Beetroot: పరగడుపున బీట్‌రూట్ తింటే నమ్మలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..
ఆరోగ్యంగా ఉండేందుకు.. మంచి జీవనశైలి, ఆహారం తీసుకోవడం మంచిది. ఆరోగ్యానికి మేలు చేసే దుంపల్లో బీట్‌రూట్ ముందు వరుసలో ఉంటుంది.
Beetroot Health Benefits: ఆరోగ్యంగా ఉండేందుకు.. మంచి జీవనశైలి, ఆహారం తీసుకోవడం మంచిది. ఆరోగ్యానికి మేలు చేసే దుంపల్లో బీట్‌రూట్ ముందు వరుసలో ఉంటుంది. బీట్‌రూట్ భూమి లోపల పండించే దుంప కూరగాయ. ఇది సాధారణంగా సలాడ్‌తోపాటు జ్యూస్‌గా చేసుకుని తాగుతారు. దీనిలో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. జీర్ణక్రియను మెరుగుపరిచే డైటరీ ఫైబర్, సహజ చక్కెర, మెగ్నీషియం, సోడియం, పొటాషియం కూడా ఉన్నాయి. ఇది మన ఆరోగ్యానికి అన్ని విధాలుగా ఉపయోగపడేలా పనిచేస్తుంది. ప్రతిరోజూ పరగడుపున బీట్‌రూట్‌ను తీసుకుంటే దాని ప్రభావం కొన్ని రోజుల్లోనే కనిపిస్తుందని ఆహార నిపుణులు పేర్కొంటున్నారు. ఆరోగ్యానికి బోలెడన్ని ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు.
ఖాళీ కడుపుతో బీట్‌రూట్ తినడం, జ్యూస్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు..
యూరిన్ ఇన్ఫెక్షన్లు మటుమాయం: భారతదేశంలో చాలా మంది ప్రజలు యూరిన్ ఇన్ఫెక్షన్ సమస్యను ఎదుర్కొంటారు. ఇందులో ఓపెన్ యూరిన్, మూత్రంలో మంటలు మొదలైనవి ఉంటాయి. దీన్ని నివారించడానికి ఉదయం వేళ బీట్‌రూట్ జ్యూస్‌ని ఖచ్చితంగా తాగండి. దీని ద్వారా మీకు చాలా ఉపశమనం లభిస్తుంది.
శరీరంలో నీటి నిలుపుదల నివారణ: శరీరంలోని చాలా భాగం నీటితో నిండి ఉంటుంది. శరీరంలో ద్రవం కొరత ఎప్పుడూ ఉండకూడదు. ఇంకా, నీటి నిలుపుదల కూడా మంచిది కాదు. ఇలా జరగడం ప్రారంభమైతే.. క్రమంగా అది సమస్యగా మారుతుంది. మీకు కూడా అలాంటి సమస్య ఉంటే ఖచ్చితంగా ఖాళీ కడుపుతో బీట్‌రూట్ తినండి.
బరువు తగ్గుతుంది: బరువు పెరగడం, పొట్ట, నడుము కొవ్వు వల్ల ఇబ్బంది పడే వారు ఉదయాన్నే బీట్‌రూట్ తినాలి. ఎందుకంటే ఇందులో మంచి డైటరీ ఫైబర్ ఉంటుంది. ఇది ఎక్కువ కాలం ఆకలిని నియంత్రించి.. అతిగా తినడాన్ని నివారిస్తుంది.
చర్మ – జుట్టు సమస్యలు దూరం: బీట్‌రూట్‌లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. చాలా మంది ఆరోగ్య నిపుణులు ఉదయం నిద్రలేచిన తర్వాత ఖాళీ కడుపుతో తినాలని సిఫార్సు చేస్తున్నారు. ఎందుకంటే పరగడుపున తినడం వల్ల పోషకాల శోషణ మెరుగ్గా జరుగుతుంది. అన్ని అవయవాలకు పోషకాలు అందుతాయి. కానీ, ఇలా జరగపోవడం వల్ల ఏదో ఒక లోపానికి దారితీస్తుంది. బీట్‌రూట్ తీసుకోవడం వల్ల విటమిన్లు, ఖనిజాల శోషణ సులభంగా జరుగుతుందని.. దీంతో చర్మ, జుట్టు సమస్యలు దూరమవుతాయని నిపుణులు పేర్కొంటున్నారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి