Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vitamin D: మీరు ఎక్కువ సమయం పనిలోనే గడుపుతున్నారా..? అయితే మీకు విటమిన్ డీ లోపం ఉన్నట్లే.. దానిని ఎలా నివారించాలంటే..?

మానవ శరీరం ఆరోగ్యంగా, చురుకుగా ఉండడానికి విటమిన్లు, మినరల్స్ ఎంత అవసరమో మనందరికీ తెలుసు. అయిేత ఈ రోజుల్లో చాలా మంది విటమిన్ల లోపంతో బాధపడుతున్నారు. అలాంటి విటమిన్లలో..

Vitamin D: మీరు ఎక్కువ సమయం పనిలోనే గడుపుతున్నారా..? అయితే మీకు విటమిన్ డీ లోపం ఉన్నట్లే.. దానిని ఎలా నివారించాలంటే..?
Vitamin D
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Dec 06, 2022 | 7:48 PM

మానవ శరీరం ఆరోగ్యంగా, చురుకుగా ఉండడానికి విటమిన్లు, మినరల్స్ ఎంత అవసరమో మనందరికీ తెలుసు. అయితే ఈ రోజుల్లో చాలా మంది విటమిన్ల లోపంతో బాధపడుతున్నారు. అలాంటి విటమిన్లలో విటమిన్ డీ కూడా ఒకటి. విటమిన్ డీ లోపం ఎక్కువగా పని చేసేవారిలో కనిపిస్తుంది. విటమిన్ లోపం కారణంగా అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంకా ఎముకలు, కండరాలకు సంబంధించిన సమస్యలు కూడా వస్తాయి. కెనడాలోని అల్బెర్టా విశ్వవిద్యాలయం విటమిన్ డీ మీద చేసిన పరిశోధనల ప్రకారం.. షిఫ్టులలో పనిచేసేవారు, ముఖ్యంగా ఇంటి లోపల పనిచేసే వారిలో విటమిన్ డి చాలా తక్కువగా ఉంటుంది. దాదాపు 77 శాతం మంది కార్మికులు,  72 శాతం మంది ఆరోగ్య కార్యకర్తలు, 80 శాతం మంది ఎక్కువ కాలం పని చేస్తున్నవారిలో విటమిన్ డీ లోపం బాగా ఉన్నట్లు తేలింది.

విటమిన్-డీ లోపం శీతోష్ణ దేశాలతో పాటు ఉష్టోగ్రతలు ఎక్కువగా దేశాల్లో కూడా కనిపిస్తుంది. నాడీ వ్యవస్థ, మస్క్యులోస్కెలెటల్ వ్యవస్థ, రోగనిరోధక వ్యవస్థకు విటమిన్ డీ శరీరంలో ఉండడం అత్యవసరం. విటమిన్ డీ లోపాన్ని నివారించేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలు.. 

జస్ట్ డైట్ క్లినిక్ వ్యవస్థాపకురాలు, డైటీషియన్ జస్లీన్ కౌర్ ప్రకారం.. శ్రామిక వర్గానికి తగినంత ఆహారం లభించదు. అందువల్ల వారిలో విటమిన్ల లోపం ఎక్కువగా ఉంటుంది. వారి సమయాభావం వల్ల తాజా పండ్లు, పచ్చి కూరగాయలు తినలేక విటమిన్ లోపానికి గురవుతారు. ఇంకా సమయానికి తినాలి కనుక బయటి ఆహారాన్ని తీసుకుంటారు. కానీ కౌర్ ప్రకారం మార్కెట్‌లో లభించే అన్ని రకాల అహార పదార్థాలు మానవ ఆరోగ్యానికి మంచివి కావు. కానీ చాలా మంది బయట లభించేవాటినే ఎక్కువగా తినడంతో విటమిన్ లోపానికి గురవుతున్నారు. ఈ సమస్యను అధిగమించడానికి విటమిన్ కాప్సుల్స్, లేదా విటమిన్లు పుష్కలంగా లభించే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా శరీరానికి విటమిన్లను అందించవచ్చు.

ఇవి కూడా చదవండి

విటమిన్ డి లోపం  ఎందుకు  కాల్షియంను నిర్వహించాలి

విటమిన్ డీ లోపం ఉన్నవారికి శరీరంలో కీళ్ల నొప్పులు, దంతాల సమస్యలు ఉంటాయని జస్లీన్ కౌర్ చెప్పారు. విటమిన్-డీ కావాలంటే ఉదయపు సూర్యకాంతి అద్భుతమైన మార్గం. ఇది ఎముకలు, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. బాదం, గింజలు, చేపలు వంటి వాటిని తీసుకోవడం ద్వారా విటమిన్ డీని పొందవచ్చు. విటమిన్ డీ లోపం ఉన్నవారు కాల్షియం ఎక్కువగా తీసుకుంటే సరిపోతుందని అనేక పరిశోధనలు నిరూపించాయి.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..