Eye Care Tips: రోజూ ఈ 6 అలవాట్లకు దూరంగా ఉండండి.. మీ కళ్లు బూతద్దాలకంటే సూపర్‌గా పని చేస్తాయి..
భారతదేశం ప్రపంచంలో రెండవ అత్యధిక జనాభా కలిగిన దేశం. ప్రపంచ అంధ జనాభాలో 20 శాతానికి పైగా అంధత్వంలో ఇబ్బంది పడుతున్నారు.
భారతదేశం ప్రపంచంలో రెండవ అత్యధిక జనాభా కలిగిన దేశం. ప్రపంచ అంధ జనాభాలో 20 శాతానికి పైగా అంధత్వంలో ఇబ్బంది పడుతున్నారు. దృష్టి లోపాన్ని పరిష్కరించడం అనేది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఒక ప్రధాన సమస్య. వయస్సు, జన్యుపరమైన, పర్యావరణ పరమైన అనేక కారణాలు బలహీనమైన దృష్టికి కారణమైనప్పటికీ.. రోజువారీ అలవాట్లు కూడా అంతే ముఖ్యంగా ప్రభావితం చేస్తాయి. రోజువారీ అలవాట్లు వ్యక్తి కంటి చూపును ప్రభావితం చేస్తాయి. సకాలంలో ఆ అలవాట్లను మార్చుకోకపోతే సమస్య మరింత జఠిలమయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మార్చుకోవాల్సిన ఆ అలవాట్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
1. ఎక్కవ సమయం ఫోన్ వినియోగం, ముఖ్యంగా కంప్యూటర్‌లో ఎక్కువ గంటలు పని చేయడం వలన చాలా మంది కంటి చూపు సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారు. కరోనా కారణంగా గత మూడేళ్లుగా ఉద్యోగులు ఇంటి వద్దనుండే పనులు చేస్తున్నారు. గంటల తరబడి కూర్చుని కంప్యూటర్ చూసుకుంటూ పని చేయడం వలన కంటి చూపుపై ఎఫెక్ట్ పడుతుంది. ఇది కళ్లపై తీవ్రమైన ఒత్తిడి కలిగిస్తుంది. దీని వల్ల స్క్రీన్ సైటెడ్‌నెస్, కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ సమస్య వచ్చే అవకాశం ఉంది. అయితే, ఈ సమస్యకు ఒక పరిష్కారమార్గం ఉంది. అదే 20 -20-20. ఇది మీ కళ్లపై ఒత్తిడిని తగ్గిస్తుంది. డిజిటల్ పరికరాలను ఎక్కువగా ఉపయోగించడం వల్ల మీ కంటిపై పడే ఒత్తిడిని ఈ టెక్నిక్ తగ్గిస్తుంది. దీని ప్రకారం.. ప్రతీ 20 నిమిషాలకు కనీసం 20 సెకన్లు 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును గానీ, మరేదేన్ని గానీ చూడాలి. సాధ్యమైనంత వరకు ఫోన్‌ను, కంప్యూటర్‌ను ఎక్కువ సేపు చూడటం మానుకోవడం ఉత్తమం.
2. కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, జింక్, విటమిన్లు సి, ఈ ఉండే ఆహారాలు తీసుకోవాలి. ముదురు ఆకు కూరలు, గింజలు, గుడ్లు, నారింజ, సముద్రపు ఆహారాన్ని తీసుకోవడం ద్వారా కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
3. తగినంత విశ్రాంతి తీసుకోకపోవడం వల్ల కూడా కంటి సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. నిద్రలేమి వల్ల అనేక సమస్యలు ఎదురవుతాయి. బలహీనమైన రోగనిరోధక శక్తి, బరువు పెరగడం, గుండె జబ్బులు, అధిక రక్తపోటు వంటి స్వల్పకాలిక, దీర్ఘకాలిక ఆరోగ్యంపైనా అనేక ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది. మానసిక స్థితి మార్పులు, జ్ఞాపకశక్తి సమస్యలు వస్తాయి. ఇది కళ్ల ఆరోగ్యాన్ని కూడా గణనీయంగా ప్రభావితం చేస్తుంది. తగినంత విశ్రాంతి తీసుకోకపోవడం వల్ల కళ్ళ కింద నల్లటి వలయాలు, అస్పష్టమైన దృష్టి, పొడి కళ్లు వంటి సమస్యలు వస్తాయి.
4. కళ్లను అస్సలు రద్దుకూడదు. అలా చేయడం వల్ల దృష్టిలోపం మరింత పెరిగే ప్రమాదం ఉంది. కళ్లు దురదలు వంటి ఇబ్బందులు వస్తే.. పదే పదే రుద్దడం వలన కనురెప్పల కింద ఉన్న రక్తనాళాలు విరిగిపోతాయి. కళ్లు దురదగా ఉన్నప్పుడు రుద్దడానికి బదులుగా కోల్డ్ కంప్రెస్‌ని చేయాలి.
5. ఎండ వల్ల కూడా కంటి సమస్యలు తలెత్తుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో సన్ గ్లాసెస్ ధరించడాలి. మీ కళ్లకు హానీకరం అవుతుంది. కళ్లకు అతినీల లోహిత కిరణాలు, వాతావరణంలోని హానీకరమైన మూలకాలు హానిని కలిగిస్తాయి.
6. హైడ్రేషన్‌ను నిర్వహించడానికి నీరు చాలా అవసరం. రోజులో తగినంత నీరు తాగాలి. శరీరంలో తగినంత నీరు ఉంటే.. కళ్లు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. ఆ నీరు కళ్ల ఎప్పుడూ చెమ్మతో ఉండేలా తోడ్పడుతాయి. తేమ లేకపోతే కళ్లు పొడిబారుతాయి. ఫలితంగా దృష్టి సంబంధిత సమస్యలు వస్తాయి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..