AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: శరీరంలో కొవ్వును కరిగించే పండ్లు.. వీటిని తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..

శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణం పెరగడం వల్ల అనేక వ్యాధులు దరిచేరుతాయి. ఈ పరిస్థితిలో చాలా మంది కరిగించుకోవడానికి ప్రయత్నిస్తారు. వాస్తవానికి కొలెస్ట్రాల్ అంటే ఏమిటి.. కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించాలంటే..

Health Tips: శరీరంలో కొవ్వును కరిగించే పండ్లు.. వీటిని తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..
Fruties
Amarnadh Daneti
|

Updated on: Nov 28, 2022 | 8:00 AM

Share

శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణం పెరగడం వల్ల అనేక వ్యాధులు దరిచేరుతాయి. ఈ పరిస్థితిలో చాలా మంది కరిగించుకోవడానికి ప్రయత్నిస్తారు. వాస్తవానికి కొలెస్ట్రాల్ అంటే ఏమిటి.. కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. కొలెస్ట్రాల్ అనేది రక్తంలో కనిపించే మైనపు పదార్థం. ఆరోగ్యకరమైన కణాలను నిర్మించడానికి ఇది అవసరం. అయితే ఇది అధిక మొత్తంలో ఉంటే గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. రక్త నాళాలలో పేరుకుపోతుంది. దీనివల్ల గుండె ధమనుల నుంచి రక్తం తగినంత మొత్తంలో ప్రవహించడం కష్టమవుతుంది. కొన్నిసార్లు ఇది గడ్డకడుతుంది. దీనివల్ల గుండెపోటు లేదా స్ట్రోక్ వస్తుంది. అయితే కొన్ని పండ్లని తినడం ద్వారా కొలెస్ట్రాల్‌ స్థాయి అదుపులో ఉంటుంది.

బొప్పాయి

బొప్పాయి తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయి అదుపులో ఉంటుంది. ఇందులో ప్రోటీన్, కాల్షియం, ఫాస్పరస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఐరన్ కూడా అధికంగా ఉంటుంది.

స్ట్రాబెర్రీ

స్ట్రాబెర్రీ రుచిలో చాలా బాగుంటుంది. వీటిని డైట్‌లో చేర్చుకుంటే చాలా మంచిది. స్ట్రాబెర్రీలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, ఫోలేట్, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

ఆపిల్

రోజూ ఒక యాపిల్ తింటే వైద్యుడి అవసరంలేదని అంటారు. యాపిల్స్ తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ రిస్క్ చాలా వరకు తగ్గుతుంది. యాపిల్స్ లో విటమిన్ ఎ, విటమిన్ సి, పొటాషియం, ఫైబర్, కార్బోహైడ్రేట్లు ఉంటాయి.

ద్రాక్ష

ద్రాక్ష శరీరం నుంచి చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. ఇందులో ఫైబర్, ప్రొటీన్, ఐరన్, కాపర్, ఫోలేట్, విటమిన్లు సి, ఎ, కె, బి వంటి పోషకాలు ఉంటాయి.

బేరిపండ్లు

రోజూ బేరిపండ్లను తింటే కొలెస్ట్రాల్ స్థాయి అదుపులో ఉంటుంది. ఇందులో తగినంత మొత్తంలో ప్రోటీన్లు, విటమిన్లు, కాల్షియం, ఐరన్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్ ఉంటాయి.

నిమ్మకాయ

వేసవిలో నిమ్మకాయను ఏ రూపంలో తీసుకున్నా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. విటమిన్ ఎ, విటమిన్ బి6, విటమిన్ సి, విటమిన్ ఈ, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్ వంటి అనేక పోషకాలు నిమ్మకాయలో లభిస్తాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..