AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Children Health Care: పిల్లలు పళ్ళు మింగితే ఏమవుతుంది..? ఏం చేయాలి.. తల్లిదండ్రుల ఆందోళనకు నిపుణుల సూచన..!

ఊడిపోతున్న పాల పళ్లను చేతితో తాకుతూ ఉంటారు పిల్లలు. అలాగే ఒక్కోసారి అలా ఊడిపోయిన పళ్లతో ఆడుకోవడం, తెలియకుండా మింగడం వంటివి చేస్తుంటారు. అలా తెలియకుండానే పిల్లలు పాల పళ్ళు మింగినప్పుడు

Children Health Care: పిల్లలు పళ్ళు మింగితే ఏమవుతుంది..? ఏం చేయాలి.. తల్లిదండ్రుల ఆందోళనకు నిపుణుల సూచన..!
Tooth
Jyothi Gadda
|

Updated on: Dec 01, 2022 | 9:41 PM

Share

పిల్లలు సాధారణంగా 5-6 సంవత్సరాల వయస్సు వచ్చేసరికి పాల పళ్ళు రాలిపోతాయి. ఆ తర్వాత శాశ్వత దంతాలు వస్తాయి. ఆ వయసులో పిల్లలకు తిండి, చదువు కంటే ఆటలే ఎక్కువ. ఊడిపోతున్న పాల పళ్లను చేతితో తాకుతూ ఉంటారు పిల్లలు. అలాగే ఒక్కోసారి అలా ఊడిపోయిన పళ్లతో ఆడుకోవడం, తెలియకుండా మింగడం వంటివి చేస్తుంటారు. అలా తెలియకుండానే పిల్లలు పాల పళ్ళు మింగినప్పుడు ఏమి జరుగుతుందోనని ఆందోళన చెందుతుంటారు తల్లిదండ్రులు. అలా మింగితే ఏమవుతుందో ఇక్కడ తెలుసుకుందాం..

దంతాలు సాధారణంగా జీర్ణం అయినప్పుడు, పదునైన వస్తువులతో సహా దాదాపు వాళ్లు మింగేసిన అన్ని వస్తువులు జీర్ణవ్యవస్థ గుండా ఏమాత్రం హాని కలిగించకుండా వెళతాయని నేషనల్ హెల్త్ సర్వీస్ నివేదించింది. ఒక పదార్ధం జీర్ణవ్యవస్థ, ఇరుకైన భాగం గుండా వెళుతున్నప్పుడు అన్నవాహిక కడుపులో కలుస్తుంది. యూరోపియన్ సొసైటీ ఆఫ్ గ్యాస్ట్రోఇంటెస్టినల్ ఎండోస్కోపీ ఇది ఇబ్బంది లేకుండా వెళుతుందని పేర్కొంది.

పిల్లలు ఆహారం మింగడంలో ఇబ్బంది పడుతున్నప్పుడు మాత్రం తల్లిదండ్రులు తప్పక వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది. మెడ లేదా ఛాతీ నొప్పి, వాంతులు, మలంలో రక్తం, కడుపు నొప్పి, పంటిని మింగిన తర్వాత జ్వరం ఉంటే, మీరు వైద్యుడిని సంప్రదించాలి. ఎండోస్కోపీ చేయాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

దంతాలు వదులుగా ఉండి, వచ్చేస్తాయనుకుంటే.. మీరే వాటిని సులభంగా బయటకు తీసేయాలి. లేదంటే, ఊడిపోతున్న పళ్లను గురించి పిల్లలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలి. వాటిని మింగకుండా జాగ్రత్తలు సూచించాలి. ఏదైనా తినేటప్పుడు లేదా కొరికేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని వారికి సూచించండి.బ్రష్ చేసేటప్పుడు వదులుగా ఉన్న పళ్లపై ఒత్తిడితో బ్రష్ చేయకపోవడమే మంచిది.

ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి