AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kids Health: ఆ ఫుడ్‌తో పిల్లల్లో మానసిక సమస్యలు, గుండె జబ్బులు: పరిశోధనలో షాకింగ్‌ విషయాలు

ఈ రోజుల్లో చిన్నా పెద్ద అనే తేడా లేకుండా చాలా మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా చిన్న వయసులోనే పిల్లలకు మానసిక సమస్యలు, గుండె జబ్బులు..

Kids Health: ఆ ఫుడ్‌తో పిల్లల్లో మానసిక సమస్యలు, గుండె జబ్బులు: పరిశోధనలో షాకింగ్‌ విషయాలు
Kids Health
Subhash Goud
|

Updated on: Dec 06, 2022 | 8:47 PM

Share

ఈ రోజుల్లో చిన్నా పెద్ద అనే తేడా లేకుండా చాలా మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా చిన్న వయసులోనే పిల్లలకు మానసిక సమస్యలు, గుండె జబ్బులు ఎదురవుతున్నాయి. అయితే జంక్ ఫుడ్ తినడం వల్ల పిల్లల్లో మానసిక సమస్యలు, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. జిందాల్ నేచర్‌క్యూర్ ఇన్‌స్టిట్యూట్ 15 నుంచి 29 సంవత్సరాల వ్యక్తుల మధ్య, అలాగే 1995 నుంచి 2012 వరకు జన్మించిన పిల్లలపై పరిశోధన నిర్వహించారు. పిల్లలు శారీరకంగా చాలా చురుకుగా ఉన్నారని గుర్తించారు. ఈ పిల్లలు శారీరక శ్రమ కూడా ఉంటుందని, కానీ పిల్లలలో చెడు ఆహారపు అలవాట్లు కారణంగా వారి మానసిక ఆరోగ్యం క్షీణిస్తుంది. ఈ సర్వేలో పాల్గొన్న 90% పిల్లలు వారంలో ప్రతిరోజూ శారీరకంగా శ్రమిస్తారని తెలిపారు. అయితే 38% మంది వారు కనీసం వారానికి రెండు సార్లు ఫాస్ట్ ఫుడ్ కూడా తీసుకుంటారని, ఇలా చేసే పిల్లలలో 39 శాతం మంది ఆందోళన , ఈటింగ్ డిజార్డర్ లేదా డిప్రెషన్ వంటి మానసిక సమస్యలతో కూడా బాధపడుతున్నారన అన్నారు.

ఇందులో పాల్గొంటున్న చాలా మంది చిన్నారులు మెరుగైన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం కష్టపడుతున్నారని, అయితే వారు తినే జంక్ ఫుడ్ దీర్ఘకాలికంగా ప్రమాదాన్ని సృష్టిస్తోందని ఈ సర్వేలో స్పష్టమైంది. ఫాస్ట్ ఫుడ్‌పై జరిపిన సర్వేలో వారానికి ఒకటి కంటే ఎక్కువసార్లు ఫాస్ట్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఊబకాయం వస్తుంది. అయితే వారానికి రెండుసార్లు ఫాస్ట్ ఫుడ్ తినడం వల్ల టైప్ 2 డయాబెటిస్, మెటబాలిక్ సిండ్రోమ్, కరోనరీ హార్ట్ డిసీజ్ వచ్చే ప్రమాదం ఉందని పరిశోధకులు చెబుతున్నారు.

బెంగుళూరులోని జిందాల్ నేచర్‌క్యూర్ ఇన్‌స్టిట్యూట్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బబీనా ఎన్‌ఎం మాట్లాడుతూ.. మా సర్వేలో చేర్చిన పిల్లల్లో ఎక్కువ మంది వ్యాయామానికి ప్రాధాన్యత ఇస్తున్నారని, అయితే మానసిక ఆరోగ్యంతో ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. దీని వల్ల అనేక దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. హార్మోన్ల అసమతుల్యత, నిద్ర భంగం కారణంగా మానసిక అనారోగ్యం వస్తుంది. ఈ మానసిక వ్యాధుల చికిత్సకు ఔషధం తీసుకున్నప్పుడు బరువు పెరగడం లేదా హృదయ స్పందన ఆటంకాలు వంటి దుష్ప్రభావాలు సంభవించే అవకాశం ఉందని గమనించినట్లు తెలిపారు. అటువంటి పిల్లలు వారి మధ్య 30 లేదా 40 ఏళ్ళలో ఉన్నప్పుడు ఈ లక్షణాలు అనేక శారీరక రుగ్మతల ప్రమాదాన్ని పెంచుతాయని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మానసిక అనారోగ్యంతో బాధపడేవారిలో శారీరక ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. మానసిక అనారోగ్యాలు అనారోగ్యకరమైన ఆహారం, నిద్ర అలవాట్లు, ధూమపానం లేదా పదార్థ వినియోగానికి దారితీయవచ్చు. ఇవన్నీ శారీరక ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి.

యోగా, ధ్యానంతో ఆరోగ్యం:

ఈ సర్వేలో మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే 29 సంవత్సరాల వయస్సు వరకు ప్రతివాదులు 85 శాతం మంది యోగా, ధ్యానం వంటి ప్రత్యామ్నాయ చికిత్సలను విశ్వసిస్తున్నారని డాక్టర్ బబీనా ఎన్‌ఎం అన్నారు. ప్రకృతి వైద్యం వారికి సహాయపడింది.ఆరోగ్యంగా ఉండేందుకు సహాయం చేస్తుందని అన్నారు. మానసిక ఆరోగ్యాన్ని యోగా, ధ్యానం ద్వారా జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యమన్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి