Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dragon Fruit: సర్వరోగనివారిణి డ్రాగన్ ఫ్రూట్.. ఆ సమస్యలనున్న వారు రోజూ తింటే డబుల్ బెనిఫిట్స్..

డ్రాగన్ ఫ్రూట్ గుండెకు మేలు చేస్తుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో పుష్కలంగా ఉంటాయి, ఇవి గుండె ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.

Dragon Fruit: సర్వరోగనివారిణి డ్రాగన్ ఫ్రూట్.. ఆ సమస్యలనున్న వారు రోజూ తింటే డబుల్ బెనిఫిట్స్..
Dragon Fruit
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 14, 2022 | 6:50 AM

Health Benefits of Dragon Fruit: ప్రతిరోజూ పండ్లు తింటే ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుందన్న విషయం అందరికీ తెలుసు.. అలాంటి పండ్లలో డ్రాగన్ ఫ్రూట్ పేరు వినే ఉంటారు. దీనిని పలు రకాల పేర్లతో పిలుస్తారు. పేరుకు తగినట్లే.. డ్రాగన్ ఫ్రూట్ ప్రయోజనాలు కూడా అంతే ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. కివి, పియర్ వంటి రుచి కలిగిన ఈ డ్రాగన్ ఫ్రూట్ అనేక ప్రమాదకరమైన వ్యాధులను సైతం నయం చేయడానికి ఉపయోగిస్తారు. ఇందులో ఉండే విటమిన్ సి, కెరోటిన్, ప్రొటీన్, ఫైబర్, క్యాల్షియం, ఫాస్పరస్, పాలీ అన్‌శాచురేటెడ్ ఫ్యాట్, ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. గుండె సహా అనేక వ్యాధులలో డ్రాగన్ ఫ్రూట్ ఉపయోగపడుతుంది. డ్రాగన్ ఫ్రూట్స్ (Dragon Fruit) వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

గుండెకు ప్రయోజనకరం..

డ్రాగన్ ఫ్రూట్ గుండెకు మేలు చేస్తుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో పుష్కలంగా ఉంటాయి, ఇవి గుండె ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. యాంటీఆక్సిడెంట్లు రక్త ప్రసరణను మెరుగుపరచడానికి పని చేస్తాయి. మెగ్నీషియం కూడా డ్రాగన్ ఫ్రూట్‌లో పుష్కలంగా ఉంటుంది. ఇది స్ట్రోక్, గుండెపోటు వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది..

గుండె సమస్యలకు ప్రధానంగా చెడు కొలెస్ట్రాల్ కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవాలి. డ్రాగన్ ఫ్రూట్‌లో ఉండే పాలీఅన్‌శాచురేటెడ్ ఫ్యాట్, ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్‌లు, ఫైబర్, యాంటీ-ఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో పని చేస్తాయి. డ్రాగన్ ఫ్రూట్ తీసుకోవడం వల్ల మంచి కొలెస్ట్రాల్ కూడా పెరుగుతుంది. హృద్రోగులకు డ్రాగన్ ఫ్రూట్ తీసుకోవడం చాలా మేలు చేస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.

ఇవి కూడా చదవండి

జీర్ణక్రియ మెరుగుపడుతుంది..

డ్రాగన్ ఫ్రూట్‌లో ఫైబర్‌ పుష్కలంగా ఉంటుంది. ఫైబర్ జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది. డ్రాగన్ ఫ్రూట్‌లో మంచి మొత్తంలో నీరు కూడా ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. డీహైడ్రేషన్ కారణంగా డయేరియా వంటి సమస్యలు ఉండవు. డ్రాగన్ తీసుకోవడం వల్ల మలబద్ధకం, అజీర్ణం, కడుపు నొప్పి ఉండదు.

రక్తహీనతలో ప్రయోజనకరం..

డ్రాగన్ ఫ్రూట్‌లో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల శరీరంలో హిమోగ్లోబిన్ లోపం తొలగిపోతుంది. రక్తహీనతకు డ్రాగన్ ఫ్రూట్ చాలా మేలు చేస్తుందని.. ఆ సమస్యతో బాధపడుతున్న వారు ఈ పండును తినడం మంచిదని సూచిస్తున్నారు.

ఎముకలను దృఢంగా మారుస్తుంది..

డ్రాగన్ ఫ్రూట్ ఎముకలు, దంతాలను బలోపేతం చేయడానికి పనిచేస్తుంది. ఇందులో ఉండే కాల్షియం, ఫాస్పరస్ ఎముకలను దృఢంగా చేస్తాయి.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది..

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇది వ్యాధులతో పోరాడే శక్తిని పెంచుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం..