AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Care: లైంగిక సామర్థ్యం తగ్గుతోందా..? ఆ వ్యాధికి సంకేతం కావొచ్చు.. జాగ్రత్త..!

మధుమేహం వల్ల మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని వైద్యులు చెబుతున్నారు. మనస్థలి వ్యవస్థాపకుడు, సీనియర్ సైకియాట్రిస్ట్ డా. జ్యోతికపూర్ మాట్లాడుతూ.. శరీరంలో బ్లడ్ షుగర్ పెరగడం వల్ల మూడ్ స్వింగ్స్ వేగంగా మారుతాయని చెప్పారు.

Health Care: లైంగిక సామర్థ్యం తగ్గుతోందా..? ఆ వ్యాధికి సంకేతం కావొచ్చు.. జాగ్రత్త..!
Relationship Tips
Shaik Madar Saheb
|

Updated on: Nov 12, 2022 | 7:00 AM

Share

ప్రపంచ వ్యాప్తంగా మధుమేహం కేసులు వేగంగా పెరుగుతున్నాయి. భారతదేశంలో కూడా దాదాపు 7 కోట్ల మంది డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నారని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. వారిలో 2.5 కోట్ల మందికి టైప్-2 మధుమేహం ఉంది. 2045 నాటికి భారతదేశంలో డయాబెటిస్ వ్యాధితో బాధపడుతున్న వారి సంఖ్య 130 మిలియన్లకు పైగా ఉంటుందని WHO అంచనా వేసింది. అనారోగ్యకరమైన జీవనశైలి, చెడు ఆహారం కారణంగా ఈ వ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతోంది. శరీరంలో చక్కెర స్థాయి పెరగడం వల్ల ప్రజలు అనేక ఇతర వ్యాధులను ఎదుర్కోవలసి ఉంటుంది. వీటిలో గుండె, నోటి ఆరోగ్యానికి సంబంధించిన వ్యాధులు ఉన్నాయి.

మధుమేహం వల్ల మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని వైద్యులు చెబుతున్నారు. మనస్థలి వ్యవస్థాపకుడు, సీనియర్ సైకియాట్రిస్ట్ డా. జ్యోతికపూర్ మాట్లాడుతూ.. శరీరంలో బ్లడ్ షుగర్ పెరగడం వల్ల మూడ్ స్వింగ్స్ వేగంగా మారుతాయని చెప్పారు. చక్కెర స్థాయి తక్కువగా ఉన్నట్లయితే.. ఒక వ్యక్తి ఆకలిని కోల్పోవడం, ఏకాగ్రతతో పాటు నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలను అనుభవిస్తాడన్నారు. అయితే, మధుమేహం విషయంలో రోగి.. దృష్టి, ఏకాగ్రత, అలసట, విశ్రాంతి లేకపోవటం లేదా శక్తి తక్కువగా ఉండటం వంటి సమస్యలను కలిగి ఉంటారని పేర్కొన్నారు.

లైంగిక జీవితంపై ఎఫెక్ట్..

మధుమేహం.. లైంగిక జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. సంభావ్య -భావప్రాప్తి సమస్యలు, అంగస్తంభన, యోని పొడి, తక్కువ సెక్స్ డ్రైవ్ లాంటి సమస్యలు తలెత్తుతాయి. ఒక వ్యక్తి తన మూడ్‌లో వేగవంతమైన హెచ్చుతగ్గులను లేదా మరేదైనా ఇతర లక్షణాలను గమనిస్తే.. అది పేలవమైన మానసిక ఆరోగ్య స్థితికి సంకేతం కావచ్చు. అటువంటి పరిస్థితిలో వెంటనే వైద్యుడిని సంప్రదించాలని సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మానసిక సమస్య ఉంటే నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే మధుమేహం ఆందోళన లేదా మానసిక ఒత్తిడిని కూడా కలిగిస్తుంది. దీనిపై దృష్టి సారించడం అవసరం.

ఇలా జాగ్రత్త పడండి..

డాక్టర్ ప్రకారం.. డయాబెటిక్ రోగులు వారి ఆహారం, జీవనశైలిని సరిగ్గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఆహారంలో కొవ్వు, కార్బోహైడ్రేట్ల పరిమాణాన్ని తగ్గించండి. ఆహారంలో ప్రోటీన్, విటమిన్లు ఉండేలా చూసుకోండి. ప్రతిరోజూ కనీసం ఎనిమిది గంటల నిద్ర ఉండేలా చూసుకోండి. రోజుకు కనీసం 15 నిమిషాలు వ్యాయామం చేయండి. ఊబకాయం పెరుగుతుంటే దానిని నియంత్రించడానికి ప్రయత్నించండి. మీ మందులను క్రమం తప్పకుండా తీసుకోండి. అలాగే, ప్రతి 6 నెలలకోసారి హార్ట్ చెకప్ చేయించుకోవాలని జ్యోతికపూర్ సూచించారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం..