Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

River fish vs Sea Fish: నది.. సముద్రం.. ఏ చేపలు హెల్త్‌ఫుల్.. ఫిష్ కొనేముందు తప్పక తెలుసుకోండి..

చేపల్లో ప్రొటీన్లు చాలా ఎక్కువగా ఉంటాయి. దీంతోపాటు కొవ్వు తక్కువగా ఉంటుంది. అందువల్ల, చేపలు అన్ని వయసుల వారికి తగిన ఆహారమని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.

River fish vs Sea Fish: నది.. సముద్రం.. ఏ చేపలు హెల్త్‌ఫుల్.. ఫిష్ కొనేముందు తప్పక తెలుసుకోండి..
River Fish Vs Sea Fish
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 01, 2022 | 3:33 PM

River fish vs Sea Fish: చేపలు.. చాలామంది మాంసాహార ప్రియులు ఇష్టంతో తింటారు. జలపుష్పాల్లో ఎన్నో పోషకాలు దాగున్నాయి. అందుకే చేపలను పోషకాలు కలిగిన మంచి ఆహారంగా పరిగణిస్తారు. చేపల్లో ప్రొటీన్లు చాలా ఎక్కువగా ఉంటాయి. దీంతోపాటు కొవ్వు తక్కువగా ఉంటుంది. అందువల్ల, చేపలు అన్ని వయసుల వారికి తగిన ఆహారమని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. చేపల్లో ఒమేగా 3-కొవ్వు ఆమ్లం, విటమిన్ డి, ఏలకు మంచి మూలంగా పేర్కొంటారు. ఒమేగా -3 ఫ్యాటీ ఆమ్లాలు గుండె పనితీరుకు, మానసిక అభివృద్ధికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అయితే, చేపలు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పెరుగుతాయి. సముద్రపు చేపలు, నదీ చేపలు, సరస్సు చేపలు మొదలైనవి.. వివిధ వాతావరణంలో, నీటి పరిస్థితులకు అనుగుణంగా పెరుగుతాయని పేర్కొంటున్నాయి. అయితే, అన్ని రకాల చేపలలో పోషకాలు మెండుగానే ఉంటాయని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నది చేపలు మంచివా..? సముద్రపు చేపలు మంచివా..? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

నది చేప VS సముద్ర చేప.. ఈ రెండింటి మధ్య తేడా ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

నది చేప: అన్ని నదుల చేపలు, సరస్సు చేపలు, చెరువులు, వాగులలో ఉండే చేపలు పురుగులు, కీటకాలను తినడం ద్వారా పెరుగుతాయి. అయితే, ఈ ఫ్యాటీ ఆమ్లం అనేది నది చేపలలో కనిపించదు. ముఖ్యంగా సముద్ర చేపలలో, పెద్ద చేపల కంటే చిన్న చేపలలో ఈ ఒమేగా-3 ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు, సార్డినెస్, మాకేరెల్ వంటి చేపలలో ఒమేగా-3 పుష్కలంగా ఉంటుంది. ఈ ఒమేగా-3 శరీర పెరుగుదలకు, ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది శరీరంలో రక్తం గడ్డకట్టకుండా చేస్తుంది. గుండె, మెదడు, కీళ్ల నొప్పులతో బాధపడేవారికి ఈ ఫ్యాటీ యాసిడ్ అద్భుతమైన ఔషధమని పేర్కొంటున్నారు. ఈ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ నుంచి చేప నూనె, చేప మాత్రలు కూడా తయారు చేస్తారు.

సముద్ర చేప: సముద్ర చేపలలో ఒమేగా-3 వంటి కొన్ని పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఎందుకంటే అవి సముద్రంలో పెరిగే సముద్రపు పాచిని తింటాయి. సముద్రపు పాచిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఉప్పు నీటిలో పెరిగే సముద్రపు చేపల శరీరంలో సోడియం ఎక్కువగా ఉంటుంది. ఇందులో క్యాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది. సముద్రపు చేపలు, చిన్నచేపలు, రొయ్యలు, సముద్రపు పాచిపై జీవించడం వల్ల గుండె, మెదడుకు మేలు చేసే ఆరోగ్యకరమైన ఒమేగా-3లు అధికంగా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

సముద్రపు చేపలు, నది లేదా చెరువు చేపలు.. రెండూ శరీరానికి అవసరమైన పోషకాలతో నిండి ఉన్నాయి. నది చేపలతో పోలిస్తే సముద్రపు చేపలు కొంచెం ఎక్కువ ఉప్పగా ఉంటాయి. అయితే, అవి ఆరోగ్యానికి ఎలాంటి హాని కలిగించవు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం..