Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Guava Leaves: ఆ సమస్యలున్న వారికి దివ్యౌషధం.. జామాకులు.. ఈ 9 విషయాలు తెలుసుకుంటే మీకే మేలు..

జామ పండు వల్ల కలిగే ప్రయోజనాల గురించి మనందరికీ తెలుసు. కానీ దాని ఆకుల వల్ల కలిగే ప్రయోజనాల గురించి మీకు తెలుసా..? ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు.

Guava Leaves: ఆ సమస్యలున్న వారికి దివ్యౌషధం.. జామాకులు.. ఈ 9 విషయాలు తెలుసుకుంటే మీకే మేలు..
Guava Leaves
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 06, 2022 | 8:37 PM

జామ పండు వల్ల కలిగే ప్రయోజనాల గురించి మనందరికీ తెలుసు. కానీ దాని ఆకుల వల్ల కలిగే ప్రయోజనాల గురించి మీకు తెలుసా..? ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. అయితే జామ ఆకులు బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలతో నిండి ఉన్నాయి. అనేక ఔషధ గుణాలు జామ ఆకుల్లో ఉన్నాయని, ఇది మీ ఆరోగ్యానికి అనేక విధాలుగా ఉపయోగపడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. బరువు తగ్గడం నుంచి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడం వరకు, చాలా సమస్యలన్నింటికీ జామాకులు దివ్యౌషధం అని పేర్కొంటున్నారు. కావున జామాకుల వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

గాయాలను నయం చేస్తాయి..

జామాకులు యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి శస్త్రచికిత్స గాయాలు, చర్మం కాలిన గాయాలు, మృదు కణజాల ఇన్ఫెక్షన్ల నుంచి కోలుకోవడంలో సహాయపడతాయని పేర్కొంటున్నారు.

కాలేయం – ప్రేగుల ఆరోగ్యానికి మేలు చేస్తుంది

అలెగ్జాండ్రియా యూనివర్శిటీ, డెమోనార్ యూనివర్శిటీ నిర్వహించిన ఒక అధ్యయనంలో జామ ఆకుల పదార్దాలు శక్తివంతమైన ఔషధ గుణాలను కలిగి ఉన్నాయని, ఇవి ప్రేగు సమస్యలకు చికిత్స చేయడంలో, కాలేయ ఆరోగ్యానికి ప్రయోజనం చేకూరుస్తుందని కనుగొన్నారు. గియార్డియా ఇన్ఫెక్షన్‌లో కూడా దీని ఉపయోగం ప్రభావవంతంగా ఉంటుందని పరిశోధనలో తేలింది. గియార్డియా ఇన్‌ఫెక్షన్ అనేది పేగుకు సంబంధించిన ఇన్‌ఫెక్షన్. ఇందులో పొత్తికడుపు తిమ్మిర్లు, అపానవాయువు, వికారం, నీళ్ల విరేచనాలు వంటి సమస్యలకు దారి తీస్తులంది. జియార్డియా ఇన్ఫెక్షన్ ప్రపంచవ్యాప్తంగా కనిపించే మైక్రోస్కోపిక్ పరాన్నజీవి వల్ల వస్తుంది.

ఇవి కూడా చదవండి

యాంటీ కార్సినోజెనిక్ లక్షణాలు..

ప్రోస్టేట్ క్యాన్సర్‌లో కణితి పరిమాణాన్ని తగ్గించడంలో జామాకు ఎలా సహాయపడుతుందో తెలుసుకోవడానికి 2010లో ఒక అధ్యయనాన్ని నిర్వహించినట్లు క్యాన్సర్ ఔషధాల తయారీ సంస్థ అడ్మాక్ ఆంకాలజీ తెలిపింది. జర్నల్ ఆఫ్ మెడిసినల్ ఫుడ్ (2012)లోని మరొక అధ్యయనం మానవ ప్రోస్టేట్ క్యాన్సర్‌కు వ్యతిరేకంగా ఈ మొక్క యాంటీకాన్సర్ లక్షణాలను నిర్ధారించింది.

రక్తపోటులో చికిత్స..

అధిక రక్తపోటు ఉన్న రోగులకు సంబంధించిన ఒక అధ్యయనంలో జామ ఆకులను ఉపయోగించడం వల్ల కొలెస్ట్రాల్ (9.9%), ట్రైగ్లిజరైడ్స్ (7.7%) రక్తపోటు తగ్గినట్లు తేలింది. అదే సమయంలో, అధిక సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ కొలెస్ట్రాల్ పెరిగిందని తేలింది.

అధిక రక్త చక్కెర నివారణ..

జామ ఆకు సారం రక్తంలో చక్కెర స్థాయిలను మెరుగుపరుస్తుందని తేలింది. దీర్ఘకాలంలో రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. ఇంకా ఇది ఇన్సులిన్ నిరోధకతను కలిగి ఉంటుందని పరిశోధనలో కనుగొన్నారు.

పీరియడ్స్ నొప్పి నుంచి ఉపశమనం..

మెక్సికోలోని ఎపిడెమియాలజీ అండ్ హెల్త్ సర్వీస్ రీసెర్చ్ యూనిట్ నిర్వహించిన ఒక అధ్యయనంలో 197 మంది మహిళలు పాల్గొన్నారు. ఈ పరిశోధనలో, ప్రతి ఒక్కరికి ప్రతిరోజూ 6mg మోతాదు ఇచ్చారు. సాంప్రదాయ చికిత్సతో పోలిస్తే పీరియడ్స్ వల్ల వచ్చే నొప్పి గణనీయంగా తగ్గింది. దీనితో గర్భాశయ తిమ్మిరి నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు.

మొటిమలు – ఇతర చర్మ సమస్యలకు..

జోర్డానియన్ అధ్యయనంలో, జామ ఆకుల సారం మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను చంపడానికి పనిచేస్తుందని తేలింది. ఎందుకంటే ఈ ఆకుల్లో యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. జపాన్‌లో నిర్వహించిన ఒక అధ్యయనంలో జామ ఆకుల పదార్దాలు ముడతలు, వృద్ధాప్య సంకేతాలను తగ్గించడంలో సహాయపడతాయని తేలింది.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది..

జామ ఆకులలో అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫినాలిక్ సమ్మేళనాలు మరియు జీవసంబంధ కార్యకలాపాలు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

జుట్టు రాలడాన్ని నియంత్రిస్తుంది..

జామ ఆకులు కూడా జుట్టు రాలే సమస్యను దూరం చేస్తాయి. దీని కోసం మీరు కొన్ని జామ ఆకులను ఒక లీటరు నీటిలో 20 నిమిషాలు ఉడకబెట్టాలి. ఈ తరువాత, దానిని ఫిల్టర్ చేసి, చల్లబరచాలి. ఇప్పుడు దీన్ని ముందుగా జుట్టుపై అప్లై చేయాలి. రెండు గంటలపాటు అలాగే ఉంచి తర్వాత శుభ్రం చేసుకోవాలి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం..