AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Zodiac Signs: ఈ రాశుల వారు పట్టిందల్లా బంగారమే.. ఇండియాలో టాప్ బిలియనీర్లు అంతా వారే.. మీరూ ఉన్నారా..?

ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదించడానికి, ధనవంతులు కావడానికి చాలా కష్టపడతారు. కొంతమంది విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి డబ్బు సంపాదించాలని కోరుకుంటారు. మరికొందరు డబ్బు సంపాదించి.. తమ ప్రియమైనవారు సంతోషంగా, సంపన్నమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటారు.

Zodiac Signs: ఈ రాశుల వారు పట్టిందల్లా బంగారమే.. ఇండియాలో టాప్ బిలియనీర్లు అంతా వారే.. మీరూ ఉన్నారా..?
Zodiac Signs
Shaik Madar Saheb
|

Updated on: Nov 16, 2022 | 12:30 PM

Share

Zodiac Signs: ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదించడానికి, ధనవంతులు కావడానికి చాలా కష్టపడతారు. కొంతమంది విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి డబ్బు సంపాదించాలని కోరుకుంటారు. మరికొందరు డబ్బు సంపాదించి.. తమ ప్రియమైనవారు సంతోషంగా, సంపన్నమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటారు. కారణం ఏదైనా.. డబ్బు సంపాదించాలన్నది మాత్రం ప్రతి ఒక్కరి కామన్ థింగ్.. అయితే, కోటీశ్వరుడు లేదా బిలియనీర్ అవ్వడం అంత సులభం కాదు.. చివరకు మనం అనుకున్నది సాధించినప్పుడు.. సాధారణంగా మన విజయానికి సంపూర్ణ సంకల్పం.. కృషికి ఆపాదించుకుంటాము. చాలామంది దీనిని అదృష్టంగా కూడా భావిస్తారు. ధనవంతులుగా మారడం కోసం.. కాలం కలిసి రావాలి.. అదృష్టం ఉండాలి.. ఇంకేదో జరగాలంటూ వ్యాఖ్యానిస్తుంటారు.. కానీ లక్ష్మీ దేవీ కటాక్షం పొందేందుకు ఇంకేమైనా మార్గం ఉందా..? అంటే.. ఇది చాలా అంశాలతో ముడిపడి ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం పేర్కొంటోంది.

ఇవన్నీ పక్కనపెడితే.. మీరు జాతకం లేదా రాశులను నమ్మే వారైతే.. అది కొంత వరకు నిజమని తెలుసుకోవాలి. జ్యోతిష్యం ప్రకారం.. మన అదృష్టానికి సంబంధించి ఖచ్చితమైన విషయాలు.. కోటిశ్వరులుగా మారే చాలా సంఘటనలు ముందుగా నిర్ణయించబడతాయని పేర్కొంటున్నారు.

జ్యోతిష్యం అనేది మాయాజాలం కాదు.. జీవితంలో ప్రధాన నిర్ణయాలు తీసుకునేటప్పుడు పరిగణనలోకి తీసుకోవలసిన పురాతన శాస్త్రం. మీరు భారతదేశంలోని కొంతమంది సంపన్న వ్యక్తులను పరిశీలిస్తే.. సంపాదించిన డబ్బు మొత్తాన్ని వారి రాశిచక్రాలు ఎంత ప్రభావితం చేస్తాయో తెలుసుకోవాలంటున్నారు. ఈ విషయాలు తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు.

ఇవి కూడా చదవండి

బిజినెస్ ఇన్‌సైడర్ నివేదిక ప్రకారం.. ఈ రాశులలో జన్మించిన వ్యక్తులు ఇతరులతో పోలిస్తే చాలా అదృష్టవంతులంట.. నివేదిక ప్రకారం అదృష్ట నక్షత్రం.. కర్కాటక రాశి.. ఇది గౌతమ్ అదానీ రాశిచక్రం అని పేర్కొంటున్నారు. కర్కాటకం తర్వాత, కన్య, తుల, వృషభం వంటి ఇతర నక్షత్ర రాశులు వస్తాయి. అదేవిధంగా వృశ్చికం, కన్య రాశులకు కూడా ఈ సంవత్సరం అదృష్టం బాగా కలిసొచ్చింది.

ఎయిర్‌టెల్‌కు చెందిన సునీల్ మిట్టల్, ఏషియన్ పెయింట్స్‌కు చెందిన అశ్విన్ డానీలు వృశ్చిక రాశిలో జన్మించగా, వేదాంతకు చెందిన అనిల్ అగర్వాల్, డిమార్ట్‌కు చెందిన గోపికిషన్ దామన్ కన్య రాశి చక్రంలో జన్మించారు.

భారతదేశ రెండవ అత్యంత సంపన్నుడు, రిలయన్స్ వ్యవస్థాపకుడు ముఖేష్ అంబానీ నక్షత్ర రాశి మేషం.. ఈ సంవత్సరం జాబితాలో ఈ నక్షత్రం కూడా ఉంది. అయితే, బిలియనీర్ల జాబితా హెచ్చుతగ్గులకు లోనవుతూనే ఉంటుందని మాత్రం గుర్తుంచుకోవాలి.

మరీ ముఖ్యంగా, మీరు ఏ నక్షత్ర రాశికి చెందిన వారైనా, అగ్రస్థానానికి చేరుకోవడానికి కష్టపడి పనిచేయడం చాలా అవసరం. నక్షత్రం లేదా రాశిచక్రాలు అనేవి మన విశ్వాసంతో ముడిపడి ఉంటాయి. అది వారి వారి నమ్మకాన్ని బట్టి ఉంటుంది.

నోట్: జాతకాలు లేదా రాశిచక్రాలు అనేవి మన విశ్వాసంతో ముడిపడి ఉంటాయి. దీనిని టీవీ9 ధ్రువీకరించడం లేదు.. 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం..