ఘోర ప్రమాదం.. బస్సును ఢీకొట్టిన ట్రక్కు.. ఆరుగురు మృతి, 15మందికి గాయాలు

లారీ కోసం గాలిస్తున్నారు. ట్రక్కును గుర్తించేందుకు సమీపంలోని దాబాల వద్ద అమర్చిన సీసీటీవీ కెమెరాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. డ్రైవర్ ట్రక్కుతో పరారయ్యాడు.

ఘోర ప్రమాదం.. బస్సును ఢీకొట్టిన ట్రక్కు.. ఆరుగురు మృతి, 15మందికి గాయాలు
Road Accident
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 30, 2022 | 10:25 AM

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బహ్రైచ్‌లోని తప్పే సిపా ప్రాంతంలో బస్సు, ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ దుర్ఘటనలో 15 మంది గాయపడ్డారు. బుధవారం తెల్లవారుజామున హైవేపై ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. జర్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఘర్ఘరా ఘాట్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. పొగమంచు కారణంగా రోడ్డు కనిపించకపోవడంతో ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు.

లక్నో-బహ్రైచ్ హైవేపై ట్రక్కు బస్సును ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, 15 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారందరినీ సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిని లక్నో ట్రామా సెంటర్‌లో చేర్పించారు. ఈరోజు తెల్లవారుజామున 4.30 గంటలకు లక్నోలోని ఈద్గా డిపో సమీపంలో పొగమంచు కారణంగా వేగంగా వచ్చిన ట్రక్కు బస్సును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

లక్నో నుంచి బహ్రైచ్ వెళ్తుండగా బస్సు ప్రమాదానికి గురైంది.. ప్రమాదం అనంతరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని లారీ కోసం గాలిస్తున్నారు. ట్రక్కును గుర్తించేందుకు సమీపంలోని దాబాల వద్ద అమర్చిన సీసీటీవీ కెమెరాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. డ్రైవర్ ట్రక్కుతో పరారయ్యాడు. అతని కోసం గాలిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా బహ్రైచ్ రోడ్డు ప్రమాదంలో ప్రాణనష్టం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను పరామర్శించి, ప్రమాదంలో గాయపడిన వారికి తగు చికిత్స అందించాలని జిల్లా కలెక్టర్‌, పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు.

మరిన్ని జాతీయ వార్తల  కోసం ఇక్కడ క్లిక్ చేయండి