AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Astrology Tips: ప్రతిరోజూ ఈ పని చేయండి.. మీ జీవితంలో ఆనందం, అదృష్టం తిష్టవేస్తుంది..!

రోజువారీ జీవితానికి సంబంధించిన ప్రత్యేక విషయాలు కూడా గురుడ పురాణంలో ప్రస్తావించబడ్డాయి. రోజు ఎలా ప్రారంభం కావాలి. అలా చేయకుంటే ఏమవుతుంది అనే విషయాలను వివరంగా చెప్పబడింది.

Astrology Tips: ప్రతిరోజూ ఈ పని చేయండి.. మీ జీవితంలో ఆనందం, అదృష్టం తిష్టవేస్తుంది..!
Garuda Purana
Jyothi Gadda
|

Updated on: Dec 01, 2022 | 9:30 PM

Share

మనకు మొత్తం 4 వేదాలు,18 మహాపురాణాలు వివరించబడ్డాయి. ఈ వేదాలు, పురాణాలలో జ్ఞానం, జీవిత సారాంశం దాగి ఉంటుందని చెబుతారు. గరుడ పురాణం కూడా 18 మహాపురాణాలలో ఒకటి. ఇది విష్ణువు, అతని వాహనం గరుడ (పక్షి) మధ్య జరిగిన సంభాషణను వివరిస్తుంది. మెరుగైన జీవితం గడపడం, మరణం, మరణానంతర సంఘటనలను వివరిస్తుంది. దీనితో పాటు రోజువారీ జీవితానికి సంబంధించిన ప్రత్యేక విషయాలు కూడా గురుడ పురాణంలో ప్రస్తావించబడ్డాయి. రోజు ఎలా ప్రారంభం కావాలి. అలా చేయకుంటే ఆ రోజు అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. ఇలాంటి పనులను క్రమం తప్పకుండా చేయడం ద్వారా ఒక వ్యక్తి రోజంతా శుభప్రదంగా ఉంటాడని, మీరు అనేక సమస్యల నుండి బయటపడి సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారని పురాణాలు చెబుతున్నాయి. వీటిని పాటించడం ద్వారా జీవితంలో ఆనందం మీ వెంటే ఉంటుంది. ఆనందంతో పాటు అదృష్టం పెరుగుతుంది. ఈ పనులు చేయడం ద్వారా మాత్రమే ఒక వ్యక్తి మరణానంతరం మోక్షాన్ని పొందుతాడు.

అన్నదానం.. అన్నదానం చేయడాన్ని మనిషి జీవితంలో అతి పెద్ద పుణ్యం అంటారు. గరుడ పురాణం ప్రకారం.. మీరు ప్రతిరోజూ ఆకలితో ఉన్నవారికి, పేదలకు మీ సామర్థ్యాన్ని బట్టి ఆహారం దానం చేస్తే, మీ పుణ్యకార్యాలు పెరుగుతాయి. దానం చేయడం వల్ల కుటుంబంలో ఆశీర్వాదాలు ఉంటాయి.

ద్యానం.. వ్యక్తి చింత లేకుండా ఉండాలని అంటారు. ఎందుకంటే ధ్యానం మీ శరీరం, మనస్సుపై ప్రభావం చూపుతుంది. కానీ గరుడ పురాణం ప్రకారం, ధ్యానం అంటే జపం. ఒక వ్యక్తి ప్రతిరోజూ కొంత సమయం పాటు ప్రశాంతమైన మనస్సుతో ధ్యానం చేయాలి. దీంతో మనసుకు ప్రశాంతత లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

దేవుడికి నైవేద్యం.. కొందరు ఆహారం వండిన తర్వాత స్వయంగా భోజనం వడ్డించి తినడం ప్రారంభిస్తారు. కానీ గరుడ పురాణంలో ఏం చెబుతున్నారంటే..ఇంట్లో చేసిన ఆహారాన్ని ముందుగా దేవుడికి సమర్పించాలి. దీని వల్ల ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం నిలిచి అన్నపూర్ణ నివసిస్తుంది. కానీ, ఎల్లప్పుడూ దేవునికి స్వచ్ఛమైన ఆహారాన్ని సమర్పించాలని గుర్తుంచుకోండి.

గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం కేవలం మత విశ్వాసాలు, ప్రజల నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. జ్యోతిష్య పండితులు తెలిపిన వివరాల ప్రకారం ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి