AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Savings: పొదుపు చేసేందుకు ఎన్నో మార్గాలు.. అత్యంత ప్రాచుర్యం పొందినవి ఇవే.. ఎవరికి ఏది బెటరంటే..

ప్రతి వ్యక్తి తన ఆదాయంలో కొంత భాగాన్ని పొదుపు చేయాల్సిన అనివార్య పరిస్థితులు నేడు ఏర్పడ్డాయి. నేడు మనం చేసే పొదుపు రేపటి మన ఆర్థిక అవసరాలను తీర్చే నిధి అనడంలో ఎటువంటి సందేహం లేదు. అందుకే జీవితంలో పొదుపునకు..

Savings: పొదుపు చేసేందుకు ఎన్నో మార్గాలు.. అత్యంత ప్రాచుర్యం పొందినవి ఇవే.. ఎవరికి ఏది బెటరంటే..
Fixed Deposit
Amarnadh Daneti
|

Updated on: Nov 30, 2022 | 9:40 AM

Share

ప్రతి వ్యక్తి తన ఆదాయంలో కొంత భాగాన్ని పొదుపు చేయాల్సిన అనివార్య పరిస్థితులు నేడు ఏర్పడ్డాయి. నేడు మనం చేసే పొదుపు రేపటి మన ఆర్థిక అవసరాలను తీర్చే నిధి అనడంలో ఎటువంటి సందేహం లేదు. అందుకే జీవితంలో పొదుపునకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. పొదుపు చేయడం కోసం ఎన్నో పథకాలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ పొదుపు విషయంలో ప్రజల ఆలోచనా తీరు.. ప్రాంతం, చుట్టుపక్కల ప్రజల ప్రభావంపై ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ఎవరైనా చూసుకునేది తమ డబ్బులు సురక్షితంగా ఉండటంతో పాటు.. మంచి వడ్డీ రేటు లభించడం లేదా, తక్కువ కాలంలో తమ డబ్బు విలువ పెరిగే పథకాలపై సామాన్య ప్రజలు ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. ఇదే సమయంలో కొంతమంది తమ డబ్బులు పరిమితి కాలంలో రెట్టింపు అవుతాయనే దురాశతో.. కొన్ని నకిలీ పథకాల్లో పెట్టుబడులు పెట్టి తమ డబ్బులు నష్టపోయిన ఘటనలు ఎన్నో చూశాం. అందుకే పొదుపు చేసే ముందు ఏ పథకంలో చేస్తున్నాం. ఆ పథకంలో మన డబ్బులు సురక్షితమో కాదో పూర్తి వివరాలు తెలుసుకోవల్సి ఉంటుంది.

ప్రావిడెంట్ ఫండ్

ప్రతీ నెల జీతంతో పాటూ జమ అయ్యే ప్రావిడెంట్ ఫండ్ వ్యక్తి యొక్క దీర్ఘకాలిక అవసరాలకు బాగా ఉపయోగపడుతుంది. ఉద్యోగి తరఫున జమ అయ్యే ప్రావిడెంట్ ఫండ్ (ఈపీయఫ్) వార్షిక మొత్తం రెండున్నర లక్షలు దాటితే దాని మీద టాక్స్ కట్టాలనే నియమం కొత్తగా వచ్చింది. ఈ నియమాన్ని పరిగణలోకి తీసుకున్నా, ప్రావిడెంట్ ఫండ్ అనేది ఉద్యోగికి చాలా మంచి అవకాశం. డబ్బులు ఉద్యోగి చేతిలోకి రాకుండా నేరుగా జమ కావడం వల్ల ప్రత్యేకంగా పొదుపు చేయాల్సిన అవసరం లేకుండా తన పిఎఫ్ ఖాతాలోకి జమ అవుతుంది. ఇలా జమ అయ్యే భవిష్యత్ నిధి కొన్ని ప్రత్యేక అవసరాలకు మాత్రమే వాడుకోవచ్చు. ప్రస్తుతం ప్రాఫిడెంట్ ఫండ్‌పై వడ్డీ 8శాతానికి పైగా ఉంది.

ఫిక్స్‌డ్ డిపాజిట్

ఒక నిర్ణీత సమయానికి మన డబ్బును బ్యాకులో డిపాజిట్ చేసి.. దానిపై వడ్డీ పొందటమే ఫిక్స్‌డ్ డిపాజిట్. చాలా ప్రాచుర్యం పొందిన పొదుపు పథకాల్లో ఇదొకటి. బ్యాంకు ఇచ్చే వడ్డీ రేట్లు తక్కువగా ఉండటం, ఆ వడ్డీ మీద కూడా టాక్స్ కట్టాల్సి రావడం, ఏదైనా అవసరం వచ్చి నిర్ణీత సమయం కంటే ముందే డబ్బు తీసుకోవాలంటే పెనాల్టీ కట్టాలనే నియమం ఉండటం వల్ల ప్రస్తుతం ఫిక్సడ్ డిపాజిట్ పథకంపై పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. కానీ నిర్ణీత సమయానికి ఫలానా మొత్తం కచ్చితంగా కావాలంటే ఫిక్సడ్ డిపాజిట్ ఒక మంచి మార్గమే అవుతుంది.

ఇవి కూడా చదవండి

స్టాక్ మార్కెట్

పొదుపు చేయాలనుకునే వారికి మరో ఎంపిక స్టాక్ మార్కెట్. అయితే వీటిలో రిస్క్‌తో కూడుకున్నవి, పెద్దగా రిస్క్ లేనివి కూడా ఉంటాయి. ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్, షేర్లు, ఫ్యుచర్స్ అండ్ ఆప్షన్స్ ఇలా అనేక రకాలైన పొదుపు మార్గాలు స్టాక్ మార్కెట్లో ఉన్నాయి. అన్నింటి మీద ఏదో ఒక రకమైన టాక్స్ కట్టాలనే నియమం ఉండటం వల్ల మదుపు చేసే వాళ్ళు తమ అవసరాలకు అనుగుణంగా మార్గాలను ఎంచుకోవాలి. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి రిస్క్‌తో కూడుకున్నదని ఎక్కువుగా వింటుంటా. కానీ క్రమశిక్షణతో కూడిన మదుపు చేస్తూ స్టాక్ మార్కెట్ ద్వారా తమ ఆర్థిక లక్ష్యాలను అందుకున్నవారు ఉన్నారనే విషయం గుర్తించుకోవాలి.

రియల్ ఎస్టేట్

స్థిర, చర ఆస్తులపై పెట్టుబడి పెట్టడం పొదుపులో మరో ఎంపిక. భవిష్యత్తులో భూమికి గిరాకి పెరుగుతుందనే ఒకే ఒక్క ఆశతో రియల్ ఎస్టేట్ రంగం నడుస్తుంది. గతంలో రియల్ ఎస్టేట్ రంగంలో మదుపు చేసి లాభాలు అర్జించిన వారు ఎందరో ఉన్నారు. కానీ, గత కొన్ని సంవత్సరాలుగా ఈ రంగంలో వృధ్ధి పెద్దగా కనిపించడం లేదు. దీనికి తోడు కోవిడ్ సంక్షోభం ఈ రంగాన్ని బాగా ప్రభావితం చేస్తోంది. ఇటీవల కాలంలో మళ్లీ రియాల్టీ రంగం కొంత వేగం పుంజుకుంటోంది. దీనిలో పెట్టుబడి పెట్టేటప్పుడు ఆచీతూచీ అడుగులు వేయడం మంచింది.

Follow Us