Health: సైనస్ తో సతమతమవుతున్నారా.. ఈ ఇబ్బందులు పాటిస్తే పడిశంతో పాటు ఆ సమస్యలూ పారాహుషార్..

సైనస్ తో బాధపడేవారి ఇబ్బందులు అంతా ఇంతా కాదు. ఏకధాటిగా ముక్కు కారుతుండటం, తుమ్ములు, చికాకు, తెలియని నిస్సత్తువ సతమతం చేస్తాయి. అలర్జీ, జలుబు, మనం పీల్చిన గాలిలో దుమ్ము ఎక్కువగా ఉండటం, ఇన్ఫెక్షన్స్...

Health: సైనస్ తో సతమతమవుతున్నారా.. ఈ ఇబ్బందులు పాటిస్తే పడిశంతో పాటు ఆ సమస్యలూ పారాహుషార్..
Sinus Health Tips
Follow us

|

Updated on: Nov 14, 2022 | 6:58 AM

సైనస్ తో బాధపడేవారి ఇబ్బందులు అంతా ఇంతా కాదు. ఏకధాటిగా ముక్కు కారుతుండటం, తుమ్ములు, చికాకు, తెలియని నిస్సత్తువ సతమతం చేస్తాయి. అలర్జీ, జలుబు, మనం పీల్చిన గాలిలో దుమ్ము ఎక్కువగా ఉండటం, ఇన్ఫెక్షన్స్ కారణంగా ముక్కులో ఉండే సైనసెస్ మూసుకుపోతుంది. దీంతో శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారుతుంది. తలనొప్పి, గురక, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి సమస్యలు తలెత్తుతాయి. లక్షణాలు తీవ్రంగా ఉంటే కొన్ని సార్లు జ్వరం కూడా వచ్చే అవకాశం ఉంది. సైనస్ తో బాధపడే వారు అధికంగా డాక్టర్లను సంప్రదించి, ఇంగ్లీష్ మందులను వాడుతుంటారు. అలా కాకుండా కొన్ని చిట్కాలు పాటించడం వల్ల ఈ సమస్య నుంచి దూరంగా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ పద్ధతులు పాటించడం వల్ల ఎటువంటి ఇబ్బందులే కాకుండా మంచి ప్రయోజనాలు, ఉపశమనం లభిస్తాయి.

ముక్కులో రంధ్రాలు, దుమ్మూ ధూళి చేరుకోవడం వల్ల సైనసెస్ మూసుకుపోతుంది. అప్పుడు గాలి పీల్చలేక, వదలలేక సతమతమవుతుంటారు. అలాంటి పరిస్థితుల్లో ఆవిరి పడితే మంచి ఉపశమనం ఉంటుంది. నాసికా రంధ్రాలను తెరవడంలో స్టీమ్ థెరపీ బాగా సహాయపడుతుంది. వేడి వేడి నీటి మీద ముఖాన్ని ఉంచి, ఆవిరి బయటకి పోకుండా క్లాత్ కప్పుకుని ఆవిరి పడితే మంచి అనుభూతి కలగడమే కాకుండా ముక్కు రంధ్రాలూ తెరుచుకుంటాయి. వంటింటి పోపుల డబ్బాలో కచ్చితంగా ఉండే పసుపుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో మనందరికీ తెలిసిందే. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అధిక మొత్తంలో ఉన్నాయి.

సైనస్ కి చికిత్స చెయ్యడంలో పసుపు అద్భుత పాత్ర పోషిస్తుంది. వేడి వేడి టీ లో పసుపు కలుకుని తాగడం, అల్లం టీ లో కూడా కొద్దిగా పసుపు వేసుకుని తాగడం వల్ల ముక్కులో పేరుకుపోయిన శ్లేష్మాన్ని పోగొట్టడంలో సహాయపడుతుంది. ముక్కులో పేరుకున్న అడ్డంకులను తొలగించడానికి కారం మంచి ఫలితాన్నిస్తుంది. అయితే అధిక మొత్తంలో కాకుండా తక్కువగా అందులోనూ ఒక టేబుల్ స్పూన్ తేనెతో కలిపి తీసుకోవాలి.

ఇవి కూడా చదవండి

నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించేముందు వైద్యుల సలహాలు, సూచనలు తీసుకోవడం ఉత్తమం.

మరిన్ని హెల్త్ వార్తల కోసం..

YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!