- Telugu News Photo Gallery Hug Benefits: Hugging your partners friends and relatives will boost your confidence in Telugu
Hug Benefits: ఇష్టమైన వారిని 10 నిమిషాలు కౌగిలించుకోవడం వల్ల ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా..?
జీవితం ఎన్నో ఒడి దుడుకులతోపాటు పలు సవాళ్లను విసురుతుంటుంది. సంతోషం, విచారం ఇలా అన్ని కలగలిపిన జీవితాన్ని ఆస్వాదించడం ఒక ఆర్ట్.. కొన్ని కష్ట సమయాల్లో మనం మన బంధువులు, స్నేహితులు లేదా సన్నిహితులతో కౌగిలించుకొని మన భావాలను వ్యక్తపరుస్తాము.
Updated on: Dec 01, 2022 | 9:38 PM

జీవితం ఎన్నో ఒడి దుడుకులతోపాటు పలు సవాళ్లను విసురుతుంటుంది. సంతోషం, విచారం ఇలా అన్ని కలగలిపిన జీవితాన్ని ఆస్వాదించడం ఒక ఆర్ట్.. కొన్ని కష్ట సమయాల్లో మనం మన బంధువులు, స్నేహితులు లేదా సన్నిహితులతో కౌగిలించుకొని మన భావాలను వ్యక్తపరుస్తాము. కౌగిలించుకోవడం మనకు భావోద్వేగ మద్దతునిస్తుంది. కొన్ని విషయాల్లో ఒకరినొకరు కౌగిలించుకోవడం ద్వారా మన ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.

కౌగిలింత అనేది ఒక ఆహ్లాదకరమైన అనుభూతి. అయితే దీని గురించి వెలువడిన అధ్యయనాన్ని చదివితే మీ మనసు కూడా పదే పదే కౌగిలించుకోవాలనిపిస్తుంది. అధ్యయనాల ప్రకారం.. మీకు అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తిని 20 సెకన్ల పాటు కౌగిలించుకోవడం వల్ల మీ అన్ని సమస్యలను పరిష్కరించుకోవచ్చట.. హగ్గింగ్ అనేది హ్యాపీ హార్మోన్లను విడుదల చేస్తుందని అధ్యయనం తెలిపింది. అవేంటో తెలుసుకుందాం..

ఆక్సిటోసిన్ : ప్రేమ హార్మోన్ అని పిలుస్తారు. ఇది మన ఒత్తిడిని తగ్గించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ హార్మోన్ మన గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.

డోపమైన్: ఇది చాలా మంచి పనులు చేయడానికి మన మెదడును ప్రేరేపించే రసాయన హార్మోన్.. రసాయన డోపమైన్ విడుదల అయినప్పుడు ఆనందం, శాంతి వంటి అనేక సానుకూల భావాలు కలుగుతాయి. ఇది ఏ వ్యక్తికైనా సంతృప్తిని ఇస్తుంది.

సెరోటోనిన్: సెరోటోనిన్ అనే హార్మోన్ మన ఒత్తిడి స్థాయిలను నియంత్రిస్తుంది. ఇది మంచి మానసిక స్థితిని ప్రోత్సహిస్తుంది. ఒంటరితనం భావాలను తగ్గిస్తుంది.

హగ్గింగ్ ప్రయోజనాలు: కౌగిలించుకోవడం ఒత్తిడిని తగ్గిస్తుంది. క్రమంగా మానసిక స్థితిని మెరుగుపరుస్తుందని పరిశోధనలు సూచిస్తున్నాయి.

నార్త్ కరోలినా విశ్వవిద్యాలయం నుండి జరిపిన ఒక అధ్యయనంలో పరస్పర కౌగిలింతలు హృదయ స్పందన రేటును సాధారణీకరిస్తాయి. 10 నిమిషాల పాటు చేతులు పట్టుకుని 20 సెకన్ల పాటు కౌగిలించుకోవడం వల్ల మీ రక్తపోటు స్థాయిలు గణనీయంగా తగ్గుతాయి. కౌగిలించుకోవడం వల్ల భయాన్ని కూడా తగ్గించుకోవచ్చు. ఒకరినొకరు కౌగిలించుకోవడం ఆందోళన, ఒత్తిడిని తగ్గించడానికి దోహదపడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.





























