది. ఆ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
నెట్టింట వైరల్ అవుతున్న గజరాజు వీడియో మీకోసం..
Smarter beings ? #Elephants pic.twitter.com/zLakeKLeIq
— Geethanjali K IFS (@Geethanjali_IFS) December 5, 2022
కాగా, ఈ వీడియోను ఐఎఫ్‌ఎస్ అధికారిణి గీతాంజలి తన సోషల్ మీడియాలో ట్విట్ చేశారు. ఇంకా తన పోస్ట్‌కు ఆమె ‘‘తెలివైనవి’’ అని కాప్షన్ కూడా రాసుకొచ్చారు. ఇంకా ఈ వీడియోను చూసి నెటిజన్లు విపరీతంగా ఇష్టపడుతున్నారు. సోషల్ మీడియా యూజర్లు ఈ వీడియోను షేర్ చేయడంతోపాటు దానిపై తమ స్పందనలను తెలియజేస్తున్నారు. ఈ వీడియోపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. ‘కరెంట్ వల్ల కలిగే బాధను ఈ ఏనుగు అనుభవించి ఉంటుందేమో.. అందుకే తీగలను తనిఖీ చేస్తున్నద’ని రాశాడు. మరో సోషల్ మీడియా యూజర్ ‘ఈ ఏనుగు అందమైనది ఇంకా తెలివైనది’ అని అభిప్రాయపడ్డాడు. మరో యూజర్ ‘మనుషుల కంటే జంతువులు తెలివిగా మారుతున్నాయ’ని రాసుకొచ్చాడు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం