Alcohol and Cancer: ఒక గ్లాసు ఆల్కహాల్‌తో క్యాన్సర్ ప్రమాదం.. అధ్యయనంలో షాకింగ్ విషయాలు
ఆల్కహాల్ వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి తెలిసినప్పటికీ మద్య పానీయాలకు ప్రజలలో డిమాండ్ ఎక్కువగా ఉంది. పరిమిత మొత్తంలో ఆల్కహాల్ శరీరానికి పెద్దగా..
ఆల్కహాల్ వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి తెలిసినప్పటికీ మద్య పానీయాలకు ప్రజలలో డిమాండ్ ఎక్కువగా ఉంది. పరిమిత మొత్తంలో ఆల్కహాల్ శరీరానికి పెద్దగా హాని చేయదని చాలామంది నమ్ముతారు. వైన్, ఇతర పానీయాలు కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయని కొందరు నమ్ముతుంటారు. కానీ కొత్త పరిశోధన మరోలా సూచిస్తుంది. ఆల్కహాల్ తాగడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. వైన్, బీర్, విస్కీ వంటి అన్ని పానీయాలలో ఇథనాల్ ఉంటుంది. ఆల్కహాల్ పానీయాలు ఏడు రకాల క్యాన్సర్లకు కారణమవుతాయని అధ్యయనం చెబుతోంది.
అమెరికన్ అసోసియేషన్ ఫర్ క్యాన్సర్ రీసెర్చ్ జర్నల్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం.. ఆల్కహాలిక్ పానీయాల నుండి క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. క్యాన్సర్ ఎపిడెమియాలజీ, బయోమార్కర్స్ అండ్ ప్రివెన్షన్‌లో ప్రచురించబడిన పరిశోధన ప్రకారం.. పెద్దవారిలో ఆల్కహాల్ తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం 31.2 శాతం. ఇందులో బీర్ వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం 24.9 శాతం కాగా, వైన్ వల్ల వచ్చే క్యాన్సర్ రిస్క్ 20.3 శాతం.
మరోవైపు 10 శాతం మంది ప్రజలు వైన్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని పేర్కొన్నారు. మరో 2.2 శాతం మంది బీర్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని పేర్కొన్నారు. 1.7 శాతం మంది ప్రజలు ఆల్కహాల్ తాగడం వల్ల క్యాన్సర్ రిస్క్ తగ్గుతుందని భావిస్తున్నారు. కానీ 50 శాతం మందికి పైగా ఆల్కహాల్ క్యాన్సర్ ప్రమాదాన్ని ఎలా పెంచుతుందో తెలియదని అధ్యయనాలు చెబుతున్నాయి.
తక్కువ మొత్తంలో ఆల్కహాల్ సేవించినా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని అధ్యయనంలో తేలింది. మీరు ఎక్కువగా తాగితే ప్రయోజనం లేదు. అలాంటప్పుడు క్యాన్సర్ ఖాయం. మద్యపానం రొమ్ము క్యాన్సర్, అన్నవాహిక క్యాన్సర్ ప్రమాదాన్ని ఎక్కువగా పెంచుతుంది. వైన్, బీర్, ఏదైనా హార్డ్ లిక్కర్ ఈ ప్రమాదాన్ని కలిగి ఉంటాయి. 2020లో 3,865 మంది పెద్దలపై ఈ సర్వే నిర్వహించారు పరిశోధకులు. ఆల్కహాల్ పానీయాలు క్యాన్సర్‌తో సంబంధం కలిగి ఉన్నాయని ఈ సర్వేలో తేలింది.
నేషనల్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన పరిశోధకుడు విలియం ఎంపీ క్లీన్ మాట్లాడుతూ.. మద్యం సేవించడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ అంశాన్ని నొక్కి చెప్పాల్సిన అవసరం ఉందని, పెద్దలకు ఆల్కహాల్, క్యాన్సర్ ప్రమాదం గురించి పెద్దగా తెలియదు. ప్రజలలో మద్య పానీయాల డిమాండ్ పెరగడానికి ఇదే కారణం. అంతేకాకుండా క్యాన్సర్ ముప్పు కూడా పెరుగుతోంది. క్యాన్సర్ ప్రమాదాన్ని నివారించడానికి మీరు మద్యపానాన్ని వదులుకోవాలి. ఆరోగ్యకరమైన జీవనశైలి మీకు క్యాన్సర్ లేని జీవితాన్ని అందిస్తుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి