AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Children Care: తల్లిదండ్రులకు అలర్ట్.. మీ పిల్లలకు ఇలాంటి పదార్థాలు ఇస్తున్నారా..? తస్మాత్ జాగ్రత్త..

చాలామంది తలిదండ్రులు తమ సుఖం కోసం.. పిల్లలు గొడవ చేయకుండా ఉండేందుకు పలు అలవాట్లకు బానిసలుగా మారుస్తున్నారు. ఇవి వారి ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమైనవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Children Care: తల్లిదండ్రులకు అలర్ట్.. మీ పిల్లలకు ఇలాంటి పదార్థాలు ఇస్తున్నారా..? తస్మాత్ జాగ్రత్త..
Children Care
Shaik Madar Saheb
|

Updated on: Nov 17, 2022 | 1:59 PM

Share

చాలామంది తలిదండ్రులు తమ సుఖం కోసం.. పిల్లలు గొడవ, లేదా ఏడ్పును ఆపేందుకు పలు అలవాట్లకు బానిసలుగా మారుస్తున్నారు. ఇవి వారి ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమైనవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పలు ఆహార పదార్థాలను పిల్లలకు ఇవ్వడం తల్లితండ్రులు చేసే పెద్ద తప్పు అని పేర్కొంటున్నారు. దీని ప్రభావం ఒక్కోసారి రోగాలు లేదా ఆరోగ్య సమస్యల రూపంలో వస్తుందంటున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు అల్పాహారం కోసం కుకీలు, బిస్కెట్లను ఇస్తుంటారు. చాలా సందర్భాల్లో పిల్లలు ఏడుస్తుంటే.. వారికి కుకీస్, బిస్కెట్లతోపాటు పలు తీపి పదార్థాలను అందిస్తుంటారు. అయితే, అవి డేంజరస్ అని.. వాటిని తినదగినదిగా ఉంచడానికి కుకీలకు అనేక హానికరమైన వస్తువులను జోడిస్తుంటారని పేర్కొంటున్నారు.

అయితే, మీరు కూడా మీ బిడ్డకు రోజుకు చాలాసార్లు తినడానికి కుకీలను లేదా బిస్కెట్లను ఇస్తుంటే తప్పనిసరిగా ఈ విషయాలను తెలుసుకోవాలని పేర్కొంటున్నారు. దీనిపై సఫ్దర్‌జంగ్ హాస్పిటల్ మెడిసిన్ విభాగం HOD ప్రొఫెసర్ డాక్టర్ జుగల్ కిషోర్ Tv9తో పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఈ రకమైన ఆహారం వల్ల పిల్లలు చాలా సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉందని.. ఇవి నేరుగా ప్రభావం చూపుతాయని పేర్కొంటున్నారు.

ఈ వ్యాధి వచ్చే ప్రమాదం..

కుకీలలో అధిక చక్కెర కలుపుతారు. వాటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. చిన్నతనంలో పిల్లలు చురుకుగా ఉంటారు.. కావున కొంత సమయం తర్వాత వారి రక్తంలోని చెక్కర స్థాయిలో మార్పు రావడం, పెరగడం కనిపిస్తుంది. డాక్టర్ జుగల్ కిషోర్ ప్రకారం.. తల్లిదండ్రులు లేదా గ్రాండ్ పేరెంట్ల చరిత్ర మధుమేహం ఉంటే.. అలాంటి వారి పిల్లలలో మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అంతే కాకుండా శారీరకంగా బలహీనంగా ఉన్న పిల్లలు కుకీలు ఎక్కువగా తింటే మధుమేహం వచ్చే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు.

ఇవి కూడా చదవండి

మున్ముందు ఆరోగ్య సమస్యలు..

కుకీలలో ప్రిజర్వేటివ్స్, రిఫైన్డ్ షుగర్ వాడతారని వాటిని తినడానికి వీలుగా తయారు చేస్తారని.. కావున ఇది ఆరోగ్యానికి విషం కంటే తక్కువ కాదని డాక్టర్ కిషోర్ చెప్పారు. తీపి, రుచిగా ఉండటం వల్ల పిల్లలు వాటిని ఇష్టపడతారు. పిల్లలు ఏడ్చినప్పుడు.. ఏదైనా తినడానికి కావాలన్నప్పుడు తల్లిదండ్రులు వారికి తినడానికి రోజుకు చాలా సార్లు కుకీలను ఇస్తుంటారని.. ఇది చాలా తప్పని పేర్కొన్నారు.

శుద్ధి చేసిన పిండి అంటే మైదాను ఇందులో ఉపయోగిస్తారు. ఈ పిండి కారణంగా కుకీలలో ఫైబర్ అస్సలు ఉండదు. దీని కారణంగా పిల్లలు మలబద్ధకం బారిన పడే అవకాశం ఉంది. ఇలాంటి ఆహారం అలవాటు ఉన్న పిల్లల కడుపు 3 నుంచి 4 రోజులపాటు శుభ్రం అవ్వదు. ఈ పరిస్థితి కొనసాగితే అది వైద్య చికిత్స పరిధికి వస్తుందని జుగల్ తెలిపారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం..