Heart Health: ఈ గింజలతో హార్ట్ ఎటాక్ సమస్య నుంచి బయటపడొచ్చు.. అది ఎలాగో తప్పనిసరిగా తెలుసుకోండి..

Shaik Madarsaheb

Shaik Madarsaheb |

Updated on: Nov 14, 2022 | 5:50 AM

ఆధునిక కాలంలో గుండెపోటు కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఫిట్‌నెస్‌పై అవగాహన ఉన్నప్పటికీ.. గుండెపోటుకు గురై చాలామంది ప్రాణాలు కోల్పోతున్న సంగతి తెలిసిందే.

Heart Health: ఈ గింజలతో హార్ట్ ఎటాక్ సమస్య నుంచి బయటపడొచ్చు.. అది ఎలాగో తప్పనిసరిగా తెలుసుకోండి..
Healthy Heart

ఆధునిక కాలంలో గుండెపోటు కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఫిట్‌నెస్‌పై అవగాహన ఉన్నప్పటికీ.. గుండెపోటుకు గురై చాలామంది ప్రాణాలు కోల్పోతున్న సంగతి తెలిసిందే. గుండెపోటుకు అతి పెద్ద కారణం కొలెస్ట్రాల్. అధిక కొలెస్ట్రాల్ ఉంటే ఆరోగ్యం దెబ్బతినడంతోపాటు గుండెపోటుకు గురవుతారని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. గుండెపోటు రాకుండా ఉండాలంటే కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవాలని సూచిస్తున్నారు. మన ఆహారంలో కొన్ని ఆరోగ్యకరమైన పదార్థాలను చేర్చుకోవడం ద్వారా కొలెస్ట్రాల్‌ను నియంత్రించవచ్చు.

కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించాలి..

కొలెస్ట్రాల్‌కు కారణం చెడు ఆహారపదార్థాలు, కొవ్వు పదార్థాలు తినడం. కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవాలంటే మనం ఆరోగ్యకరమైన వాటిని తీసుకోవాలి. అలాంటి వాటిల్లో అవిసె గింజలు చాలా ఆరోగ్యకరమైనవి. ఈ విత్తనాలు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. అవిసె గింజలలో ఫైబర్, ఒమేగా-3, ఒమేగా 6 కొవ్వు ఆమ్లాలు, కరిగే ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. లిన్సీడ్‌లోని పోషకాలు రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయి. ఇంకా ఇవి గుండెపోటు ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి.

అవిసె గింజలను ఎలా తినాలి..

శరీరంలో అధిక కొలెస్ట్రాల్‌ను నివారించాలనుకుంటే.. మీ రోజువారీ ఆహారంలో అవిసె గింజలను చేర్చుకోండి. అవిసెగింజలను పచ్చిగా తినకూడదు.. కాల్చి తినవచ్చు. కొలెస్ట్రాల్ తగ్గించడానికి రోజూ ఒక చెంచా అవిసెగింజలు తింటే సరిపోతుంది. అవిసె గింజలను వేయించిన తర్వాత, మీరు వాటిని హల్వా లేదా లడ్డూలలో కలుపుకుని తినవచ్చు.

ఇవి కూడా చదవండి

ఈ విషయాలను గుర్తుంచుకోండి

విసెగింజలలో చాలా పోషకాలు ఉన్నాయి. కానీ అవి కొంతమందికి హాని కలిగిస్తాయి. అలర్జీ, వాపు సమస్య ఉంటే అవిసె గింజలు తినకూడదు. దీనిలో అధిక పొటాషియం ఉంటుంది. మూత్రపిండాల రోగులకు హాని కలిగించే పొటాషియం మొత్తం ఇందులో ఉంటుంది. కావున ఏదైనా అనారోగ్య సమస్యతో బాధపడుతుంటే అవిసెగింజలను తినే ముందు ఆరోగ్య నిపుణులను సంప్రదించడం మంచిది.

నోట్.. ఈ కథనంలో పేర్కొన్న అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.

మరిన్ని హెల్త్ వార్తల కోసం..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu