AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SAIL Recruitment 2022: టెన్త్‌/ఇంటర్‌ అర్హతతో.. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 259 ఉద్యోగాలు.. రూ.2 లక్షలకుపైగా జీతం..

భారత ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వ శాఖకు చెందిన భిలాయ్ లోని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌.. 259 సీనియర్‌ కన్సల్టెంట్‌, కన్సల్టెంట్‌/సీనియర్‌ మెడికల్ ఆఫీసర్‌, మెడికల్ ఆఫీసర్‌, డిప్యూటీ మేనేజర్‌, అసిస్టెంట్‌ మేనేజర్ తదితర పోస్టుల భర్తీకి..

SAIL Recruitment 2022: టెన్త్‌/ఇంటర్‌ అర్హతతో.. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 259 ఉద్యోగాలు.. రూ.2 లక్షలకుపైగా జీతం..
SAIL Bhilai Recruitment 2022
Srilakshmi C
|

Updated on: Nov 17, 2022 | 6:56 AM

Share

భారత ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వ శాఖకు చెందిన భిలాయ్ లోని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌.. 259 సీనియర్‌ కన్సల్టెంట్‌, కన్సల్టెంట్‌/సీనియర్‌ మెడికల్ ఆఫీసర్‌, మెడికల్ ఆఫీసర్‌, డిప్యూటీ మేనేజర్‌, అసిస్టెంట్‌ మేనేజర్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. హైడ్రాలిక్స్‌ మెయింటనెన్స్‌, జనరల్‌ మెడిసిన్‌, సైకియాట్రీ, ఈఎన్‌టీ, ఎలక్ట్రికల్‌, కెమికల్‌, మెకానికల్‌ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి పోస్టును బట్టి పదో తరగతి, సంబంధిత స్పెషలైజేషన్‌లో డిప్లొమా/ఐటీఐ/బీఈ/బీటెక్‌/ఎంబీబీఎస్‌/డీఎం/డీఎన్‌బీ/ఎంసీహెచ్‌/పీజీ డిగ్రీ/మాస్టర్స్‌ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో కనీసం 65 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు 28 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.

ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ విధానంలో డిసెంబర్‌ 17, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 26వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. దరఖాస్తు సమయంలో మెడికల్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు రూ.500, పారామెడికల్ స్టాఫ్‌ పోస్టులకు రూ.250 అప్లికేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/ఈఎస్ఎమ్‌ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. రాత పరీక్ష/ఇంటర్వ్యూ/స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. అర్హత సాధించిన వారికి నెలకు రూ.25,070ల నుంచి రూ.2.4 లక్షల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు..

  • సీనియర్‌ కన్సల్టెంట్‌ పోస్టులు: 2
  • కన్సల్టెంట్‌/సీనియర్‌ మెడికల్ ఆఫీసర్‌ పోస్టులు: 8
  • మెడికల్ ఆఫీసర్‌ పోస్టులు: 6
  • డిప్యూటీ మేనేజర్‌ పోస్టులు: 2
  • అసిస్టెంట్‌ మేనేజర్ పోస్టులు: 22
  • మైన్స్‌ ఫోర్‌మెన్‌ పోస్టులు: 16
  • సర్వేయర్‌ పోస్టులు: 4
  • ఆపరేటర్‌ కమ్‌ టెక్నీషియన్‌ పోస్టులు: 79
  • మైనింగ్‌ మేట్‌ పోస్టులు: 17
  • బ్లాస్టర్‌ పోస్టులు: 17
  • అటెండెంట్‌ కమ్‌ టెక్నీషియన్‌ పోస్టులు: 78
  • ఫైర్‌మ్యాన్‌ కమ్‌ ఫైన్‌ ఇంజనీరింగ్‌ డ్రైవర్‌ పోస్టులు: 8

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?