Ear wax: కాటన్ బర్డ్స్‌తో చెవులను శుభ్రం చేయొచ్చా? చేయకూడదా? నిపుణుల సలహా ఇదే..
మన శరీరంలోని అత్యంత సున్నితమైన అవయవాలలో ఒకటి. ఐతే చెవుల లోపల సహజంగా జిగురు లాంటి మలిన పదార్ధం తయారవుతూ ఉంటుంది. ఇది చెవిలోపల నాళాలు..
మన శరీరంలోని అత్యంత సున్నితమైన అవయవాలలో ఒకటి. ఐతే చెవుల లోపల సహజంగా జిగురు లాంటి మలిన పదార్ధం తయారవుతూ ఉంటుంది. ఇది చెవిలోపల నాళాలు ఎండిపోకుండా తేమగా ఉంచేందుకు ఉపయోగపడుతుంది. అలాగే దుమ్ముథూళి చెవిలోపలికి వెళ్లకుండా సంరక్షిస్తుంది. చెవిలోని మెత్తని పొర దెబ్బతినకుండా కాపాడుతుంది. ఈ పదార్థాన్ని ఇయర్‌వాక్స్ (గులిమి) అంటారు. దీనిని ప్రత్యేకంగా శుభ్రం చేయవల్సిన అవసరం లేదు. ఆహారం నమిలినప్పుడు, మాట్లాడేటప్పడు చెవి భాగం కదిలి దానంతట, అదే కిందపడిపోతుంటుంది. కొంతమందికి చెవిలోపల అలాగే ఉండిపోతుంది. ఇటువంటి వాళ్లు చెవులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. లేదంటే చెవిపోటు, వినికిడి లోపం తలెత్తుతుంది. ఐతే గులిమి శుభ్రం చేసుకోవడానికి కొందరు కాటన్ బర్డ్స్‌తో తీస్తుంటారు. ఇలా తీయడం మంచిదేనా? అనే సందేహం చాలా మందిలో ఉంది.
నిజానికి.. కాటన్ బర్డ్స్‌తో చెవిలోపల శుభ్రంచేయడానికి ప్రయత్నిస్తే గులిమి ఇంకా లోపలికి వెళ్లిపోతుంది. కాటన్ బర్డ్స్‌ని లోపలికి దూర్చితే కర్ణభేరి దెబ్బతిని రక్తం కారుతుంది. ఫలితంగా చెవి నొప్పి సంభవిస్తుంది. అందువల్ల కాటన్ బర్డ్స్‌తో చెవులను అస్సలు శుభ్రం చెయ్యకూడదు. మరికొందరు ఇయర్ క్యాండిల్స్ ఉపయోగిస్తారు. అలాగే చెవుల్లో డ్రాప్స్ వేసుకోవడం వల్ల గులిమి మెత్తబడి సులభంగా బయటికి వస్తుంది. ఇయర్‌డ్రాప్‌లలో హైడ్రోజన్ పెరాక్సైడ్, సోడియం బైకార్బోనేట్, సోడియం క్లోరైడ్ అనేవి మార్కెట్లో దొరుకుతాయి. అలాగే ఆలివ్ నూనె, బాదం నూనె చుక్కలను చెవిలో రెండు, మూడు వేసుకోవాలి. 3,4 రోజుల తర్వాత శుభ్రం చేస్తే సులభంగా బయటకు వస్తుంది. దీనిని ప్రయోగించే ముందు వైద్యుడిని సంప్రదించడం మర్చిపోకూడదు.