AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cow-Buffalo Milk: ఆవు-గేదె పాలను గుర్తించడం ఎలా..? రెండింటి మధ్య వ్యత్యాయం ఏంటి? ఎలాంటి ప్రయోజనాలు

పాలు సంపూర్ణ ఆహారం స్థితిని పొందింది. పాలు శరీరానికి పోషణనిచ్చి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అనేక వ్యాధులలో మన జీర్ణక్రియ సరిగా లేనప్పుడు..

Cow-Buffalo Milk: ఆవు-గేదె పాలను గుర్తించడం ఎలా..? రెండింటి మధ్య వ్యత్యాయం ఏంటి? ఎలాంటి ప్రయోజనాలు
Cow Buffalo Milk
Subhash Goud
|

Updated on: Dec 03, 2022 | 8:06 PM

Share

పాలు సంపూర్ణ ఆహారం స్థితిని పొందింది. పాలు శరీరానికి పోషణనిచ్చి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అనేక వ్యాధులలో మన జీర్ణక్రియ సరిగా లేనప్పుడు, వైద్యులు తినడానికి బదులుగా పాలు తాగాలని సిఫార్సు చేస్తారనే విషయం అందరికి తెలిసిందే. బిడ్డ పుట్టిన తర్వాత కొన్ని నెలల పాటు పాలతోనే బతుకుతుందంటే పాల ప్రాముఖ్యతను ఎంత ఉందో అర్థమైపోతుంటుంది. కొందరు వ్యక్తులు ఆవు, గేదె పాలపై చాలా మందికి ఎన్నో అనుమానాలుంటాయి. ఇందులో ఏ పాలు మంచివి.. ఏ పాలతో ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో అనే అనుమానాలుంటాయి. గేదె పాలు కొందరికి సరిపోవు. మరి కొంతమంది ఆవు పాలు తాగడానికి ఇష్టపడరు. ఇలాంటి వాటి గురించి తెలుసుకోవడానికి కొన్ని మార్గాలున్నాయి. అవేంటో చూద్దాం.

ఆవు – గేదె పాల మధ్య వ్యత్యాసం ఏమిటి?

గేదె పాలు, ఆవు పాల కంటే కాస్త మందంగా ఉంటాయి. ఆవు పాలలో కొవ్వు తక్కువగా ఉంటుంది. అందుకే దాని ఆకృతి కూడా తేలికగా ఉంటుందని గమనించాలి. మరోవైపు గేదె పాలలో కొవ్వు పరిమాణం ఎక్కువగా ఉంటుంది. మనం ఆవు, గేదె పాల రంగును పోల్చినట్లయితే గేదె పాల కంటే ఆవు పాలు పసుపు రంగులో ఉంటాయి. వేడిచేసినప్పుడు ఆవు పాలలో క్రీమ్ పలుచని పొర ఘనీభవిస్తుంది. అయితే గేదె పాలలోని మీగడ పొర ఆవు పాల కంటే మందంగా ఉంటుంది.

ఏ పాలు ఎక్కువ ప్రయోజనకరం:

ఆరోగ్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆవు-గేదె పాలు తాగడం గురించి అనేక సూచనలు ఇచ్చారు. మీ జీర్ణ శక్తి బలహీనంగా ఉంటే ఆవు పాలు మీకు ఉత్తమం. కానీ జీర్ణవ్యవస్థ బలంగా ఉంటే గేదె పాలు ప్రయోజనకరంగా ఉంటాయి. మీరు బరువు తగ్గాలనుకుంటే గేదె పాలకు దూరంగా ఉండంటం మంచిదంటున్నారు. రెండు పాలు బాగానే ఉన్నాయి.. కానీ మీరు వాటిని మీ ప్రాధాన్యత ఆధారంగా తాగవచ్చని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

ఇవి కూడా చదవండి

(గమనిక: అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యల పట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి