AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భార్యాభర్తల మధ్య ఈ విషయాలు విషంతో సమానం.. నిర్లక్ష్యం చేస్తే బంధానికి బీటలు తప్పవు.. జాగ్రత్త

అచార్య చాణక్యుడు.. తన చాణక్య నీతి శాస్త్రంలో అన్ని రంగాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ఎలాంటి సందర్భాల్లో నిర్ణయాలు తీసుకోవాలి.. జీవితంలో ఉన్నతస్థాయికి ఎలా ఎదగాలి..? ఎలా వ్యవహరించాలి అనే విషయాలను క్లుప్తంగా బోధించాడు.

భార్యాభర్తల మధ్య ఈ విషయాలు విషంతో సమానం.. నిర్లక్ష్యం చేస్తే బంధానికి బీటలు తప్పవు.. జాగ్రత్త
Chanakya Neeti
Shaik Madar Saheb
|

Updated on: Nov 30, 2022 | 3:36 PM

Share

అచార్య చాణక్యుడు.. తన చాణక్య నీతి శాస్త్రంలో అన్ని రంగాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ఎలాంటి సందర్భాల్లో నిర్ణయాలు తీసుకోవాలి.. జీవితంలో ఉన్నతస్థాయికి ఎలా ఎదగాలి..? ఎలా వ్యవహరించాలి అనే విషయాలను క్లుప్తంగా బోధించాడు. అందుకే ఆచార్య ఆచార్య చాణక్యుడి బోధనలను నేటికీ చాలామంది అనుసరిస్తుంటారు. చాణక్య బోధనలను అనుసరించడం ద్వారా ఒక వ్యక్తి తన జీవితాన్ని విజయవంతం చేసుకోవచ్చు. ఈ విధానాలు గతంతో భవిష్యత్తును కూడా సూచిస్తాయి. ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రంలో వైవాహిక జీవితానికి సంబంధించిన అనేక విషయాలను కూడా ప్రస్తావించాడు. ఆచార్య చాణక్యుడు ప్రకారం.. భార్యాభర్తల సంబంధంలో కొన్ని విషయాలు ఎప్పటికీ రాకూడదు. ఇలాంటి విషయాలు భార్యాభర్తల మధ్య వస్తే వైవాహిక జీవితం చిన్నాభిన్నమవుతుందని చాణక్యుడు పేర్కొన్నాడు. అవేంటో తెలుసుకుందాం..

  1. సందేహం: ఆచార్య చాణక్యుడు ప్రకారం.. భార్యాభర్తల మధ్య సంబంధంలో ఎప్పుడూ సందేహం (అనుమానం) ఉండకూడదు. అనుమానం కారణంగా ఈ సంబంధం బలహీనంగా మారుతుంది. అనుమానం వల్ల భార్యాభర్తల మధ్య సంబంధాలు పూర్తిగా చెడిపోతాయి. ఇద్దరి సంబంధంలో సందేహం విషంలా పనిచేస్తుంది. భార్యాభర్తలు ఒకరిపై ఒకరు నమ్మకం కలిగి ఉండాలి కానీ.. అనుమానం ఉండకూడదని పేర్కొన్నాడు.
  2. అహం: భార్యాభర్తల మధ్య సంబంధంలో ఎప్పుడూ అహంభావం ఉండకూడదు. ఇది సంబంధానికి చాలా చెడ్డది. దానికి దూరంగా ఉండడం మంచిది. భార్యాభర్తల మధ్య అహంకారానికి ఎప్పటికీ చోటు ఉండకూడదు.
  3. అబద్ధాలు: భార్యాభర్తల మధ్య సంబంధంలో అబద్ధం ఉంటే.. అది సంబంధాన్ని మరింత దుర్భరంగా మారుస్తుంది. ఇది సంబంధాలను బలహీనపరుస్తుంది. అందుకే భార్యభర్తల సంబంధంలో అబద్ధాలకు తావు ఉండకూడదు. అబద్ధం చెప్పి తెలివి అనుకోవడం.. తెలివితక్కువతనం అని పేర్కొన్నాడు.
  4. అగౌరవం: భార్యాభర్తలు ఒకరినొకరు గౌరవించుకోవాలి. ఒకరినొకరు ఎప్పుడూ అగౌరవపరచుకోవద్దు. ఇది సంబంధాన్ని బలహీనపరుస్తుంది. అందుకే ఎవరికి వారు పరిమితుల్లో ఉండటం మంచిదని ఆచార్యుడు తెలిపాడు.
  5. ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..