Gujarat Elections 2022: ప్రజాకర్షక హామీలతో బీజేపీ మేనిఫెస్టో విడుదల.. అన్ని వర్గాలను ఆకట్టుకునేలా ప్లాన్..

గుజరాత్‌ శాసనసభ ఎన్నికల సమయం సమీపిస్తోంది. మరో ఐదు రోజుల్లో తొలివిడత పోలింగ్ జరగనుంది. దీంతో అన్ని రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకట్టుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. దీనిలో భాగంగా ప్రజాకర్ష హామీలతో..

Gujarat Elections 2022: ప్రజాకర్షక హామీలతో బీజేపీ మేనిఫెస్టో విడుదల.. అన్ని వర్గాలను ఆకట్టుకునేలా ప్లాన్..
Bjp Manifesto
Follow us

|

Updated on: Nov 26, 2022 | 5:42 PM

గుజరాత్‌ శాసనసభ ఎన్నికల సమయం సమీపిస్తోంది. మరో ఐదు రోజుల్లో తొలివిడత పోలింగ్ జరగనుంది. దీంతో అన్ని రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకట్టుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. దీనిలో భాగంగా ప్రజాకర్ష హామీలతో ఎన్నికల మేనిఫెస్టోలను పార్టీలు రూపొందించాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అనేక ఉచిత హామీలతో తన ఎన్నికల ప్రణాళికను విడుదల చేయగా, తాజాగా బీజేపీ తన మేనిఫెస్టోను విడుదల చేసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గాంధీనగర్‌లోని రాష్ట్ర కార్యాలయంలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు కోసం పార్టీ మేనిఫెస్టోను విడుదల చేయడానికి ముందు వీడియోను రిలీజ్ చేశారు. అంతకుముందు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఆయన దేశ రాజ్యాంగ ప్రతిపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నడ్డా మాట్లాడుతూ.. రాజ్యాంగానికి సంబంధించి అంకితభావం ఉన్నవాళ్లమని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ పాలనలో గుజరాత్ నిరంతరం అభివృద్ధి చెందుతోందన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి బీజేపీ మాత్రమే చేయగలదని, వివక్షకు తావులేకుండా అన్ని వర్గాల అభ్యున్నతి, అభివృద్ధికి తమ పార్టీ కృషి చేస్తుందన్నారు. కాగా బీజేపీ గుజరాత్ రాష్ట్ర శాఖ అధ్యక్షులు సీఆర్ పాటిల్ మాట్లాడుతూ.. మేనిఫెస్టోను రూపొందించడానికి గుజరాత్‌లోని కోటి మందికి పైగా ప్రజల నుంచి అభిప్రాయాన్ని తీసుకున్నట్లు తెలిపారు. దీని కోసం ఒక వాట్సాప్ నంబర్‌ ద్వారా గుజరాత్‌లోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న పౌరులు, విద్యార్థులు, రైతులు, వ్యాపారులు తదితరుల అభిప్రాయాలను తీసుకున్నామన్నారు. ఆ తర్వాతే అధిష్టానం మేనిఫెస్టోను సిద్ధం చేసిందని తెలిపారు.

యూనిఫాం సివిల్‌ కోడ్‌తో పాటు ఐదేళ్ల కాలంలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని బీజేపీ తన మేనిఫెస్టోలో పేర్కొంది.  రాడికలైజేషన్ సెల్, పబ్లిక్ , ప్రైవేట్ ప్రాపర్టీస్ డ్యామేజెస్ రికవరీ యాక్ట్ తీసుకవస్తామని హామీ ఇచ్చింది.  ఉగ్రవాద సంస్థలు, భారత వ్యతిరేక శక్తుల స్లీపర్ సెల్స్ ,సంభావ్య బెదిరింపులను గుర్తించడానికి, తొలగించడానికి తాము యాంటీ-రాడికలైజేషన్ సెల్‌ను రూపొందిస్తామని,  మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజల ఆస్తులకు నష్టం కలిగించే చట్టాన్ని  రూపొందిస్తామని బీజేపీ తన ఎన్నికల ప్రణాళికలో పేర్కొంది.

ఎన్నికల మేనిఫెస్టోలో ప్రధానాంశాలు

గుజరాత్‌లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన

ఇవి కూడా చదవండి

రాష్ట్రంలో బాలికలకు ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటీలు

వ్యవసాయాభివృద్ధికి రూ.10,000 కోట్ల రూపాయల కేటాయింపు

నీటిపారుదల నెట్‌వర్క్‌ కోసం 25 వేల కోట్ల రూపాయలు వ్యయం

ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన కింద ప్రతి కుటుంబానికి ఉచిత చికిత్స కోసం అందుతున్న మొత్తాన్ని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంపు

దక్షిణ గుజరాత్, సౌరాష్ట్రలో రెండు సీఫుడ్ పార్కుల ఏర్పాటు

వచ్చే ఐదేళ్లలో గుజరాత్‌లోని లక్ష మంది మహిళలకు ఉపాధి

ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.500 కోట్ల అదనపు బడ్జెట్‌తో గోశాలల బలోపేతం

అదనంగా 1,000 సంచార పశువైద్య యూనిట్ల ఏర్పాటు

భారతదేశపు మొట్టమొదటి బ్లూ ఎకానమీ ఇండస్ట్రియల్ కారిడార్‌ నిర్మాణం

ఫిషింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ బలోపేతం

శ్రామిక్ క్రెడిట్ కార్డ్, రూ.2 లక్షల వరకు రుణం

2036లో ఒలింపిక్ క్రీడలను నిర్వహించే లక్ష్యంతో గుజరాత్ ఒలింపిక్స్ మిషన్‌ను ప్రారంభించి.. ప్రపంచ స్థాయి క్రీడా మౌలిక సదుపాయాలను కల్పించడం

56 ట్రైబల్ సబ్ ప్లాన్ తాలూకాలో మొబైల్ వాహనాల ద్వారా రేషన్ డెలివరీ

గిరిజనుల సర్వతోముఖ సామాజిక-ఆర్థిక అభివృద్ధికి వనబంధు కళ్యాణ్ యోజన 2.0 కింద రూ. లక్ష కోట్ల ఖర్చు

8 మెడికల్ కాలేజీలు ,  10 నర్సింగ్, పారా మెడికల్ కాలేజీల ఏర్పాటు  ద్వారా గిరిజన ప్రాంతాల్లో అత్యాధునిక ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు కల్పించడం

KG నుండి PG వరకు బాలికలకు ఉచితంగా నాణ్యమైన విద్య

రాష్ట్రంలో మహిళా సీనియర్ సిటిజన్లకు ఉచిత బస్సు ప్రయాణం

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..