Health Kits to girls: తెలంగాణ విద్యార్థినుల‌కు ఉచితంగా 33 ల‌క్షల హెల్త్ కిట్లు.. పంపిణీకి సర్కార్ ఏర్పాట్లు

తెలంగాణ రాష్ట్రంలో వైద్యారోగ్య రంగాన్ని ప‌టిష్టం చేస్తున్న రాష్ట్ర సర్కార్, విద్యార్థినుల ఆరోగ్య సంర‌క్షణ కోసం చర్యలు చేపట్టింది. ఈ సంవ‌త్సరం బ‌డ్జెట్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్న విధంగా ప్రభుత్వ పాఠ‌శాలు, క‌ళాశాలల్లో ఉచితంగా..

Health Kits to girls: తెలంగాణ విద్యార్థినుల‌కు ఉచితంగా 33 ల‌క్షల హెల్త్ కిట్లు.. పంపిణీకి సర్కార్ ఏర్పాట్లు
Adolescent Health Kits to girl students
Follow us

|

Updated on: Nov 18, 2022 | 10:29 AM

తెలంగాణ రాష్ట్రంలో వైద్యారోగ్య రంగాన్ని ప‌టిష్టం చేస్తున్న రాష్ట్ర సర్కార్, విద్యార్థినుల ఆరోగ్య సంర‌క్షణ కోసం చర్యలు చేపట్టింది. ఈ సంవ‌త్సరం బ‌డ్జెట్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్న విధంగా ప్రభుత్వ పాఠ‌శాలు, క‌ళాశాలల్లో ఉచితంగా అడోలసెంట్ హెల్త్‌ కిట్ల (శానిట‌రీ హైల్త్ అండ్ హైజెనిక్ కిట్లు) పంపిణీకి ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకు గాను మొత్తం రూ. 69.52 కోట్లతో అడ‌లోసెంట్ హెల్త్‌ కిట్ల కొనుగోలు, పంపిణీ కోసం ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు హెల్త్ సెక్రెటరీ రిజ్వీ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠ‌శాల‌ల్లో, జూనియ‌ర్ క‌ళాశాలల్లోని 8 నుంచి 12వ త‌ర‌గ‌తి చ‌దువుతున్న దాదాపు 11 ల‌క్షల మంది విద్యార్థినుల‌కు ల‌బ్ధి చేకూర‌నున్నది.

ఈ ఆర్థిక సంవ‌త్సరంలో మిగిలిన ఆరు నెల‌ల కోసం11 ల‌క్షల కిట్లు కొనుగోలు చేయ‌నున్నది. ఈ కిట్‌లో ఆరు శానిట‌రీ న్యాప్‌కిన్ ప్యాక్స్‌, వాట‌ర్ బాటిల్‌, ఒక బ్యాగ్ ఉంటాయి. 2023-24 ఆర్థిక సంవ‌త్సరానికి గాను మొత్తం 22 ల‌క్షల కిట్లు కొనుగోలు చేయ‌నుంది. ఈ కార్యక్రమం అమ‌లు చేస్తామ‌ని ప్రభుత్వం ఈ ఏడాది బ‌డ్జెట్‌లో ప్రక‌టించిన విషయం తెలిసిందే. నాటి వాగ్దానాన్ని ప్రస్తుతం అమ‌లు చేస్తోంది.

జాతీయ కుటుంబ ఆరోగ్య స‌ర్వే-5 ప్రకారం..15-24 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సున్న యువ‌తుల్లో సుమారు 32 శాతం మంది న్యాప్‌కిన్ లాగా క్లాత్ వినియోగిస్తున్నారు. దీంతో గ‌ర్భాశ‌య, మూత్రకోశ సంబంధ ఇన్‌ఫెక్షన్లు వ‌స్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం హెల్త్ అండ్ హైజెనిక్ కిట్లు పంపిణీ చేయాల‌ని నిర్ణయించింది. 14 నుంచి 19 సంవ‌త్సరాల వ‌య‌స్సున్న కౌమ‌ర బాలిక‌లు రుతుక్రమం (పీరియడ్‌) స‌మ‌యంలో శుభ్రత పాటించేందుకు ఇవి ఉప‌యోగ‌ప‌డగాయి. దీంతో వారు ఆరోగ్యవంతంగా ఉండేందుకు, త‌ద్వారా చ‌దువుపై మ‌రింత శ్రద్ధ చూపించేందుకు అవ‌కాశం ఉంటుంది. విద్యార్థినుల హాజ‌రు శాతం కూడా పెరిగేందుకు తోడ్పడుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..