AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

waltair veerayya: మెగా అభిమానులకు పండగలాంటి న్యూస్.. ‘వాల్తేరు వీరయ్య’ నుంచి బిగ్ అప్డేట్

అన్ని కమర్షియల్ హంగులతో కూడిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. ఇటివలే విడుదలైన 'వాల్తేరు వీరయ్య' టైటిల్ టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

waltair veerayya: మెగా అభిమానులకు పండగలాంటి న్యూస్.. 'వాల్తేరు వీరయ్య' నుంచి బిగ్ అప్డేట్
Waltairveerayya
Rajeev Rayala
|

Updated on: Nov 13, 2022 | 8:57 PM

Share

మెగాస్టార్ చిరంజీవి మెగా మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్ ‘వాల్తేర్ వీరయ్య’. ఈ సినిమా కోసం మెగా అభిమానులంతా వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవర్ ఫుల్ పాత్రలో మాస్ మహారాజా రవితేజ కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఇద్దరు స్టార్స్‌ని కలిసి తెరపై చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అన్ని కమర్షియల్ హంగులతో కూడిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. ఇటివలే విడుదలైన ‘వాల్తేరు వీరయ్య’ టైటిల్ టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. మెగాస్టార్ వింటేజ్ అవాతర్ ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేసింది. చిరంజీవి బాడీ లాంగ్వేజ్, వాకింగ్ స్టైల్, గెటప్, మ్యానరిజమ్స్ మాస్ పూనకాలు తెప్పించింది.

తాజాగా ‘వాల్తేరు వీరయ్య’ నుండి బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ చిత్రం ఫస్ట్ సింగిల్ ఈ వారమే విడుదల కాబోతుంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఫస్ట్ సాంగ్ గురించి ట్వీట్ చేశారు. ”ఇప్పుడే ‘వాల్తేరు వీరయ్య’ ఫస్ట్ సాంగ్ ని చూశాను. మెగాస్టార్ ఎనర్జిటిక్ డ్యాన్స్ మైండ్ బ్లోయింగ్. ఫస్ట్ సింగల్ ఈ వారమే విదుదలౌతుంది. పార్టీకి సిద్ధంగా ఉండండి.. ఎందుకంటే ఇది బాస్ పార్టీ” అని ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి

వాల్తేరు వీరయ్యలో మెగాస్టార్ చిరంజీవి, గ్లామరస్ క్వీన్ ఊర్వశి రౌతేలా పై ఓ భారీ సెట్‌లో స్పెషల్ సాంగ్ ని చిత్రీకరించారు. స్టార్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ చేశారు. ఇదే పాటని ఈ వారం విడుదల చేస్తున్నారు మేకర్స్. చిరంజీవి- దేవిశ్రీ ప్రసాద్ లది చార్ట్ బస్టర్ కాంబినేషన్. వీరి కాంబినేషన్ వచ్చిన చిత్రాలు మ్యజికల్ గా ట్రెండ్ సెట్ చేశాయి. ఇప్పుడు వాల్తేరు వీరయ్య’ ఆల్బమ్ పై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు వున్నాయి. ఇక వాల్తేరు వీరయ్య 2023 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Follow Us
ప్రముఖ యూట్యూబర్‌ మధుమిత పరార్‌.. భారీగా పెరిగిన ఫాలోవర్లు!
ప్రముఖ యూట్యూబర్‌ మధుమిత పరార్‌.. భారీగా పెరిగిన ఫాలోవర్లు!
ఐదో వారం ఓటింగ్‌లో దుమ్మురేపుతున్న ఆ ముగ్గురు..
ఐదో వారం ఓటింగ్‌లో దుమ్మురేపుతున్న ఆ ముగ్గురు..
అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసా..?
అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసా..?
'పుష్ప' ముద్దు సీన్‌ను రీక్రియేట్ చేసిన స్వీడన్ దంపతులు.. వీడియో
'పుష్ప' ముద్దు సీన్‌ను రీక్రియేట్ చేసిన స్వీడన్ దంపతులు.. వీడియో
NEET PG 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్‌.. అక్టోబర్ 12 నుంచి దరఖాస్తులు
NEET PG 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్‌.. అక్టోబర్ 12 నుంచి దరఖాస్తులు
APPSC గ్రూప్‌ 1కు ఇంకా మూడున్నర నెలలే.. పరీక్ష విధానం ఇలా ఉంటుంది
APPSC గ్రూప్‌ 1కు ఇంకా మూడున్నర నెలలే.. పరీక్ష విధానం ఇలా ఉంటుంది
ప్రతిరోజూ ఉదయం చియా,సబ్జా విత్తనాలు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా?
ప్రతిరోజూ ఉదయం చియా,సబ్జా విత్తనాలు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా?
అక్టోబర్ 8 రాశిఫలాలు: ఆ రాశులకు ధన లాభం, కుటుంబంలో సంతోషం
అక్టోబర్ 8 రాశిఫలాలు: ఆ రాశులకు ధన లాభం, కుటుంబంలో సంతోషం
ఫేస్ బుక్ కామెంట్‌తో ప్రాణాల మీదకు.. సౌదీలో శ్రీలంక వాసికి ఉరి
ఫేస్ బుక్ కామెంట్‌తో ప్రాణాల మీదకు.. సౌదీలో శ్రీలంక వాసికి ఉరి
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాల్సిందే.. అప్పటివరకు పోరాటం..
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాల్సిందే.. అప్పటివరకు పోరాటం..