Guava Side Effects: మీరు జామకాయలను తింటున్నారా..? కానీ మీకు ఈ సమస్యలు ఉంటే తినకపోవడమే చాలా మంచిది..
జామపండు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు కలుగుతాయి. కానీ కొంతమందికి జామపండు తినడం కష్టంగా అనిపించవచ్చు. ఇంకా అందులోని పోషకాలు కొందరికి కొన్ని రకాల వ్యాధులను..
జామపండు రుచిని ఇష్టపడిన వారు ఉండరనడంలో అతిశయోక్తి లేనే లేదు. ఇంకా దాని రుచి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవసరం అసలే ఉండదు. జీవితంలో ఒక్కసారైనా మీరందరూ జామకాయలను తినే ఉంటారు. చలికాలంలో ప్రజలు జామపండును తినడానికి ఎంతో ఉత్సాహాన్ని కనబరుస్తారు. కొందరు బాగా పండిన జామకాయలనే తింటారు. ఇంకొందరు అయితే పచ్చి జామకాయలను కూడా అమితానందంగా తింటారు. జామ మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఎన్నో ఔషధ గుణాలు ఇందులో ఉన్నాయి. విటమిన్ సీ, యాంటీఆక్సిడెంట్లు, అనేక ఖనిజాలు జామకాయలో పుష్కలంగా ఉన్నాయి.
జామపండు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు కలుగుతాయి. కానీ కొంతమందికి జామపండు తినడం కష్టంగా అనిపించవచ్చు. ఇంకా అందులోని పోషకాలు కొందరికి కొన్ని రకాల వ్యాధులను కలిగిస్తాయి. అయితే ఎలాంటి వ్యక్తులు జామపండు తినకుండా ఉండాలో తెలుసుకుందాం..
జలుబు, దగ్గు:
జామ మంచి రుచిని కలిగి ఉంటుంది. దీన్ని తినడం వల్ల జలుబు, దగ్గు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి జలుబు, దగ్గు ఉన్నప్పుడు జామపండు తినకుండా ఉండాలి. ముఖ్యంగా దగ్గులో జామపండు తినడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది.
దంత సమస్యలు:
జామ చాలా గట్టిగా ఉంటుంది. పచ్చి జామకాయను నమలడం కూడా బాగా కష్టమే. దంతాలు లేదా చిగుళ్ల సమస్య ఉంటే, జామపండు తినకుండా ఉండడం మంచిది. దీనిని తినడం వల్ల ఈ సమస్యలు మరింతగా పెరుగుతాయి. దంతాలు సున్నితంగా ఉన్నవారు జామపండు తినడం వల్ల కూడా సమస్యలను ఎదుర్కొంటారు. దీని వల్ల పళ్లలో పులుపు వస్తుంది.
అతిసారం మరియు అపానవాయువు:
జామపండులో ఫైబర్ బాగా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కానీ మీరు జీర్ణక్రియకు సంబంధించిన ఏదైనా సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే, మీరు జామపండు తినకుండా ఉండాలి. విరేచనాలు లేదా కడుపు ఉబ్బరం ఉన్నప్పుడు కూడా జామపండు తినడం మానేయాలి. లేకపోతే జామపండు ఆ సమస్యను మరింతగా పెంచుతుంది.
అధిక చక్కెర:
డయాబెటిస్‌లో జామపండు తినవచ్చు, అయితే రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉంటే జామపండు తినకుండా ఉండాలి. జామ సహజ చక్కెర అయినప్పటికీ, ఇది చక్కెర స్థాయిని పెంచుతుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం..