Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 6: బిగ్ బాస్ నుంచి బాలాదిత్య ఎలిమినేట్ అవ్వడానికి కారణం ఇదేనా..?

అనుకున్నట్టుగానే శనివారం ఒక ఎలిమినేషన్ జరిగింది. ఈ ఎలిమినేషన్ లో ఊహించని విధంగా బాలాదిత్య అవుట్ అయి బయటకు వచ్చేశాడు. ఎంత పాజిటివిటీతో అయితే బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లాడో.. అదే పాజిటివ్‌తో ఎలిమినేట్ అయ్యి అందరితో మంచి అనిపించుకున్నాడు బాలాదిత్య.

Bigg Boss 6: బిగ్ బాస్ నుంచి బాలాదిత్య ఎలిమినేట్ అవ్వడానికి కారణం ఇదేనా..?
Bigg Boss
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 13, 2022 | 3:36 PM

బిగ్ బాస్ సీజన్ 6 లో ఊహించని ఎలిమినేషన్స్ జరుగుతున్నాయి. ఇప్పటికే టాప్ 5లో ఉంటారనుకున్న కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి బయటకు వచ్చేస్తున్నారు. ఈవారం కూడా అదే జరిగింది. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అని ముందే చెప్పారు నాగార్జున. అనుకున్నట్టుగానే శనివారం ఒక ఎలిమినేషన్ జరిగింది. ఈ ఎలిమినేషన్ లో ఊహించని విధంగా బాలాదిత్య అవుట్ అయి బయటకు వచ్చేశాడు. ఎంత పాజిటివిటీతో అయితే బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లాడో.. అదే పాజిటివ్‌తో ఎలిమినేట్ అయ్యి అందరితో మంచి అనిపించుకున్నాడు బాలాదిత్య. లాస్ట్ ఎలిమినేషన్ లో గీతూ బయటకు రావడానికి ఏడ్చి గగ్గోలు పెట్టిందో అందరికి తెలుసు. కానీ బాలాదిత్య అలా కాదు నవ్వుతూనే బయటకు వచ్చేశాడు. అయితే బయటకు వచ్చిన ఆదిత్య అందరికి కాల్స్ తీసుకున్నాడు. ‘నేను సచిన్ ఫ్యాన్‌ని తాను కూడా 97 దగ్గర ఔట్ అయినట్టు చెప్పాడు బాలాదిత్య. ఇక బాలాదిత్య జర్నీ వీడియో ను చూపించారు.

ఇక బాలాదిత్య బయటకు రావడాన్ని కొన్ని కారణాలు ఉన్నాయి. అతి మంచితనం కూడా బాలాదిత్య బయటకు రావడానికి కారణం అని చెప్పుకోవచ్చు. గీతూని చెల్లి అంటూ ఆమె తోనే ఎక్కువగా సమయం గడిపాడు. మిగతా హౌస్ మేట్స్ తో మాట్లాడుతున్నా కూడా సరైన బాండింగ్ అనేది జరగలేదనే చెప్పాలి. చివరికి గొడవ కూడా గీతూతోనే జరగడం కాస్త నెగిటివ్ అయ్యిందని అనిపిస్తుంది. అలాగే నామినేషన్స్ విషయంలోనూ సరైన పాయింట్ తీసుకోలేక పోయారు. సరైన రీజన్ చెప్పకుండా నామినేషన్ చేయడం కూడా బాలాదిత్యకు మైనస్ అయ్యిందనే చెప్పాలి.

ఇక బాలాదిత్య ఏ విషయాన్నయినా చాలా విడమర్చి.. వివరంగా చెప్పడం కూడా ప్రేక్షకుల సహనానికి పరీక్షా  పెట్టిందనే చెప్పాలి. తన గేమ్ తాను ఆడకుండా పక్కన వల్ల గేమ్ లో తలదూర్చడం వారికి క్లాస్ తీసుకోవడం లాంటివి బాలాదిత్యకు మైనస్ అయ్యాయనే చెప్పాలి. ఇవన్నీ మార్చుకొని ఉంటే బాలాదిత్య టాప్ 5లో ఉండేవాడు.

ఇవి కూడా చదవండి
Video: ఐపీఎల్‌‌లోనే అత్యంత స్లో బాల్ విసిరిన ఆంధ్రా కుర్రాడు
Video: ఐపీఎల్‌‌లోనే అత్యంత స్లో బాల్ విసిరిన ఆంధ్రా కుర్రాడు
ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం నీరు తాగితే శరీరంలో కలిగే మ్యాజిక్‌
ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం నీరు తాగితే శరీరంలో కలిగే మ్యాజిక్‌
మారుతి నుంచి సూపర్‌ మైలేజీ ఇచ్చే కొత్త తరం కారు.. ధర చౌకగానే..
మారుతి నుంచి సూపర్‌ మైలేజీ ఇచ్చే కొత్త తరం కారు.. ధర చౌకగానే..
డొక్కా సీతమ్మగా సీనియర్ హీరోయిన్.. సినిమాకు వచ్చే డబ్బులన్నీ..
డొక్కా సీతమ్మగా సీనియర్ హీరోయిన్.. సినిమాకు వచ్చే డబ్బులన్నీ..
హైదరాబాద్ ఇన్-కమ్ టాక్స్ అధికారులపై.. సీబీఐ కేసు
హైదరాబాద్ ఇన్-కమ్ టాక్స్ అధికారులపై.. సీబీఐ కేసు
ఈ తేదీల్లో పుట్టిన వారికి సరిపోయే బెస్ట్ జోడీ ఎవరో తెలుసా..?
ఈ తేదీల్లో పుట్టిన వారికి సరిపోయే బెస్ట్ జోడీ ఎవరో తెలుసా..?
హాఫ్ సెంచరీతో సుదర్శన్ కీలక ఇన్నింగ్స్.. ముంబై టార్గెట్ 197
హాఫ్ సెంచరీతో సుదర్శన్ కీలక ఇన్నింగ్స్.. ముంబై టార్గెట్ 197
మధుమేహం బాధితులు పింక్‌ జామకాయ తింటే ఏమౌతుందో తెలుసా..?
మధుమేహం బాధితులు పింక్‌ జామకాయ తింటే ఏమౌతుందో తెలుసా..?
కిక్ సినిమాలో ఇలియానా చెల్లి ఇప్పుడు ఎలా ఉందో చూశారా..!
కిక్ సినిమాలో ఇలియానా చెల్లి ఇప్పుడు ఎలా ఉందో చూశారా..!
నిబద్ధతతో పనిచేసే కార్యకర్తలే కాంగ్రెస్ బలంః సుర్జేవాలా
నిబద్ధతతో పనిచేసే కార్యకర్తలే కాంగ్రెస్ బలంః సుర్జేవాలా